చిడతల అప్పారావు

హాస్య నటుడు

చిడతల అప్పారావు తెలుగు సినీ పరిశ్రమలో ఒక నటుడు. ఎక్కువగా తక్కువ నిడివి గల హాస్య ప్రధాన పాత్రలను పోషించాడు. నాటకరంగం నుంచి వచ్చిన ఈయన సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేశాడు. దర్శకులు జంధ్యాల, ఇ. వి. వి సత్యనారాయణ ఈయనకు తమ చిత్రాల్లో వేషాలిచ్చి ప్రోత్సహించారు.

చిడతల అప్పారావు
వృత్తినటుడు

నటజీవితం

మార్చు

చిడతల అప్పారావు నాటకరంగం నుంచి వచ్చినవాడు. సినిమాల్లో చిన్న చిన్న విషయాలు వేసేవాడు. పారితోషికం ఇంత అంటూ ఏమీ ఉండేది కాదు. నిర్మాతలు తమకు తోచినంత ఇచ్చేవారు. ఈయన కూడా అడిగితే ఉన్న వేషాలు కూడా పోతాయి అనే భయంతో కావలసిన పారితోషికం అడిగేవాడు కాదు. ఈయనతో పాటు థం లాంటి మరికొంతమంది చిన్న హాస్యనటులను జంధ్యాల ప్రోత్సహించి అవకాశాలిచ్చాడు.[1] తర్వాత జంధ్యాల శిష్యుడైన ఇ.వి.వి. సత్యనారాయణ కూడా అప్పారావుకు తన సినిమాల్లో అవకాశం కల్పించాడు.

అప్పారావు పెంకిపిల్ల అనే చిత్రంలో మొదటిసారిగా నటించాడు. వేషాల మీదనే ఆధారపడితే జీవనం గడవదని గ్రహించి మేకప్ నేర్చుకుని సహాయకుడిగా వెళ్ళేవాడు. దుస్తుల విభాగంలో కూడా పనిచేసేవాడు.

నటించిన చిత్రాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "నవ్వులు పంచారు... నమ్ముకుని ఉన్నారు!". సితార. Archived from the original on 2019-11-18. Retrieved 2020-08-06.

బయటి లింకులు

మార్చు