నీలిమందు విప్లవం

నీలిమందు విప్లవం అనేది ఒక రైతు ఉద్యమం. నీలిమందు ప్లాంటర్లకు (మొక్కల పెంపకందారులు) వ్యతిరేకంగా 1859 లో బెంగాల్‌లో నీలిమందు రైతులు చేసిన తిరుగుబాటు. గ్రామ పెద్దలు, గణనీయమైన సంఖ్యలో రైతులు రైతులకు నాయకత్వం వహించే అత్యంత చురుగ్గా ఇందులో పాల్గొన్నాయి. కొన్నిసార్లు అసంతృప్తులైన యూరోపియన్ ప్లాంటర్ల మాజీ ఉద్యోగులు - ఇండిగో కర్మాగారాల 'గోమాష్ట' లేదా 'దివాన్' లు- కూడా ఇండిగో ప్లాంటర్లకు వ్యతిరేకంగా రైతులను సమీకరించడానికి నాయకత్వం వహించారు.[1]

బెంగాల్‌లోని బికనీర్ రంగుల కర్మాగారం, 1867.

1859 వేసవిలో బెంగాల్‌లో వేలకొద్దీ రైతులు ఆవేశంతో, అంతులేని సంకల్పంతో యూరోపియన్ ప్లాంటర్ల కోసం నీలిమందును పెంచడానికి నిరాకరించినప్పుడు, మొదలైన ఈ విప్లవం, భారతదేశ చరిత్రలో అత్యంత అద్భుతమైన రైతు ఉద్యమాలలో ఒకటిగా నిలిచింది. నదియా జిల్లాలో ఉద్భవించిన తిరుగుబాటు 1860 లలో బెంగాల్‌లోని వివిధ జిల్లాలకు వ్యాపించింది. నీలిమందు కర్మాగారాలు, ప్లాంటర్లు చాలా చోట్ల హింసాత్మక దాడులను ఎదుర్కొన్నారు. 1860 లో ఇండిగో కమిషన్ ఏర్పడిన తర్వాత తిరుగుబాటు ముగిసింది. కమిషన్, దోపిడీ వ్యవస్థలో సంస్కరణలను తీసుకువచ్చింది.[2]

నేపథ్యం

మార్చు

బెంగాల్‌లో నీలిమందు సాగు చెయ్యడం 1777 నాటిది. ఫ్రెంచ్ వ్యక్తి లూయిస్ బొన్నాడ్ దీనిని భారత ఉపఖండానికి పరిచయం చేశాడు. అతను హుగ్లీ సమీపంలోని తాల్‌దంగా, గోల్‌పరాలో పంటను పండించడం ప్రారంభించి, బెంగాల్‌లో మొదటి నీలిమందు నాటిన వ్యక్తి అయ్యాడు. [3] ఐరోపాలో నీలిరంగు కోసం డిమాండ్ ఉన్నందున కంపెనీ పాలన కింద ఉన్న బెంగాల్ నవాబులు నీలిమందు పంట వాణిజ్యపరంగా మరింత లాభదాయకంగా మారింది. ఇది బుర్ద్వాన్, బంకురా, బీర్భూమ్, నార్త్ 24 పరగణాలు, నదియా జెస్సోర్, పాబ్నాలోని అనేక ప్రాంతాలలో ప్రవేశపెట్టారు. 1830 నాటికి బెంగాల్ అంతటా వెయ్యికి పైగా నీలిమందు కర్మాగారాలు ఏర్పడ్డాయి. రైతులు తమ సొంత భూముల్లో ఆహార పంటలకు బదులు నీలిమందు నాటాలని రైతులను ఒత్తిడి చేశారు. వారికి చాలా ఎక్కువ వడ్డీకి డాడోన్ అని పిలిచే రుణాలను అందించారు. ఒకసారి ఒక రైతు అటువంటి రుణాలు తీసుకున్న తర్వాత జీవితాంతం అప్పుల్లోనే ఉండిపోయేవాడు. అప్పును తన వారసులకు బదిలీ చేసేవాడు తప్ప తీరేది కాదు. ప్లాంటర్లు చెల్లించే ధర చాలా తక్కువగా, మార్కెట్ ధరలో 2.5% మాత్రమే, చెల్లించేవారు నీలి పండు పండించే రైతులకు ఎలాంటి లాభం ఉండేది కాదు. ఇండిగో ప్లాంటర్‌ల నుండి రైతులకు పూర్తిగా రక్షణ ఉండేది కాదు. రైతులు తమ ఆజ్ఞలను పాటించడానికి ఇష్టపడకపోతే ఆస్తిని జప్తు చేసుకునేవారు. ప్రభుత్వ నిబంధనలు మొక్కల పెంపకందారులకు అనుకూలంగా ఉండేవి. రైతులతో ఇచ్ఛానుసారం వ్యవహరించడానికి వీలుగా ప్లాంటర్లకు స్వేచ్ఛ నిస్తూ 1833 లో ఒక చట్టం చేసారు. జమీందార్లు, ఇండిగో సాగు నుండి ప్రయోజనం పొందేవారు అందరూ ప్లాంటర్ల పక్షం వహించారు. ఈ పరిస్థితుల్లో, చేసేది లేక రైతులు తిరుగుబాటుకు దిగారు.[4][5]

బెంగాలీ మధ్యతరగతి మొత్తం రైతులకు మద్దతుగా నిలిచింది. బెంగాలీ మేధావి హరీష్ చంద్ర ముఖర్జీ తన వార్తాపత్రిక ది హిందూ పేట్రియాట్‌లో పేద రైతుల కష్టాలను వివరించాడు. అయితే దీనబంధు మిత్ర తన నీల్ దర్పణ్ నాటకం ఆ కథనాలను వెనక్కి నెట్టేసింది. ఆ నాటకం భారీ వివాదాన్ని సృష్టించింది. భారతీయులలో రేకెత్తిన ఆందోళనలను నియంత్రించడానికి కంపెనీ అధికారులు ఆ నాటకాన్ని నిషేధించారు.

తిరుగుబాటు

మార్చు

నదియా జిల్లా కృష్ణానగర్ సమీపంలోని చౌగాచా గ్రామంలో [6] తిరుగుబాటు ప్రారంభమైంది, ఇక్కడ బిష్ణుచరణ్ బిస్వాస్, దిగంబర్ బిస్వాస్‌లు మొదటగా 1859 లో ప్లాంటర్లకు వ్యతిరేకంగా బెంగాల్ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఇది ముర్షిదాబాద్, బీర్భూమ్, బుర్ద్వాన్, పాబ్నా, ఖుల్నా, జెస్సోర్‌లలో వేగంగా వ్యాపించింది. కల్నాలో, బుర్ద్వాన్ శ్యామల్ మోండల్ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. మోండల్ "మృతిక" అనే పత్రికలో ఇండిగో ప్లాంటర్ల అణచివేతలు, రైతుల దుస్థితి గురించి రాసాడు.[7] రైతు నాయకుడు గోపాల్ మండల్, నూట యాభై మంది రైతులతో కూడిన బృందంతో, నీలిమందు సాగు చేయడానికి అడ్వాన్స్‌లు తీసుకోమని రైతులను భయపెట్టడానికి ప్లాంటర్ లార్మూర్ పంపిన లాటియాల్‌లపై దాడి చేసి తిరిగి కొట్టారు.[6] కొంతమంది నీలిమందు పెంపకందారులపై బహిరంగంగా విచారణ జరిపి ఉరితీసారు. ఇండిగో డిపోలను తగలబెట్టారు. చాలా మంది ప్లాంటర్లు పారిపోయారు. జమీందార్లను కూడా తిరుగుబాటు రైతుల లక్ష్యంగా చేసుకున్నారు.

 
ఉత్తర 24 పరగణాల్లోని మంగోల్‌గంజ్ ఇండిగో కుఠి

ప్రతిస్పందనగా, ప్లాంటర్లు కిరాయి సైనికుల సమూహాలను నియమించుకుని, తిరుగుబాటు చేసిన రైతులతో నిరంతరంగా ఘర్షణలకు పాల్పడ్డారు. 1857 నాటి భారతీయ తిరుగుబాటు వలె కాకుండా, తిరుగుబాటుదారులు బ్రిటిషు వలస అధికారుల వైపు తమ శత్రుత్వాన్ని మళ్లించకుండా, తమ దృష్టిని పూర్తిగా యూరోపియన్ ప్లాంటర్లు, వ్యాపారుల మీదనే కేంద్రీకరించారని చరిత్రకారులు గుర్తించారు; చరిత్రకారుడు సుభాస్ భట్టాచార్య ది ఇండిగో రివోల్ట్ ఆఫ్ బెంగాల్ (1977)లో "ఈ ఉద్యమం ప్లాంటర్లకు వ్యతిరేక పోరాటంగా ప్రారంభమైంది, అలాగే ముగిసింది" అని పేర్కొన్నాడు. చివరికి నీలిమందు మొక్కల పెంపకందారుల కిరాయి దళాలు తిరుగుబాటును అణచివేసారు. అయితే బెంగాల్, కథ్‌గరా ప్రాంతాలతో పాటు నీలిమందు ఉత్పత్తి చేసే పెద్ద పెద్ద ప్రాంతాలలో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయడాన్ని అడ్డుకోలేకపోయారు. తమ నీలిమందు ఒప్పందాలను ఉల్లంఘించినందుకు ప్లాంటర్లు వందలాది మంది రైతులపై దావాలు వేశారు. ఈ వ్యాజ్యాలను సమర్థించడం కోసం పదిహేడు వేల రూపాయలకు పైగా ఖర్చు చేశారు.[8]

అనంతర పరిణామాలు

మార్చు

రైతుల ప్రతిఘటన పద్ధతులు అన్ని చోట్లా ఒకేలా లేవు. చౌగచా, గోబిందాపూర్‌లలో బిష్ణుచరణ్, దిగంబర్‌లు ప్రారంభించిన తిరుగుబాటులో, ప్లాంటర్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసారు. కానీ ఇది సమయం ప్రదేశంతో మారుతూ పోయింది. చాలా వరకు అది నిష్క్రియగాను, అహింసాయుతంగానూ జరిగింది.[9] చరిత్రకారుడు జోగేష్ చంద్ర బాగల్ ఆ తిరుగుబాటును అహింసా విప్లవంగా అభివర్ణించాడు. సిపాయిల తిరుగుబాటుతో పోలిస్తే నీలిమందు తిరుగుబాటు విజయవంతమవడానికి ఇది ఒక కారణమని అతను చెప్పాడు.[10] గాంధీ విజయవంతంగా అమలు చేసిన అహింసాయుత ప్రతిఘటనకు ఇది మార్గగామి అని RC మజుందార్ "హిస్టరీ ఆఫ్ బెంగాల్" లో రాసాడు. తిరుగుబాటు, ప్రభుత్వంపై బలమైన ప్రభావాన్ని చూపింది. 1860 లో బ్రిటిషు ప్రభుత్వం "ఇండిగో కమిషన్"ను నియమించింది. కమిషన్ తన నివేదికలో ఫరీద్‌పూర్ మేజిస్ట్రేట్ EWL టవర్, "మానవ రక్తపు మరకలు లేకుండా ఒక్క ఇండిగో పెట్టె కూడా ఇంగ్లండ్‌ చేరుకోలేదు" అని పేర్కొన్నాడు.[11]

ఇండిగో ప్లాంటర్ల అణచివేతలకు ముగింపు పలకాలని లక్ష్యంగా పెట్టుకున్న నవాబ్ అబ్దుల్ లతీఫ్ ఒత్తిడికి ప్రతిస్పందనగా బ్రిటిషు అధికారులు 1860 లో ఇండిగో కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ కృషితో 1862 ఇండిగో చట్టం రూపొందింది.

జనాదరణ పొందిన సంస్కృతిలో

మార్చు
 
నీల్ దర్పణ్

దీనబంధు మిత్ర రసిన 1860 నాటి నాటకం నీల్ దర్పణ్‌ను ఈ తిరుగుబాటు ఆధారంగా రూపొందించాడు. దీన్ని ఢాకాలో ప్రచురించారు. దీనిని కవి మైఖేల్ మధుసూదన్ దత్తా ఆంగ్లంలోకి అనువదించాడు. ఆంగ్లికన్ చర్చి పూజారి జేమ్స్ లాంగ్ దాన్ని ప్రచురించాడు. నాటకాన్ని ప్రచురించినందుకు, లాంగ్‌ను వలసరాజ్య అధికారులు విచారణ చేసి, జైలు శిక్ష, 1,000 రూపాయల జరిమానా విధించారు. లాంగ్ స్నేహితుడు కాళీప్రసన్న సింఘా అతని కోసం జరిమానా చెల్లించాడు. ఈ నాటకం బెంగాల్‌లో రంగస్థల అభివృద్ధికి దోహదపడింది. గిరీష్ చంద్ర ఘోష్‌పై ప్రభావం చూపింది. అతను 1872 లో కోల్‌కతాలో నేషనల్ థియేటర్‌ను స్థాపించాడు. అక్కడ వాణిజ్యపరంగా ప్రదర్శించబడిన మొదటి నాటకం నీల్ దర్పణ్ . [12] బెన్ ముస్గ్రేవ్ నాటకం ఇండిగో జెయింట్, దీనబంధు మిత్ర రాసిన నీల్‌ దర్పణ్ నుండి ప్రేరణ పొందింది. దీన్ని 2022లో బంగ్లాదేశ్‌లో, 2024లో UKలో ప్రదర్శించారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Kling, Blair B. (2016-11-11). The Blue Mutiny: The Indigo Disturbances in Bengal, 1859-1862 (in ఇంగ్లీష్). University of Pennsylvania Press. pp. 84–86. ISBN 978-1-5128-0350-1.
  2. "Indigo Revolt in Bengal". Indian Culture (in ఇంగ్లీష్). Retrieved 2022-07-30.
  3. Chaudhuri, Kalyan (2016). Madhyamik History And Environment. 56, Surya Sen Street, Kolkata-700009: Oriental Book Company Pvt. Ltd. p. 54.{{cite book}}: CS1 maint: location (link)
  4. "Indigo Revolt in Bengal". Indian Culture (in ఇంగ్లీష్). Retrieved 2022-07-30."Indigo Revolt in Bengal". Indian Culture. Retrieved 2022-07-30.
  5. নীলবিদ্রোহ এবং অম্বিকা কালনা. www.anandabazar.com (in Bengali). Retrieved 2022-07-30.
  6. 6.0 6.1 "Social Scientist, issues 60, July 1977, page 13. -- The Social Scientist -- Digital South Asia Library". dsal.uchicago.edu.
  7. নীলবিদ্রোহ এবং অম্বিকা কালনা. www.anandabazar.com (in Bengali). Retrieved 2022-07-30.নীলবিদ্রোহ এবং অম্বিকা কালনা. www.anandabazar.com (in Bengali). Retrieved 2022-07-30.
  8. Bhattacharya, Subhas (July 1977). "The Indigo Revolt of Bengal".
  9. "Social Scientist, issues 60, July 1977, page 16. -- The Social Scientist -- Digital South Asia Library". dsal.uchicago.edu. Retrieved 2021-08-30.
  10. Majumdar, R. C. The Government in 1860 enacted the Indigo Act, according to which no planter could be forced to cultivate indigo against his will. The History of Bengal ISBN 81-7646-237-3
  11. The Calcutta Review. University of Calcutta. 1861-01-01. p. 291.
  12. "Nildarpan (play by Mitra) – Britannica Online Encyclopedia".