బర్ధమాన్, భారతదేశం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఒక నగరం. ఇది పురపాలిక పట్టణం. బ్రిటీష్ పాలనలో పూర్వ బర్దమాన్ జిల్లాకు రాజధాని, కొత్తగా ఏర్పడిన ప్రస్తుత పుర్బా బర్ధమాన్ జిల్లా ప్రధానకార్యాలయం. నగరానికి ప్రత్యామ్నాయ పేరు బుర్ద్వాన్ అప్పటి నుండి వాడుకలో ఉంది.

Bardhaman
Burdwan
City
Bajeprotappur, Burdwan
Burdwan City at night
Nickname: 
Royal Heritage City of West Bengal
Bardhaman is located in West Bengal
Bardhaman
Bardhaman
Bardhaman is located in India
Bardhaman
Bardhaman
Bardhaman is located in Asia
Bardhaman
Bardhaman
Coordinates: 23°14′N 87°52′E / 23.233°N 87.867°E / 23.233; 87.867
Country India
రాష్ట్రం West Bengal
జిల్లాPurba Bardhaman
Government
 • TypeMunicipality
 • Body
  • Bardhaman Municipality
  • Burdwan Development Authority
 • ChairmanParesh Chandra Sarkar[1]
 • Vidhan Sabha MLANo. 260 Bardhaman Dakshin: Khokan Das (AITC)
 • Lok Sabha MPNo. 39 Bardhaman–Durgapur: S. S. Ahluwalia (BJP)
విస్తీర్ణం
 • City26.30 కి.మీ2 (10.15 చ. మై)
 • Metro157.62 కి.మీ2 (60.86 చ. మై)
Elevation
30 మీ (100 అ.)
జనాభా
 (2011)[4]
 • City3,47,016
 • జనసాంద్రత13,000/కి.మీ2 (34,000/చ. మై.)
 • Metro4,07,000
Languages
 • OfficialBengali[5][6]
 • Additional officialEnglish[6]
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్
713101, 713102, 713103, 713104 713141,713149.
Telephone code+91-342
Vehicle registrationWB-42

వ్యుత్పత్తి శాస్త్రం

మార్చు

ఈ పేరు మూలం సా.శ. పూర్వం ఆరవ శతాబ్దానికి చెందినట్లుగా తెలుస్తుంది. జైన మత 24వ తీర్థంకారుడైన వర్ధమాన లేదా మహావీర (బిసిఇ 599-527)కి ఆపాదించబడింది, అతను జైనగ్రంథం కల్పసూత్రం ప్రకారం, ఆస్తికా గ్రామంలో కొంతకాలం గడిపాడు. అతని గౌరవార్థం ఈ ప్రదేశానికి వర్ధమాన్ అనేపేరువచ్చింది.

చరిత్ర

మార్చు

ఈ నగరానికి జహంగీర్ కాలంలో ఈ ప్రదేశానికి బధ్-ఏ-దివాన్ (జిల్లా రాజధాని) అని పేరు పెట్టారు. దిగువ బెంగాల్‌లోని ప్రధాన కులీనులైన బుర్ద్వాన్ మహారాజుల ప్రధాన కార్యాలయంగా దాని చారిత్రక ప్రాముఖ్యతను కలిగిఉంది. 1657లో బర్ధమాన్ రాజ్ పంజాబ్‌లోని లాహోర్‌లోని కోట్లి హిందూ ఖత్రీ కుటుంబానికి చెందిన సంగమ్ రాయ్ చేత స్థాపించబడింది. అతని వారసులు మొఘల్ చక్రవర్తులు బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేశారు.

మహతాబ్ చంద్ బహదూర్, తరువాత బిజోయ్ చంద్ మహతాబ్ ఈ ప్రాంతాన్ని సాంస్కృతికంగా, ఆర్థికంగా, పర్యావరణపరంగా ఆరోగ్యంగా మార్చడానికి తమ వంతు కృషి చేశారు. ప్రధాన విద్యాసంస్థ బుర్ద్వాన్ రాజ్ కళాశాల, ఇది మహారాజా పాలన నుండి పూర్తిగా మద్దతు ఇవ్వబడింది. బతుకేశ్వర్ దత్ 1900ల ప్రారంభంలో భారతీయ విప్లవకారుడు, స్వాతంత్ర్యసమరయోధుడు 1910 నవంబరు 18న న బుర్ద్వాన్ జిల్లాలోని ఓరీ గ్రామంలో జన్మించాడు. అతను 1929 ఏప్రిల్ 8న న్యూ ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు పేలిన ఘటనలో భగత్ సింగ్‌తో పాటు ప్రసిద్ధి చెందాడు. ఈ నగరం ఉత్తర- భారత శాస్త్రీయ సంగీతానికి ఒక ముఖ్యమైన కేంద్రం.

భౌగోళికం

మార్చు

ఈ ప్రాంతం సముద్రమట్టానికి 40మీటర్లు (131 అడుగులు) సగటు ఎత్తులో ఉంది.ఈ నగరం న్యూ ఢిల్లీ నుండి 1100 కిమీ దూరంలో, కోల్‌కతాకు వాయువ్యంగా 100 కి.మీ కంటే కొంచెం తక్కువ దూరంలో తూర్పు రైల్వేవిభాగంలోఉంది. దీనికి సమీప ప్రధాన నదులు దామోదర్, బంకా.[7]

గల్సి రక్షకభట నిలయం పరిధిలోని మల్లసరుల్ గ్రామంలో కనుగొనబడిన సా,శ. ఆరవ శతాబ్దపు రాగి ఫలకంలో ఈ ప్రదేశం పేరుకు సంబంధించిన మొదటి ఎపిగ్రాఫిక్ ప్రస్తావన ఉంది. రాధ్ బెంగాల్‌లో ప్రధాన భాగమైన ఈ ప్రాంతం బిసిఇ 4000 నాటిదని పురావస్తు ఆధారాలు సూచిస్తున్నాయి.

పోలీస్ స్టేషన్లు

మార్చు

బుర్ద్వాన్ రక్షకభట నిలయం అధికార పరిధిలో బర్ధమాన్ పురపాలిక ప్రాంతం, బుర్ద్వాన్ I, బుర్ద్వాన్ II సిడి బ్లాకుల ప్రాంతాలు కలిగిఉన్నాయి. దాని అధికార పరిధిప్రాంతం 192.15 కిమీ 2.బరాబజార్, మురాద్‌పూర్, కేశబ్‌గంజ్, నూతన్‌గంజ్, బిర్హటాలో ఔట్ పోస్టులు ఉన్నాయి.[8][9]

బుర్ద్వాన్ మహిళా రక్షకభట నిలయం పరిధిలో బర్ధమాన్ పురపాలక ప్రాంతం, బుర్ద్వాన్ I బుర్ద్వాన్ II సిడి బ్లాక్‌లపై అధికార పరిధిని కలిగిఉంది. దీని సేవలు అందించే అధికార పరిధి ప్రాంతం 192.15 చ.కి.మీ. ఉంది.[8][9]

గణాంకాలు

మార్చు
బర్ధమాన్‌లో మతం ప్రకారం జనాభా[10]
Religion Percent
హిందూ
  
83.42%
ఇస్లాం
  
14.88%
మత వివరం తెలపనివారు
  
1.19%
క్రైస్తవులు
  
0.19%
ఇతరులు
  
0.32%
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
195176,000—    
19611,09,000+43.4%
19711,44,000+32.1%
19811,70,000+18.1%
19912,46,000+44.7%
20012,87,000+16.7%
20113,47,016+20.9%

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,బర్ధమాన్ పట్టణ సముదాయం 347,016 మంది జనాభాను కలిగి ఉంది,అందులో 1,77,055 మంది పురుషులు ఉండగా, 1,69,961 మంది మహిళలు ఉన్నారు. 25,069 మంది 0–6 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఉన్నారు. జనాభాకు సమర్థవంతమైన అక్షరాస్యతరేటు 88.62% ఉంది.[4]

ప్రయాణ సౌకర్యం

మార్చు

రహదారి మార్గం

మార్చు

గ్రాండ్ ట్రంక్ రోడ్ నగరం అంతటా నడుస్తుంది. జాతీయ రహదారి 19 (పాత నంబరు ఎన్ఎచ్ 2) నగరాన్ని దాటవేస్తుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎస్.బి.ఎస్.టి.సి), ఇతర ప్రైవేట్ ఆపరేటర్లు అరంబాగ్, అసన్‌సోల్, బహరంపూర్, బంకురా, బోల్పూర్, ఎస్ప్లానేడ్, కిర్నాహర్, పురూలియా, సాల్ట్‌లేక్, తారకేశ్వర్ నుండి బస్సులను నడుపుతున్నారు. బర్ధమాన్ చుట్టూఉన్న అనేక ప్రదేశాలతో బస్సులు ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. చాలా బస్సులు అలీషా బస్టాండ్, నబాభత్ బస్టాండ్ నుండి వచ్చి బయలుదేరుతాయి. బుర్ద్వాన్‌లో పట్టణ సర్వీస్ అని పిలువబడే బస్సు ద్వారా సేవలు ఉన్నాయి.ఇది నగరంలోని వివిధ ప్రాంతాలను కలుపుతుంది. సదర్‌ఘాట్ రోడ్ బర్ధమాన్‌ను బంకురా (పరోక్షంగా), హుగ్లీ (ప్రత్యక్షంగా) జిల్లాతో కలుపుతుంది.

రైలు మార్గం

మార్చు

హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు ట్రాక్ బర్ధమాన్ గుండా వెళుతుంది. నగరానికి బర్ధమాన్ రైల్వే స్టేషన్ సేవలు అందిస్తుంది.హౌరారాజధాని ఎక్స్‌ప్రెస్ (పాట్నా మీదుగా) బర్ధమాన్ వద్ద నిలబడే సదుపాయం ఉంది. హౌరా నుండి స్థానిక రైలు ద్వారా రెండు గంటలలో చేరుకోవచ్చు.

విద్య

మార్చు

విశ్వవిద్యాలయ

మార్చు

బుర్ద్వాన్ విశ్వవిద్యాలయాన్ని 1960 జూన్ 15న దాని మొదటి వైస్-ఛాన్సలర్ సుకుమార్ సేన్ అధికారికంగా ప్రారంభించారు.1950లలో జమీందారీ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత, బుర్ద్వాన్ రాజ్ చివరి ప్రతినిధి ఉదయ్ చంద్ మహతాబ్, బుర్ద్వాన్‌లోని తన మొత్తం ఆస్తిని రాష్ట్ర ప్రభుత్వానికి వదిలిపెట్టాడు. ఇది అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బిధాన్ చంద్ర రాయ్ చొరవతో ఈ విశ్వవిద్యాలయం స్థాపనను సులభతరం చేసింది. ప్రస్తుతం పరిపాలనా పనులు ఎక్కువగా రాజబతి (బర్ద్ధమాన మహారాజా ప్యాలెస్) నిలయంనుండి జరుగుచున్నాయి. మరోవైపు, గోలప్‌బాగ్ నిలయం విద్యాకార్యకలాపాల కేంద్రం.

కళాశాలలు

మార్చు
  • బుర్ద్వాన్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్
  • బుర్ద్వాన్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్
  • బుర్ద్వాన్ మెడికల్ కళాశాల
  • బుర్ద్వాన్ రాజ్ కళాశాల
  • మహారాజాధిరాజ్ ఉదయ్ చంద్ మహిళా కళాశాల
  • ఎం.బి.సి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
  • యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బుర్ద్వాన్ యూనివర్సిటీ
  • వివేకానంద మహావిద్యాలయం
  • సెయింట్ జేవియర్స్ కళాశాల, బుర్ద్వాన్

పాఠశాలలు

మార్చు
  • బుర్ద్వాన్ సిఎంఎస్ ఉన్నత పాఠశాల (ప్రధాన), బిసి రోడ్ - పశ్చిమ బెంగాల్ బోర్డ్
  • బుర్ద్వాన్ పరపాలిక బాలికల ఉన్నత పాఠశాల - పశ్చిమ బెంగాల్ బోర్డ్
  • బుర్ద్వాన్ పురపాలిక ఉన్నత పాఠశాల - 1883లో దేవేంద్రనాథ్ ఠాగూర్చే స్థాపించబడింది
  • సెయింట్ జేవియర్స్ పాఠశాల -సి.ఐ.ఎస్.సి.ఇ

ఆసక్తికరమైన ప్రదేశాలు

మార్చు
  • కర్జన్ గేట్ - మహారాజా బిజయ్ చంద్ మహతాబ్ పట్టాభిషేకం కోసం 1902-1903లో కర్జన్ గేట్ నిర్మించబడింది. పూర్వపు రాజభవనం గేట్ నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉంది.[11][12] 1904లో లార్డ్ కర్జన్ బర్ధమాన్ సందర్శన వైభవం, గొప్పతనం కారణంగా గేట్ పేరు కర్జన్ గేట్‌గా స్థిరపడింది. దీనిని బిజయ్ తోరన్ అని కూడా అంటారు.[11][13]
  • షేర్ ఆఫ్గన్, కుతుబుద్దీన్ ఖాన్ సమాధులు కోకా - మెహర్-ఉన్-నిస్సా, అప్పటి షేర్ ఆఫ్గన్ భార్య, బర్ధమాన్ జాగీర్దార్, ఒకప్పుడు బర్ధమాన్ నివాసి. మొఘల్ చక్రవర్తి జహంగీర్ ఆమెతో ప్రేమలో పడ్డాడని, ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని చెబుతారు. అతను తన పెంపుడు సోదరుడు, బెంగాల్‌కు చెందిన సుబాదర్, కుతుబుద్దీన్ ఖాన్ కోకా సహాయంతో ఆమెను పొందడానికి ప్రయత్నించాడు. కుతుబుద్దీన్ ఖాన్ కోకాతో జరిగిన పోరాటంలో షేర్ ఆఫ్గన్ మరణించాడు.అతను కూడా చంపబడ్డాడు. ఇద్దరినీ 1607లో (లేదా కొన్ని మూలాల ప్రకారం 1610) బర్ధమాన్ వద్ద ఒక పర్షియన్ సూఫీ సెయింట్ పీర్ బహరమ్ సిక్కా ఉన్న ప్రదేశంలో ఖననం చేశారు. మెహర్-ఉన్-నిస్సా చివరికి సామ్రాజ్ఞి నూర్జహాన్‌గా అవతరించింది.[14][15]
  • రాజ్‌బరి - బర్ధమాన్ రాజ్ కుటుంబానికి చెందిన రాజభవనం, 19వ శతాబ్దంలో మహతాబ్‌చంద్‌చే నిర్మించబడింది.ఈ ప్రదేశంలో గతంలో మొఘల్ కోట ఉందని నమ్ముతారు .రాజ్‌బరీని కోల్‌కతాకు చెందిన బర్న్ అండ్ కంపెనీ నిర్మించింది. ప్రధాన హాలులో చాలా విలువైన పెయింటింగ్స్ ఉన్నాయి.[13] ఉదయ్ చంద్ మహతాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాజబతి అప్పగించారు.ఇది ఇప్పుడు బుర్ద్వాన్ విశ్వవిద్యాలయం పరిపాలనా కార్యాలయాలను కలిగి ఉంది.[16]
  • గోలబాగ్, రామనా బగన్, జింకల ఉద్యానవనం - గోలప్‌బాగ్ 19వ శతాబ్దంలో బొటానికల్, జూలాజికల్ గార్డెన్‌గా అభివృద్ధి చేయబడింది. ఇందులో బోటింగ్ కోసం సరస్సులు, హవా మహల్ ఉన్నాయి. బుర్ద్వాన్ విశ్వవిద్యాలయంలోని అనేక విద్యా విభాగాలు అక్కడ ఉన్నాయి. రామనా బగన్‌లో ఒకప్పుడు బ్రహ్మ సమాజం ఉండేది. ఇది ఇప్పుడు జింకల పార్కుగా మార్పు చెందింది.[13]
  • సర్బమంగళ దేవాలయం - సర్బమంగళ దేవాలయం, ఇది బర్ధమాన్ రాజ్ ప్రధాన దేవత, దామోదర్ నది ఇసుక పడకపై కనుగొనబడిందని నమ్ముతారు.[15] ఇది టెర్రకోట దుర్గా ఫలకాన్ని కలిగి ఉన్న నాట్య మందిరంతో కూడిన నవరత్న దేవాలయం.[13]
  • బర్ధమానేశ్వర్ శివాలయం - శివాలయంలో భారీ విగ్రహం ఉంది.[15] ఈ ఆలయంలోని శివలింగాన్ని మానసమంగల్ ఫేమ్ చంద్ సదాగర్ స్థాపించాడని చాలా మంది నమ్ముతారు.[13]
  • కమలాకాంత కలిబారి - ఇది కవి-భక్తుడు సాధక్ కమలకాంతతో సంబంధం ఉన్న కాళీ దేవాలయం.[15]
  • 108 శివాలయ సముదాయం - బర్ధమాన్ సమీపంలోని నవాభట్ వద్ద మహారాణి బిష్ణు కుమారి నిర్మించిన శివాలయ సముదాయం సుందరమైన నేపథ్యాన్ని కలిగి ఉంది.[15] 1788లో నిర్మించిన ఆలయ సముదాయం శిథిలావస్థకు చేరుకుంది బిర్లా పబ్లిక్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా పూర్తిగా పునరుద్ధరించబడింది.[13]
  • కంకళేశ్వరి మందిర్ - కాంచనగర్‌లోని ఆలయం, మానవ అస్థిపంజరాన్ని పోలిన దేవత.[15] ఇది టెర్రకోట శిల్పాలతో కూడిన నవరత్నాలయం.ఈ విగ్రహం ఆరు అడుగుల ఎత్తు ఉన్న ఎనిమిది సాయుధ దేవత చాముండి విగ్రహం .[13]
  • ఖ్వాజా అన్వర్ బెర్హ్ సమాధి - 1315 హిజ్రీలో పొద్దర్‌హాట్‌లో ఖననం చేయబడిన మొఘల్ యోధుని సమాధి, మొఘల్ వాస్తుశిల్పానికి చక్కటి ఉదాహరణ.[13][15]
  • షేర్షాహి కలో మసీదు - పురాటన్ చక్ (పైరఖానా రోడ్) ప్రాంతంలోని మసీదు షేర్ షా సూరి పాలనలో నిర్మించబడింది.[13]
  • షాహీ జుమ్మా మసీదు - మూడు మినార్లతో కూడిన మసీదు రాజ్‌బతి వెనుక ఔరంగజేబ్ మనవడు, బెంగాల్, బీహార్, ఒడిశాకు చెందిన సుబాదర్ చేత నిర్మించబడిన చారిత్రాత్మక నిర్మాణం.[13][15]
  • బుర్ద్వాన్ సైన్స్ సెంటర్ - యూనివర్శిటీ క్యాంపస్‌కు సమీపంలో ఉన్న ఉన్నత ప్రమాణాల విజ్ఞానశాస్త్ర సంగ్రహాలయం ఉంది.[15]
  • మేఘనాద్ సాహా ప్లానిటోరియం - 1994లో ప్రారంభించబడింది, ప్రధాన పరికరం బుర్ద్వాన్ విశ్వవిద్యాలయానికి జపాన్ ప్రభుత్వం నుండి బహుమతిగా అందింది. రాష్ట్రంలోని రెండవ ప్లానిటోరియం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడింది, దీనికి భారతీయ శాస్త్రవేత్త మేఘనాద్ సాహా పేరు పెట్టారు. గోలప్‌బాగ్ సమీపంలో ఉన్న ఇది ప్రతి షోలో 90 సీట్లతో ప్రతిరోజూ ఆరు షోల ఏర్పాటును కలిగి ఉంది. ఇది సోమవారాల్లో మూసివేయబడుతుంది.[13][15]
  • బిర్హత కలిబారి (బోరో మా) : 10 అడుగుల కాళీ దేవి శిల్పం స్పర్శరాతితో తయారు చేయబడింది. ఈ దేవతను స్థానికంగా బోరో మా అని పిలుస్తారు. ఈ ఆలయానికి కాళీబజార్ అని పేరు పెట్టారు.ఈ ఆలయం ఒక సందుతో రెండు భాగాలుగా విభజించబడింది. ఒక భాగం కాళీ మందిరం, మరొకటి దుర్గా మందిరం.
  • క్రైస్ట్ చర్చ్: క్రైస్ట్ చర్చ్ బర్ధమాన్ "కర్జన్ గేట్" సమీపంలోని బర్ధమాన్‌లోని ప్రసిద్ద చర్చి.
  • టౌన్ హాల్: టౌన్ హాల్ 1890, 1894 మధ్య కాలంలో నిర్మించబడింది. లాలా బన్సోగోపాల్ నందే అవశేషాలను భద్రపరచడంలో సహాయపడటానికి బర్ధమాన్ పురపాలస సంఘానికి అప్పగించబడింది.[17] పురపాలక సంఘం 1990లో హాల్‌ను 485 సీట్ల సీటింగ్ కెపాసిటీతో మునుపటి 704 చదరపు అడుగుల నుండి 2400 చదరపు అడుగులకు పునరుద్ధరించింది.[18]

మూలాలు

మార్చు
  1. "Burdwan Municipality". www.burdwanmunicipality.gov.in. Retrieved 30 December 2020.
  2. "Burdwan Municipality - Area of Populations". burdwanmunicipality.gov.in. Retrieved 24 November 2020.
  3. 3.0 3.1 "Burdwan Development Authority". www.bdaburdwan.org. Retrieved 1 February 2021.
  4. 4.0 4.1 "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 21 October 2011.
  5. "52nd Report of the Commissioner for Linguistic Minorities in India" (PDF). Nclm.nic.in. Ministry of Minority Affairs. p. 85. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 28 August 2019.
  6. 6.0 6.1 "Fact and Figures". Wb.gov.in. Retrieved 28 August 2019.
  7. "Maps, Weather, and Airports for Barddhaman, India". fallingrain.com. Retrieved 25 July 2016.
  8. 8.0 8.1 "District Statistical Handbook 2014 Bardhaman". Tables 2.1, 2.2. Department of Statistics and Programme Implementation, Government of West Bengal. Archived from the original on 21 January 2019. Retrieved 23 September 2018.
  9. 9.0 9.1 "Purba Bardhaman District Police". Police Station. West Bengal Police. Archived from the original on 27 September 2018. Retrieved 23 September 2018.
  10. "C-1 Population By Religious Community - Bardhaman (M)". Retrieved 17 August 2020.
  11. 11.0 11.1 "Census of India 2011: District Census Handbook, Barddhaman, Series-20, Part-XIIB" (PDF). Motif. Diretorate of Census Operations, West Bengal. Retrieved 10 March 2017.
  12. "Curzon Gate, Bardhaman". Weekend Destinations. Holidify. Retrieved 10 March 2017.
  13. 13.00 13.01 13.02 13.03 13.04 13.05 13.06 13.07 13.08 13.09 13.10 Chattopadhyay, Akkori, Bardhaman Jelar Itihas O Lok Sanskriti (History and Folk lore of Bardhaman District.), (in Bengali), Vol II, pages 565-576, Radical Impression. ISBN 81-85459-36-3
  14. Ghosh, Binoy, Paschim Banger Sanskriti, (in Bengali), part I, 1976 edition, pages 103-104, Prakash Bhaban
  15. 15.00 15.01 15.02 15.03 15.04 15.05 15.06 15.07 15.08 15.09 "Purba Bardhaman district". Tourism. District Administration. Retrieved 12 February 2019.
  16. "The University of Burdwan". History of Burdwan University. BU. Archived from the original on 6 మార్చి 2019. Retrieved 3 March 2019.
  17. "Burdwan Municipality". Retrieved 11 April 2021.
  18. "Town Hall, Bardhaman". Trawel. Archived from the original on 11 ఏప్రిల్ 2021. Retrieved 11 April 2021.

వెలుపలి లంకెలు

మార్చు


"https://te.wikipedia.org/w/index.php?title=బర్ధమాన్&oldid=4341201" నుండి వెలికితీశారు