నూతలపాటి పేరరాజు

నూతలపాటి పేరరాజు ప్రఖ్యాత రచయిత. సాహిత్యసరస్వతి, విద్యార్ణవ మొదలైన బిరుదులు ఇతనికి ఉన్నాయి. ప్రకాశం జిల్లా (అప్పటి గుంటూరు జిల్లా), నూతలపాడు గ్రామంలో 1896లో సీతమ్మ, ఆదిరాజు దంపతులకు జన్మించాడు. ఇతడి విద్యాభ్యాసం నూతలపాడులో నడిచింది. ఇతడు పెక్కు సంవత్సరాలు ఆంధ్రభాషోపాధ్యాయుడిగా అనంతపురం జిల్లా ఉరవకొండలో పనిచేసి అక్కడే స్థిరపడిపోయాడు. నాలుగున్నర దశాబ్దాలకు పైగా రాయలసీమ ప్రాంతంలో జీవించడం వల్ల ఇతడు రాయలసీమ కవిగా వాసికెక్కాడు. ఇతడు అనేక గ్రంథాలు రచించాడు. ఆనాటి స్కూల్ ఫైనల్ విద్యార్థులకు తెలుగు పాఠ్యపుస్తకాలను అరటిపండు వొలిచి చేతికిచ్చినట్లుగా సులభ పద్ధతిలో నోట్సులు తయారుచేసి ముద్రించాడు. ఇతడు శ్రీశైలప్రభ, శిశువిద్య, ఆరాధన పత్రికలకు సంపాదకుడిగా ఉన్నాడు. ఇతడు 1968, నవంబర్ 15న తనువు చాలించాడు.[1]

రచనలు

మార్చు
 1. భక్త అక్క మహాదేవి
 2. భక్తమల్లమ్మ
 3. హంపీ[2]
 4. శ్రీశైలచరిత్ర
 5. విజయనగర చరిత్రము[3]
 6. తులసీ రామాయణం
 7. ఆనంద రామాయణం
 8. రామకథామృతము
 9. వైదర్భీ విలాసము
 10. శ్రీ సాయిబాబా చరిత్ర
 11. శాంతి విజయము
 12. తుళసీదళము
 13. శ్రీ కృష్ణనిర్యాణము (అముద్రితం)
 14. నీతినవనీతము

మూలాలు

మార్చు
 1. రాయలసీమ రచయితల చరిత్ర - 4వ భాగము, కల్లూరు అహోబలరావు పుటలు 89-92
 2. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో హంపీ పుస్తకప్రతి
 3. నూతలపాటి పేరరాజు. విజయనగర చరిత్రము. Retrieved 2020-07-12.