ఉరవకొండ

ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా, ఉరవకొండ మండల జనగణన పట్టణం

ఉరవకొండ, అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలానికి చెందిన జనగణన పట్టణం.[1] ఈ పట్టణం అనంతపురం - బళ్ళారి రహదారిలో ఉంది. గుంతకల్లు ఇక్కడికి దగ్గర లోని రైల్వే జంక్సన్. ఇక్కడి నుండి బళ్ళారి, అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, కణేకల్లు రాయదుర్గం ప్రాంతాలకు రవాణా సదుపాయం ఉంది.మండల కేంద్రం అయిన ఈ ఊరు వజ్రకరూరు, విడపనకల్లు, కళ్యాణదుర్గం మార్గం లోని పల్లె ప్రాంత ప్రజలకు ఒక కూడలి లాగ వ్యవహరిస్తుంది.

గణాంకాల వివరాలుసవరించు

2017 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 74,105 - పురుషులు 37,951 - స్త్రీలు 36,154

చరిత్రసవరించు

ఉరవకొండ పేరు వినగానే మొదట గుర్తొచ్చేది కొండ. పట్టణానికి అలంకారంగా ఉంటుంది. పట్టణ మధ్యన ఉన్న ఈ కొండకు ఘన చరిత్ర కూడా ఉంది. పాముపడగ ఆకారంలో కొండ ఉండటంతో పూర్వం పట్టణాన్ని ఉరగాద్రి అని పిలిచే వారట. సంస్కృతంలో ఉరగ అంటే పాము పడగ, అద్రి అంటే కొండ అని అర్థం. పాము ఆకారంలో కొండ ఉన్నందువల్ల ఉరగాద్రిగా పేరు ఏర్పడిందట. కాలక్రమేణా అదికాస్తా ఉరవకొండగా మారింది.ఎక్కడైనా ఊరి సమీపంలో కొండలు, గుట్టలు ఉంటే వాటికి వ్యతిరేక దిశలో అభివృద్ధి చెందడం పరిపాటి. ఉరవకొండ పట్టణం మాత్రం కొండ చుట్ట్టూ అభివృద్ధి చెందుతుండటం విశేషం. చిక్కన్న అనే పాలేగాడు పట్టనానికి కోట బురుజు నిర్మించుకుని, కొంతకాలం సామంత పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది.

పట్టణ విశేషాలుసవరించు

ఈ ఊరిలో ప్రసిద్ధి చెందిన కరిబసవ స్వామి మఠం, పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉన్నాయి.ఉరవకొండలోని కరిబసవ మఠం రథోత్సవం తరువాతి రోజున లంక జరుగుతుంది. ఈ మఠం చాలా పురాతనమైంది, శైవ మత సంప్రదాయాలను పాటిస్తు ఇక్కడి కార్యక్రమాలు జరుగుతాయి.

విద్యా సౌకర్యంసవరించు

ఇక్కడ వున్న శ్రీ కరిబసవ స్వామి ప్రభుత్వ వున్నత పాఠశాల కూడా చాలా పురాతనమైంది, ఎందరో మేథావులు విద్యను అభ్యసించిన విద్యాలయం.సత్యసాయిబాబా మొదటసారిగా తన ప్రస్థానం మొదలు పెట్టిన ఊరు ఇది. సత్యనారాయణ రాజు అనే నామం తో బాబా సైతం ఈ పాఠశాలలో విద్యను అభ్యసించారు. ఈపాఠశాల త్వరలో 100 సంవత్సరాల మైలు రాయిని చేరుకుంటుంది. తెలుగు భాష అభ్యున్నతి కి ఎంతో కృషి చేసిన , గురువలకే గురువుగా భావించే ఆచార్య తూమాటి దోణప్ప గారు కూడా ఈ కళాశాల లోనే చదువుకొన్నారు. రసాయన శాస్త్రం లో అత్యంత ప్రముఖులు అయిన యం.శాంతప్ప[ఎం.శాంతప్ప] గారు కూడా ఇక్కడే చదువుకున్నారు.

ఇతర వివరాలుసవరించు

 • ఎస్టీడీ కోడ్:08496
 • పిన్ కోడ్:515812
 • ఎత్తు:459 మీటర్ల (1,505 ft) సగటు ఎత్తు
 • టైమ్ జోన్:IST (UTC+5:30)
 • మాట్లాడే భాషలు:ఉర్దూ,కన్నడ,హిందీ
 • అధికారిక భాష:తెలుగు
 • అక్షాంశరేఖాంశాలు:14.95°North 77.27°East
 • శాసనసభ నియోజకవర్గం సంఖ్య:268
 • నియోజకవర్గంలోని మండలాలు:5
 • జిల్లా శాసనసభ నియోజకవర్గం సంఖ్య:14

పట్టణం లోని ప్రముఖులుసవరించు

మూలాలుసవరించు

 1. "Villages & Towns in Uravakonda Mandal of Anantapur, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-08-09.

వెలుపలి లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉరవకొండ&oldid=3638690" నుండి వెలికితీశారు