నెక్ట్స్ ఏంటి

నెక్ట్స్ ఏంటి 2018, డిసెంబర్ 7న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1][2] సచిన్ జోషి, రైనా జోషి, అక్షయ్‌ పురి నిర్మించిన ఈ చిత్రానికి 'హమ్ తుమ్', 'ఫనా' చిత్రాలు తీసిన బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించాడు. తమన్నా,సందీప్ కిషన్, నవదీప్, లారిస్సా బొనెసి ఇందులో ముఖ్య పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం, మనీష్ చంద్ర భట్ ఛాయాగ్రాహణం అందించారు. ఈ చిత్రం వెన్ హర్రీ మెట్ షెల్లీ చిత్రం ఆధారంగా తెరకెక్కింది.[3][4]

నెక్ట్స్ ఏంటి
దర్శకత్వంకునాల్ కోహ్లీ
స్క్రీన్‌ప్లేకునాల్ కోహ్లీ
నిర్మాతసచిన్ జోషి
రైనా జోషి
అక్షయ్‌ పురి
నటవర్గంతమన్నా
సందీప్ కిషన్
నవదీప్
లారిస్సా బొనెసి
ఛాయాగ్రహణంమనీష్ చంద్ర భట్
కూర్పుఅనిల్ కుమార్ బొంతు
సంగీతంలియోన్ జేమ్స్
విడుదల తేదీలు
2018 డిసెంబరు 7 (2018-12-07)
నిడివి
117 నిముషాలు
దేశంఇండియా
భాషతెలుగు

కథసవరించు

టానీ (త‌మ‌న్నా), సంజూ (సందీప్ కిష‌న్‌) ప్రేమించుకుంటారు. వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ బేధాల‌తో విడిపోతారు. పెళ్ళై, ఆరేళ్ల పాప ఉన్న క్రిష్ (న‌వ‌దీప్‌) టానీకి ప‌రిచ‌యం అవుతాడు. టానీ - క్రిష్ అభిప్రాయాలు క‌ల‌వ‌డంతో క‌ల‌సి ప్ర‌యాణం చేస్తుంటారు. సంజూకి తనలాంటి భావాలున్న రోషిణితో నిశ్చితార్థం జ‌రుగుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ

తారాగణంసవరించు

పాటలుసవరించు

లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఇది అతనికి తొలిచిత్రం. ఈ చిత్రంలోని అన్ని పాటలను రామజోగయ్య శాస్త్రి రాశాడు.

మూలాలుసవరించు

  1. "Tamannaah, Sundeep Kishan starrer titled Next Enti!". The Hans India. 8 November 2018. Retrieved 28 September 2019.
  2. "Release date locked for Next Enti".
  3. Chowdhary, Y. Sunita (5 October 2017). "Soul-searching for Sundeep Kishan". The Hindu. Retrieved 28 September 2019.
  4. "Never talked more openly about love, sex in Telugu films: Tamannaah on Next Enti". thenewsminute.com. Retrieved 28 September 2019.