నేతి విద్యాసాగర్

నేతి విద్యాసాగర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శాసనమండలి సభ్యుడు. ఆయన ప్రస్తుతం శాసనమండలి శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నాడు.

నేతి విద్యాసాగర్
నేతి విద్యాసాగర్


తెలంగాణ శాసనమండలి ఉపాధ్యక్షుడు
పదవీ కాలం
4 జూన్ 2015 - 3 జూన్ 2021

పదవీ కాలం
2007- 2009

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
జూన్ 4, 2011 నుండి జూన్ 1, 2014

వ్యక్తిగత వివరాలు

జననం 29 జూన్ 1956
చెరుకుపల్లి , కేతేపల్లి మండలం , నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి
నివాసం హైదరాబాద్
మతం హిందూ

జననం, విద్యాభాస్యం

మార్చు

నేతి విద్యాసాగర్ తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, కేతేపల్లి మండలం, చెరుకుపల్లి గ్రామంలో 1956 జూన్ 29లో ఎన్.భిక్షమయ్య, రాధమ్మ[1] దంపతులకు జన్మించాడు. ఆయన నల్గొండలో డిగ్రీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

నేతి విద్యాసాగర్ పాఠశాల స్థాయి నుంచే కాంగ్రెస్ అనుంబంధ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ)లో పనిచేశాడు. ఆయన నల్గొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల అధ్యక్షుడిగా పనిచేశాడు. విద్యాసాగర్ ఎన్‌ఎస్‌యూఐ యూత్ కాంగ్రెస్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశాడు, ఆయన కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా & అధ్యక్షుడిగా పనిచేసి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. నేతి విద్యాసాగర్ కేతేపల్లి వైస్ ఎంపీపీ గా, 15 సంవత్సరాలు చెర్కుపల్లి సర్పంచ్‌గా, పీఏసీయస్ శాలిగౌరారం చైర్మన్‌గా పనిచేశాడు. ఆయన 1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నకిరేకల్ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

విద్యాసాగర్ 2007 మార్చిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యాడు.

2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న విద్యాసాగర్ తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా కొనసాగాడు. ఆయన ఈ పదవిలో 2015 మార్చి 1 వరకు కొనసాగాడు.[2] ఆయన అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. విద్యాసాగర్ 2014లో తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచాడు.[3] ఆయన నుండి శాసనమండలి వైస్‌చైర్మన్‌గా పనిచేశాడు.[4] ఆయన మండలి చైర్మన్‌ కనకమామిడి స్వామిగౌడ్ పదవీకాలం ముగిసిన అనంతరం 2019 మార్చి 30 నుండి కొంతకాలం తాత్కాలికంగా పూర్తిస్థాయి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు.[5] నేతి విద్యాసాగర్‌ డిప్యూటీ చైర్మన్‌ పదవీకాలం 2021 జూన్ 3న ముగిసింది.[6]

నేతి విద్యాసాగర్  2023 అక్టోబరు 27న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.[7][8]

మూలాలు

మార్చు
  1. The Hindu (17 January 2018). "CM comforts Nethi family". The Hindu (in Indian English). Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
  2. Sakshi (8 June 2014). "మండలి పీఠంపై నేతి". Sakshi. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
  3. Sakshi (2 June 2015). "డిప్యూటీ జయకేతనం". Sakshi. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
  4. Mana Telangana (7 October 2015). "'నేతి' ప్రమాణం". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
  5. Sakshi (30 March 2019). "మండలి చైర్మన్‌గా నేతి విద్యాసాగర్‌!". Sakshi. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
  6. Sakshi (3 June 2021). "తెలంగాణ: మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ పోస్టులు ఖాళీ". Sakshi. Archived from the original on 3 జూన్ 2021. Retrieved 3 June 2021.
  7. Sakshi (27 October 2023). "తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలు". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  8. Eenadu (28 October 2023). "కాంగ్రెస్‌ గూటికి మోత్కుపల్లి, నేతి విద్యాసాగర్‌". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.