నేనే వస్తున్నా
నేనే వస్తున్నా 2022లో విడుదలైన తెలుగు సినిమా. వి క్రియేషన్స్ బ్యానర్‌పై “నానే వరువన్” పేరుతో తమిళంలో కలైపులి ఎస్ థాను నిర్మించిన ఈ సినిమాకు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించగా “నేనే వస్తున్నా” పేరుతో తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ విడుదల చేశాడు. ధనుష్, సెల్వరాఘవన్,ఇంధూజ రవిచంద్రన్, ఎల్లి అవ్రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 29న విడుదలైంది.[2]
నేనే వస్తున్నా | |
---|---|
దర్శకత్వం | సెల్వరాఘవన్ |
రచన | ధనుష్ |
నిర్మాత | కలైపులి ఎస్ థాను |
తారాగణం | ధనుష్ ఇంధూజ రవిచంద్రన్ సెల్వరాఘవన్ |
ఛాయాగ్రహణం | ఓం ప్రకాశ్ |
కూర్పు | భువన్ శ్రీనివాసన్ |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ | వి క్రియేషన్స్ |
విడుదల తేదీs | 29 సెప్టెంబరు 2022(థియేటర్) 28 అక్టోబరు 2022 (అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ)[1] |
సినిమా నిడివి | 118 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి అయిన ప్రభు (ధనుష్) తన భార్య భువన (ఇందుజా రవిచంద్రన్), కూతురు సత్యతో సంతోషకరమైన జీవితం గడుపుతూ ఉంటాడు. అయితే ఓ సారి కుటుంబంతో విహార యాత్రకు వెళ్లి వచ్చిన తర్వాత కూతురు సత్య విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఆమె ప్రవర్తన విచిత్రంగా ఉండడంతో సైక్రియాటిస్ట్ (ప్రభు)ను సంప్రదిస్తే సత్యను దెయ్యం ఆవహించింద్దన్న విషయం తెలుస్తుంది. సత్యకు దెయ్యం ఎందుకు పడుతుంది? ఆ కారణంగా ప్రభు జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
మార్చు- ధనుష్[4]
- సెల్వరాఘవన్ - సీరియల్ కిల్లర్ ( అతిధి పాత్ర )
- ఇంధూజ రవిచంద్రన్
- ఎల్లి అవ్రామ్
- హియా డేవే
- ప్రభు
- యోగి బాబు
- ఆజీద్ ఖలిక్
- షెల్లీ కిషోర్
- శరవణ సుబ్బయ్య
- ఫ్రాన్కిన్స్టెన్
- సిల్వెన్స్టెన్
మూలాలు
మార్చు- ↑ TV9 Telugu (25 October 2022). "ఇక చిన్న సినిమాల జోరు.. ఈ వారం థియేటర్లు/ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లివే". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "'నేనే వస్తున్నా' రిలీజ్ డేట్ ఫిక్స్". 20 September 2022. Archived from the original on 8 October 2022. Retrieved 8 October 2022.
- ↑ Eenadu (29 September 2022). "రివ్యూ: నేనే వస్తున్నా". Archived from the original on 29 September 2022. Retrieved 29 September 2022.
- ↑ TV9 Telugu (28 September 2022). "నేనే వస్తున్నా అంటూ రంగంలోకి దిగుతున్న వర్సటైల్ యాక్టర్ ధనుష్". Archived from the original on 29 September 2022. Retrieved 29 September 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)