నేహా ధుపియా

భారతీయ నటి
(నేహా ధూపియా నుండి దారిమార్పు చెందింది)

నేహా ధుపియా (జననం 1980 ఆగస్టు 27) ఒక భారతీయ నటి, మోడల్. ఈమె ముఖ్యంగా హిందీ, తెలుగు, మలయాళ భాషా చిత్రాలలో నటించింది. ఈమె నాటకాలతో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించింది. తరువాత యూఫోరియా అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. తరువాత మోడలింగ్ వృత్తిని చేపట్టింది.

నేహా ధుపియా
అందాల పోటీల విజేత
నేహా ధుపియా
జననము (1980-08-27) 1980 ఆగస్టు 27 (వయసు 43)[1][2]
కొచ్చి, కేరళ, భారతదేశం[3]
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2000–ప్రస్తుతం
ఎత్తు1.68 m (5 ft 6 in)[2]
బిరుదు (లు)ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ 2002
ప్రధానమైన
పోటీ (లు)
ఫెమినా మిస్ ఇండియా 2002
(విజేత)
మిస్ యూనివర్స్ 2002
(టాప్-10 ఫైనలిస్ట్)

ఈమె తొలిసారి 1994లో విడుదలైన మలయాళ సినిమా మిన్నారంలో నటించింది. 2003లో "మిస్ ఇండియా:ది మిస్టరీ" అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. తరువాత ఈమె "క్యా కూల్ హై హమ్‌", "షూట్ అవుట్ లోఖండ్‌వాలా" వంటి విజయవంతమైన చిత్రాలలో ప్రధాన పాత్రను పోషించడమే కాకుండా "చుప్‌చుప్‌కే", "సింగ్ ఈజ్ కింగ్" వంటి సినిమాలలో సహాయపాత్రలను పోషించింది. ఈమె 2002లో "ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్" టైటిల్‌ను గెలుచుకుంది.

ప్రారంభ జీవితం సవరించు

ధుపియా కేరళ రాష్ట్రం లోని కొచ్చి నగరంలో ఒక సిక్కుల కుటుంబంలో జన్మించింది.[3][4] ఈమె తండ్రి కమాండర్ ప్రదీప్ సింగ్ ధుపియా భారత నావికా దళంలో పనిచేశాడు. ఈమె తల్లి మన్పిందర్ (బబ్లీ ధుపియా) ఒక గృహిణి. నేహా ధుపియా ప్రాథమిక విద్య నావల్ పబ్లిక్ పాఠశాల, ఆర్మీ పబ్లిక్ పాఠశాల న్యూఢిల్లీలలో సాగింది.[2] ఈమె చరిత్ర ప్రధానాంశంగా న్యూఢిల్లీలోని ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధమైన జీసస్ & మేరీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేసింది.[5]

వృత్తి సవరించు

ధుపియా తన నటనా వృత్తిని గ్రాఫిటీ అనే నాటకంతో ఆరంభించింది. తరువాత ఈమె యూఫోరియా అనే ఇండిపాప్ మ్యూజిక్ విడియోలో కనిపించింది. ఆ తర్వాత అనేక వ్యాపార ప్రకటనలలో మోడల్‌గా వ్యవహరించింది. "రాజధాని" అనే టెలివిజన్ సీరియల్‌లో నటించింది. 2002లో ఫెమినా మిస్ ఇండియా పోటీలలో పాల్గొని ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకుంది. తరువాత కరేబియన్ దీవుల్లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో టాప్ 10లో ఈమెకు స్థానం లభించింది.

 
నేహా ధుపియా 13వ ఐఫా అవార్డుల సందర్భంగా

సినిమా రంగం సవరించు

ఈమె 2003లో "ఖయామత్: సిటీ అండర్ థ్రెట్" అనే సినిమాతో బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. ఆ సినిమా బాకాఫీసు వద్ద మామూలుగా నిలిచింది. "జూలీ" చిత్రంలో ఈమె నటించిన పాత్ర ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత "షీషా" సినిమాలో ద్విపాత్రాభినయం చేసింది. ఆ సినిమా విజయవంతం కాలేదు. తర్వాత ఈమె "క్యా కూల్ హై హమ్‌", "షూట్ ఔట్ అట్ లోఖండ్‌వాలా" అనే సినిమాలలో నటించింది. "దస్ కహానియా" అనే సినిమాలో ఒక కథలో ఒక పాత్రను వేసింది.

తరువాతి కాలంలో ఈమె అనేక సినిమాలలో సహాయపాత్రలను ధరించింది. వాటిలో "చుప్ చుప్ కే", "ఏక్ చాలీస్ కీ లాస్ట్ లోకల్", "మిథ్య", "మహారథి", "సింగ్ ఈజ్ కింగ్", "దస్వీదనియా" మొదలైనవి ఉన్నాయి. 2011లో వచ్చిన "మై ఫ్రెండ్ హిట్లర్" అనే సినిమాలో ఇవా బ్రౌన్ పాత్రను పోషించింది.

ఈమె ఇటీవల నటించిన చిత్రాలలో "మోహ్ మాయ మనీ", "పేయింగ్ గెస్ట్", "యాక్షన్ రీప్లే", "దే దన దన్", "పప్పు కాంట్ డాన్స్ సాలా" మొదలైనవి ఉన్నాయి. "బాలీవుడ్ హీరో" అనే అంతర్జాతీయ ప్రాజెక్టులో ఈమె పనిచేసింది.

ఇతరములు సవరించు

2016లో ఈమె సావన్ అనే మ్యూజిక్ యాప్ కోసం నోఫిల్టర్ నేహా పేరుతో బాలీవుడ్ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది. దీనిని 2.3 మిలయన్ ప్రజలు వీక్షించారు. 2017లో నో ఫిల్టర్ నేహా సీజన్-2 తో మళ్లీ ఇంటర్యూలు మొదలుపెట్టింది.

వ్యక్తిగత జీవితం సవరించు

ధుపియా కన్సర్న్ ఇండియా ఫౌండేషన్ కు సహాయంగా 5 లక్షల రూపాయల విరాళాన్ని సమకూర్చేందుకు "ముంబై మారథాన్"ను నిర్వహించింది.[6] 2011లో సిక్కిం భూకంపబాధితులను ఆదుకోవడానికై విరాళాలను సేకరించడంలో సహకరించింది.[7] ఈమె GR8 ఉమెన్స్ అవార్డ్ 2012 కార్యక్రమంలో పాలుపంచుకుంది.[8] ఈమె సునీల్ శెట్టి, వినోద్ ఒబెరాయ్, అనీల్ కపూర్, బిపాషా బసులతో కలిసి శ్రీలంకలో జరిగిన హీరు గోల్డెన్ ఫిలిం అవార్డ్స్ 2014 కార్యక్రమంలో అతిథిగా పాల్గొనింది.[9]

తెలుగు సినిమాల జాబితా సవరించు

నేహా ధూపియా నటించిన తెలుగు సినిమాల వివరాలు:

సంవత్సరం సినిమా పేరు పాత్రపేరు వివరాలు
2003 నిన్నే ఇష్టపడ్డాను
2003 విలన్
2011 పరమ వీర చక్ర రజియా సుల్తానా

పురస్కారాలు సవరించు

సంవత్సరం సినిమా పేరు అవార్డు విభాగం ఫలితం
2004 ఖయామత్: సిటీ అండర్ థ్రెట్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నూతన నటి అవార్డ్ Nominated
స్క్రీన్ అవార్డ్ స్క్రీన్ ఉత్తమ నూతన నటి అవార్డ్ Nominated
స్టార్ గిల్డ్ అవార్డ్స్ స్టార్ గిల్డ్ ఉత్తమ నూతన నటి అవార్డ్ Nominated
స్టార్‌డస్ట్ అవార్డ్స్ సూపర్ స్టార్ ఆఫ్ టుమారో - ఫిమేల్ Nominated
2007 చుప్ చుప్ కే స్టార్‌డస్ట్ అవార్డ్స్ ఉత్తమ సహాయనటి Nominated
2010 రాత్ గయీ బాత్ గయీ స్టార్ స్క్రీన్ అవార్డ్స్ స్టార్ స్క్రీన్ ఉత్తమ సహాయనటి అవార్డు Nominated
2013 రంగీలే పిటిసి అవార్డ్స్ ఉత్తమ నటి Nominated
2018 తుమ్హారీ సులు స్టార్ స్క్రీన్ అవార్డ్స్ స్టార్ స్క్రీన్ ఉత్తమ సహాయనటి అవార్డు Won
జీ సినీ అవార్డ్స్ ఉత్తమ సహాయనటి Nominated

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. "Birthday Special: Neha Dhupia's FABULOUS life". Rediff. 27 August 2014. Retrieved 2016-09-05.
  2. 2.0 2.1 2.2 "Neha Dhupia Biography". Nehadhupia.net. Archived from the original on 30 May 2012. Retrieved 2016-09-05.
  3. 3.0 3.1 "Touchdown #kochi #kerela ... ( also my place of birth! )". Retrieved 12 April 2013.
  4. "Neha Dhupia - It's all about the Bollywood". allindiansite.com. Archived from the original on 2004-12-10. Retrieved 2016-09-05.
  5. "Shah Rukh Khan collects his degree after 28 years: 10 Bollywood stars who graduated from DU". India Today. 17 February 2016. Archived from the original on 11 డిసెంబరు 2017. Retrieved 4 May 2016.
  6. "B-town celeb quotient high at Mumbai Marathon". Times of India. IANS. 16 January 2011. Retrieved 7 October 2011.
  7. Sen, Zinia (2 October 2011). "B'wood going all out to raise money". Times of India. Retrieved 7 October 2011.
  8. "The ITA Awards » GR8! Women Achiever Awards". IndianTelevisionAcademy.com. 15 February 2012. Archived from the original on 18 March 2013. Retrieved 2016-09-05.
  9. "Hiru Golden Film Awards". hirugoldenfilmawards.hirutv.lk. Retrieved 2016-09-05.

బయటి లింకులు సవరించు

అంతకు ముందువారు
సెలీనా జైట్లీ
ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్
2002 |with16=
తరువాత వారు
నికితా ఆనంద్