పరమ వీర చక్ర (సినిమా)

తెలుగు చలన చిత్రం - నందమూరి బాలకృష్ణ - 2011

పరమ వీర చక్ర 2011 లో విడుదలైన తెలుగు చిత్రం. తేజ సినిమా బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మించాడు. దర్శకుడిగా దాసరి నారాయణరావుకు ఇది 150 వ చిత్రం.[1][2] నందమూరి బాలకృష్ణ, అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించాడు.[3]

పరమ వీర చక్ర
Parama Veera Chakra.jpg
దర్శకత్వందాసరి నారాయణ రావు
నిర్మాతసి కళ్యాణ్
తారాగణంనందమూరి బాలకృష్ణ
అమీషా పటేల్
షీల
ఛాయాగ్రహణంరమన రాజు
కూర్పుగౌతం రాజు
సంగీతంమణిశర్మ
విడుదల తేదీ
12 జనవరి 2011
దేశం భారతదేశం
భాషతెలుగు

ఈ చిత్రం 2011 సంక్రాంతి వారాంతంలో విడుదలైంది. పేళవమైన సమీక్షలు వచ్చాయి [4] అయితే, ఇది 2010 నంది అవార్డులలో నేషనల్ ఇంటిగ్రేషన్ చిత్రం కోసం సరోజిని దేవి అవార్డును గెలుచుకుంది .[5]

కథసవరించు

చక్రధర్ ( నందమూరి బాలకృష్ణ ) ఒక ప్రసిద్ధ సినీ నటుడు, అయితే అతని తల్లి (జయసుధ) అతని ప్రముఖుడి హోదాను ఇష్టపడదు. ఆమె తన కొడుకును ఆర్మీలో మేజర్‌గా, బొబ్బిలి పులి ( ఎన్‌టి రామారావు ) లాగా, చూడాలని ఆరాటపడుతుంది. చక్రధర్ వివిధ పాత్రలు చేస్తున్నప్పుడు, ఆర్మీ కల్నల్ జితేంద్ర ( మురళి మోహన్ ) తన వద్ద ఒక కథ ఉందని, అందులో చక్రధర్ నటించాలనీ కోరుకుంటాడు. కల్నల్ అతనికి ఆర్మీ మేజర్ - మేజర్ జయ సింహా (ఇతడూ బాలకృష్ణే) కథను వివరించాడు. అయితే, ఒక క్యాచ్ ఉంది. మేజర్ జయ సింహా కల్పిత పాత్ర కాదు, కానీ చక్రధర్ లాగా కనిపించే నిజమైన సైనికాధికారి. భయంకరమైన ఉగ్రవాది - అబ్దుల్ ఘనీని ధైర్యంగా పట్టుకున్నాడు. విషాదమేంటంటే జయసింహా ఇప్పుడు ఇక మాంసపు ముద్దలా మంచంపై (యాంత్రిక వెంటిలేషన్ మీద) పడి ఉన్నాడు. రాజకీయ నాయకులు, కొద్దిమంది ఆర్మీ అధికారులు, ఉగ్రవాదులూ కలిసి పన్నిన కుట్ర ఫలితం అది. దేశ భద్రతా ప్రణాళికలు రాజీపడకుండా చూసేందుకు కల్నల్ జీతేంద్ర చక్రధర్‌ను మేజర్ లాగా వ్యవహరించమని అడుగుతాడు. చక్రధర్ ఉగ్రవాదులపై ఎలా దాడి చేస్తాడు, మేజర్ గౌరవాన్ని తిరిగి ఎలా తీసుకువస్తాడు అనేది మిగిలిన కథ.[6]

నటీ నటులుసవరించు

పాటలుసవరించు

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."లోకాన చీకటిని"సుద్దాల అశోక్ తేజఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్, శ్రీకృష్ణ7:23
2."మిత్రా మిత్రా 1"అనంత శ్రీరాంఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సునీత4:15
3."అర్జున ఫల్గుణ"రామజోగయ్య శాస్త్రిహేమచంద్ర, మాళవిక4:47
4."మై క్యా కరూ"సాహితిహేమచంద్ర, మాళవిక4:25
5."ఎక్కా ఎక్కా"దాసరి నారాయణరావుమనో, మాలతి3:51
6."తల్లి కడుపులో"Dasari Narayana Raoఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం5:59
7."రాముడైనా"జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుమనో1:08
8."మిత్రా మిత్రా 2"అనంత శ్రీరామ్ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సునీత4:13
Total length:36:00

మూలాలుసవరించు

  1. ‘Parama Veera Chakra’ Launched – Telugu Movie News Archived 2010-06-13 at the Wayback Machine. IndiaGlitz (10 June 2010). Retrieved on 2015-07-08.
  2. Dasari on a signing spree Archived 2013-06-16 at Archive.today. Articles.timesofindia.indiatimes.com (27 April 2013). Retrieved on 2015-07-08.
  3. Parama Veera Chakra Archived 6 మార్చి 2013 at the Wayback Machine. Music.ovi.com. Retrieved on 8 July 2015.
  4. "Flop Of The Year, 2011". Archived from the original on 2017-09-25. Retrieved 2020-08-25.
  5. Nandi awards 2010 announced Archived 2011-10-01 at the Wayback Machine. Indiaglitz.com (6 August 2011). Retrieved on 2015-07-08.
  6. "Parama Veera Chakra story". 123Telugu.com.