నోటా (2018 సినిమా)

2018లో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం.
(నోటా 2018 నుండి దారిమార్పు చెందింది)

నోటా 2018, అక్టోబర్ 5న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1][2][3] ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, మెహ్రీన్ పిర్జాదా, నాజర్ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని వెట్టత్తం అనే నవల ఆధారంగా తెరకెక్కించడం జరిగింది

నోటా
పోస్టర్
దర్శకత్వంఆనంద్ శంకర్
రచనశాన్ కురప్పుసామి
కథవెట్టత్తం నవల ఆధారంగా
నిర్మాతకె.ఈ.జ్ఞానవేల్ రాజా
తారాగణంవిజయ్ దేవరకొండ
మెహ్రీన్ పిర్జాదా
ఛాయాగ్రహణంసంతన కృష్ణన్ రవిచంద్రన్
కూర్పురేమండ్ డెర్రిక్ క్రాస్టా
సంగీతంసామ్ సి.ఎస్
నిర్మాణ
సంస్థ
స్టూడియో గ్రీన్
పంపిణీదార్లుఫ్రీజ్ ఫ్రేమ్ ఫిల్మ్స్ (యూ యస్ ఏ టెర్రిటరీ)
విడుదల తేదీ
5 అక్టోబర్ 2018
సినిమా నిడివి
153 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు

వరుణ్ (విజయ్ దేవరకొండ) లండన్‌లో గేమ్ డెవలపర్. వరుణ్ తన తండ్రి సీఎం వాసుదేవ్ (నాజర్) అవినీతి కేసులో అరెస్ట్ కావడంతో, వాసుదేవ్ నమ్మే ఒక స్వామీజీ మాట ప్రకారం వరుణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టాల్సి వస్తుంది. రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియకుండా సీఎం పదవి చేపట్టిన వరుణ్.. జర్నలిస్టు మహేందర్(సత్యరాజ్) సాయంతో ప్రజలు మెచ్చే నాయకుడవుతాడు.ఆ తర్వాత తన తండ్రిని వ్యతిరేకించాల్సి వస్తుంది. తన కొడుకునే పదవి నుంచి దింపడానికి తండ్రి ప్రయత్నిస్తాడు. తన తండ్రి ఎత్తులకు పైఎత్తు వేసి తన పదవిని ఎలా కాపాడుకొన్నాడనేది ఈ చిత్ర కథ.

నటవర్గం

మార్చు
పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఏత్థర ఏత్థర"శ్రీ మనియాజిన్ నిజార్ & స్వాగత యస్. కృష్ణన్04:01
2."రాజా రాజా కుల"శ్రీ మనిఅభయ్ జోద్పుర్కర్ , నిత్యశ్రీ మహదేవన్03:46
3."హే మినిస్టర్"రాజేష్.ఏ.మూర్తిఅరవింద్ శ్రీనివాస్01:00
4."ఎవరి పాపం"రాజేష్.ఏ.మూర్తిశరత్ సంతోష్01:00
మొత్తం నిడివి:09:47

మూలాలు

మార్చు
  1. "Release announcement".
  2. "NOTA Telugu Movie Review {3/5}: NOTA is a gripping political that keeps you engrossed, it shows Vijay Deverakonda's versatility as an actor". The Times of India. Retrieved 2018-10-06.
  3. Krishna, Murali (27 September 2018). "Vijay Deverakonda's NOTA  based on a novel". The New Indian Express. Retrieved 24 March 2019.

బయటి లింకులు

మార్చు