నోముల భగత్ కుమార్

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, న్యాయవాది, సామాజిక కార్యకర్త, శాసనసభ్యుడు

నోముల భగత్ కుమార్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, న్యాయవాది, సామాజిక కార్యకర్త, శాసనసభ్యుడు. నోముల ఎన్ఎల్ ఫౌండేషన్ స్థాపించి పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తూ, పేదింటి ఆడపిల్లల పెండ్లిలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు.[1] నోముల నర్సింహయ్య వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన భగత్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గంకు జరిగిన ఉపఎన్నికలో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.[2][3]

నోముల భగత్ కుమార్
నోముల భగత్ కుమార్


పదవీ కాలం
2 మే, 2021 - 2023 డిసెంబర్ 03
ముందు కుందూరు జానారెడ్డి
తరువాత కుందూరు జయవీర్ రెడ్డి
నియోజకవర్గం నాగార్జునసాగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1984-10-10)1984 అక్టోబరు 10
నల్లగొండ, నల్లగొండ జిల్లా
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు నోముల నర్సింహయ్య, లక్ష్మి
జీవిత భాగస్వామి భవాని
సంతానం ఒక కుమారుడు (రణజయ్), ఒక కుమార్తె (రేయాశ్రీ)

జననం - విద్యాభ్యాసం మార్చు

భగత్ కుమార్ 1984, అక్టోబరు 10న నోముల నర్సింహయ్య, లక్ష్మి దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండలో జన్మించారు.[4][5] 2007లో బీటెక్ పూర్తిచేసిన భగత్ కొంతకాలం సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2010లో ఎంబీఏ పూర్తిచేసి, 2010 నుంచి 2012 వరకు విస్టా ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేస్తూనే 2014లో న్యాయ విద్యను, 2016లో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 2014-2018 మధ్యకాలంలో హైకోర్టులో అడ్వకేట్‌గా విధులు నిర్వర్తించారు.

వ్యక్తిగత జీవితం మార్చు

భగత్ కుమార్ కు భవానితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (రణజయ్), ఒక కుమార్తె (రేయాశ్రీ)

సామాజిక సేవ మార్చు

నోముల ఎన్ఎల్ ఫౌండేషన్ స్థాపించిన భగత్ కుమార్, ఆ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్యను, ఆడపిల్లల పెండ్లిలకు ఆర్థిక సహాయాన్ని అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు, నిరుద్యోగులకు కోచింగులు, క్లాసులు, జాబ్ మేళాలు మొదలైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.[6]

రాజకీయ ప్రస్థానం మార్చు

తండ్రి నర్సింహయ్యతో పాటు 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన భగత్, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి నోముల నర్సింహయ్యకు ఆర్గనైజర్ గా, 2018 అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహకుడిగా పార్టీ తరపున పనిచేశారు. నోముల భగత్‌ కుమార్‌ తండ్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అకాల మరణంతో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు రాగా 2021, మార్చి 29న భగత్ కుమార్ పేరును అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించి, టీఆర్ఎస్ తరపున బీఫామ్ అందజేశారు.[7] భగత్ 2021 మార్చి 30న (మంగళవారం) నిడమనూరు ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.[8] నాగార్జున సాగర్ నియోజక వర్గానికి 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో నోముల భగత్‌ కుమార్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డిపై 18,872 ఓట్ల మెజారిటీతో గెలిచారు.[9][10][11] ఆయన ఎమ్మెల్యేగా 2021 ఆగస్టు 12న ప్రమాణ స్వీకారం చేశారు.[12]

మూలాలు మార్చు

  1. టిన్యూస్ తెలుగు, తెలంగాణ (29 March 2021). "సాగర్ అభ్యర్థి నోముల భగత్ ప్రొఫైల్ ఇదే". Archived from the original on 29 March 2021. Retrieved 29 March 2021.
  2. BBC News తెలుగు (2 May 2021). "నోముల భగత్: నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డిని ఓడించిన లాయర్". Archived from the original on 2 May 2021. Retrieved 2 May 2021.
  3. News18 Telugu (2 May 2021). "Nomula Bhagath: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, లాయర్.. సాగర్‌లో గెలిచిన నోముల భగత్ ప్రొఫైల్ ఇదే." Archived from the original on 2 May 2021. Retrieved 2 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  5. Eenadu (4 November 2023). "ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  6. www.tv5news.in, తెలంగాణ (29 March 2021). "ఎవరీ నోముల భగత్‌.. ఫుల్ డీటెయిల్స్ ఇవే...!". Vamshi Krishna. Archived from the original on 29 March 2021. Retrieved 29 March 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Eenadu (29 March 2021). "సాగర్‌ తెరాస అభ్యర్థిగా నోముల భగత్‌". Archived from the original on 2 May 2021. Retrieved 2 May 2021.
  8. Andhrajyothy (30 April 2021). "నిడమనూరులో నామినేషన్ వేసిన నోముల భగత్". Archived from the original on 2 May 2021. Retrieved 2 May 2021.
  9. Namasthe Telangana (2 May 2021). "ఎమ్మెల్యేగా గెలుపు ప‌త్రం అందుకున్న నోముల భ‌గ‌త్‌". Archived from the original on 2 May 2021. Retrieved 2 May 2021.
  10. Namasthe Telangana (2 May 2021). "సాగ‌ర్ రిజల్ట్‌.. తండ్రి మెజార్టీని అధిగ‌మించిన త‌న‌యుడు." Archived from the original on 2 May 2021. Retrieved 2 May 2021.
  11. Namasthe Telangana (2 May 2021). "నాగార్జున సాగ‌ర్‌లో టీఆర్ఎస్ ఘ‌న విజ‌యం". Archived from the original on 2 May 2021. Retrieved 2 May 2021.
  12. Sakshi (12 August 2021). "ఎమ్మెల్యేగా నోముల భగత్‌ ప్రమాణ స్వీకారం". Archived from the original on 12 August 2021. Retrieved 12 August 2021.