నోముల నర్సింహయ్య (జనవరి 9, 1956 - డిసెంబరు 1, 2020) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యునిగా కొనసాగారు గతంలో సీపీఎం శాసనససభపక్షనేతగా పనిచేసిన నర్సింహయ్య సీపీఎం పార్టీ తరపున రెండుసార్లు నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి, టిఆర్ఎస్ పార్టీ తరపున ఒకసారి నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.

నోముల నర్సింహయ్య
నోముల నర్సింహయ్య

పదవీ కాలము
2018-2020
నియోజకవర్గము నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1956-01-09)9 జనవరి 1956
పాలెం, నకిరేకల్ మండలం, నల్లగొండ జిల్లా
మరణం 1 డిసెంబరు 2020(2020-12-01) (వయస్సు 64)
హైదరాబాదు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
నివాసము నకిరేకల్

జీవిత విషయాలుసవరించు

నర్సింహయ్య 1956, జనవరి 9న తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, నకిరేకల్ మండలం, పాలెం గ్రామంలోని యాదవ కుటుంబంలో జన్మించాడు. తన బాల్యంలో తెలంగాణ సాయుధ పోరాటం వంటి కమ్యూనిస్ట్ సాహిత్యం వైపు ఆకర్షితుడయ్యాడు, పురాణ వ్యక్తులచే ప్రేరణ పొందాడు. చిన్నతనం నుండే వ్యవసాయంలో కూడా నిమగ్నమయ్యాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎం.ఏ) బ్యాచిలర్ ఆఫ్ లాస్ (ఎల్ఎల్బి) చేసాడు.

రాజకీయ జీవితంసవరించు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తన విద్యార్థి జీవితంలో, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చురుకుగా నాయకత్వం వహించాడు. తరువాత, ఆయన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)లో చేరాడు. కొంతకాలం నల్గొండ నకిరేకల్ జ్యుడిషియల్ కోర్టులలో న్యాయవాదిగా పనిచేశాడు. నకిరేకల్‌ మండల పరిషత్ అధ్యక్షుడిగా రెండుసార్లు ఎన్నికయ్యాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 1999 నుండి 2004 వరకు ఎపి శాసనసభలో సిపిఐ (ఎం) ఫ్లోర్ లీడర్‌గా పనిచేశాడు.

1999లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిసిఎం పార్టీ తరపున పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కటికం సత్తయ్య గౌడ్ పై 5,115 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిసిఎం పార్టీ తరపున పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కటికం సత్తయ్య గౌడ్ పై 24,222 ఓట్ల తేడాతో గెలుపొందాడు.

2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నల్లగొండ జిల్లా భువనగిరి లోకసభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసి ఓడిపోయాడు. తెలంగాణ ఏర్పాటుపై సిపిఐ (ఎం) పార్టీ వైఖరితో విభేదించి 2014, ఏప్రిల్ 8న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2014 సాధారణ ఎన్నికలలో నాగార్జున సాగర్ (అసెంబ్లీ నియోజకవర్గం) నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఎన్నికల్లో ఓడిపోయాడు.[1][2] తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018) 2018లో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై 7771 ఓట్ల తేడాతో గెలుపొందాడు.

మరణంసవరించు

నర్సింహయ్య కోవిడ్ -19 వ్యాధినుంచి కోలుకున్న తరువాత ఊపిరితిత్తుల సమస్యకు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ 2020, డిసెంబరు 1న గుండెపోటుతో మరణించాడు.[3][4]

ఇవికూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "'నోముల' టీఆర్‌ఎస్‌కు జంప్".
  2. Alliances Create Fissures in Parties - The New Indian Express
  3. TRS MLA Nomula Narsimhaiah dies of heart attack
  4. "TRS lawmaker Nomula Narasimhaiah dies of cardiac arrest after post-Covid-19 complications". Hindustan Times. 2020-12-01. Retrieved 2020-12-01.