నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం

నల్గొండ జిల్లా లోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలుసవరించు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 87 Nagarjuna Sagar GEN Jana Reddy Kunduru Male INC 69684 Nomula Narsimaiah Male TRS 53208
2009 87 Nagarjuna Sagar GEN Kunduru Jana Reddy M INC 67958 Tera Chinnapa Reddy M తె.దే.పా 61744

2009 ఎన్నికలుసవరించు

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పి.చిన్నపరెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరఫున కుందూరు జానారెడ్డి, ప్రజారాజ్యం నుండి రామచంద్రనాయక్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా శ్రీనివాస్ యాదవ్, లోక్‌సత్తా తరఫున టి.రజనీకాంత్ పోటీచేశారు.[1]

ఫలితాలిలా ఉన్నాయి [1]

క్ర.సం. అభ్యర్థి పార్టీ వోట్లు
1 కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ 67958
2 తెర చిన్నప్పరెడ్డి తె.దే.పా. 61744
3 ఇస్లావత్ రామచందర్ నాయక్ ప్రజారాజ్యం పార్టీ 8600
4 కట్టా యాదయ్య బహుజన్ సమాజ్ పార్టీ 4639
5 బొలిగొర్ల శ్రీనివాస యాదవ్ భా.జ.పా. 1773
6 చెరక మల్లికార్జున గౌడ్ బి.సి. యునైటెడ్ ఫ్రంట్ 1229
7 జి. రతన్ కుమార్ స్వతంత్ర 1180
8 నిమ్మల ఇందిర స్వతంత్ర 992
9 ధనవత్ శ్రీనివాస నాయక్ స్వతంత్ర 867
10 వడ్లమూడి సౌదామిని స్వతంత్ర 754
11 తేర రజనీకాంత్ లోక్ సత్తా పార్టీ 713
12 పి. రామలింగారెడ్డి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా 633
13 జూలకంటి వెంకటేశ్వరరెడ్డి స్వతంత్ర 582
14 జక్కుల చిననరసింహ స్వతంత్ర 495
15 ఉడుతూరి విష్నువర్ధన్ రెడ్డి స్వతంత్ర 450
16 జక్కల వెంకటేశ్వర్లు స్వతంత్ర 434
17 మాలోతు కోట్యానాయక్ ప్రజాశాంతి పార్టీ 392
18 గంటెకపు వెంకటయ్య స్వతంత్ర 374
19 కనకరాజు సామేలు స్వతంత్ర 333
20 విరిగినేని అంజయ్య స్వతంత్ర 272

నియోజకవర్గ ప్రముఖులుసవరించు

కె.జానారెడ్డి
1975లో రాజకీయరంగ ప్రవేశం చేసిన జానారెడ్డి 1978లో జయప్రకాశ్ నారాయణ్ స్పూర్తితో జనతాపార్టీ తరఫున పోటీచేసి నిమ్మల రాములు చేతిలో ఓడిపోయాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం తరువాత ఆ పార్టీలో చేరి 1985లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. 1988లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ప్రత్యేకంగా తెలుగునాడు పార్టీ స్థాపించాడు. ఆ మరుసంవత్సరమే తెలుగునాడును కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, కాంగ్రెస్ తరఫున పోటీచేసి శాసనసభకు ఎన్నికైనాడు. 1994లో కాంగ్రెస్ తరఫునే పోటీచేసి రామ్మూర్తి యాదవ్ చేతిలో పరాజయం పొందినాడు. ఆ తరువాత 1999, 2004 ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిపదవులు పొందినాడు. గతంలో సినిమాటోగ్రఫి, వ్యవసాయ శాఖామంత్రిగా పనిచేసిన జానా రెడ్డి ప్రస్తుతం హోంశాఖను నిర్వహిస్తున్నాడు.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. సాక్ష్ దినపత్రిక, తేది 09-04-2009