నౌపడా రైల్వే స్టేషను
నౌపడా రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: NWP), భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. శ్రీకాకుళం జిల్లాలో నౌపడాకు పనిచేస్తుంది. ఇది ఒక జంక్షన్ స్టేషను. ఇది ఒడిషా లోని రాయగడ జిల్లాలో గుణుపూరుకి శాఖా రైలు మార్గములో ఉన్న ఒక జంక్షన్ స్టేషను.
నౌపడా రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వేస్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | నౌపడా ,శ్రీకాకుళం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ India |
Coordinates | 18°34′45″N 84°16′59″E / 18.57906°N 84.28294°E |
Elevation | 12 మీ. (39 అ.) |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి ఖుర్దా రోడ్-విశాఖపట్నం రైలు మార్గము నౌపడా-గుణుపూరు శాఖా రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 3 |
పట్టాలు | బ్రాడ్ గేజ్ |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | NWP |
జోన్లు | తూర్పు తీర రైల్వే |
డివిజన్లు | వాల్తేరు |
History | |
Opened | 1893–96 |
విద్యుత్ లైను | 1998–99 |
చరిత్ర
మార్చుప్రధాన మార్గము
మార్చు1893 నుండి 1896 సం.ల మధ్య కాలంలో సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే 1,287 కి.మీ. (800 మైళ్ళు), విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించిన మార్గము, అదే కాలంలో ట్రాఫిక్ మొదలైనది.[1] 1898-99 మధ్య, బెంగాల్ నాగపూర్ రైల్వే దీనికి లింకు చేయబడింది.[2] బెంగాల్ నాగపూర్ రైల్వే కటక్ వరకు 1899 జనవరి 1 న ప్రారంభించబడింది. ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.[3] కటక్ ఈస్ట్ కోస్ట్ లైన్ ఉత్తరభాగం, 514 కిమీ (319 మైళ్ళు) పొడవైన పూరీ శాఖ లైన్ సహా 1902 సం.లో బెంగాల్ నాగ్పూర్ రైల్వే హస్తగతం చేసుకుంది.[4][5] మద్రాస్ రైల్వేను 1908 సం.లో మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వేగా ఏర్పాటు చేసేందుకు దక్షిణ మరాఠా రైల్వేలో విలీనం చేశారు.[6][7]
శాఖా మార్గములు
మార్చు79 కి.మీ. పొడవు రైలు మార్గము విజయనగరం - పార్వతీపురం మధ్యన శాఖా రైలు మార్గము 1908-09 సంవత్సరంలో ప్రారంభించబడింది.[2]
పర్లాకిమిడి లైట్ రైల్వే, 1900 లో నౌపడా-గుణుపూరు రైలు మార్గము మధ్యన ప్రారంభించబడింది.[2][8] ఈ మార్గం 2011 లో బ్రాడ్ గేజ్‌గా మార్చబడింది.[9]
రైల్వేల పునర్వవస్థీకరణ
మార్చుబెంగాల్ నాగపూర్ రైల్వే 1944లో జాతీయం చేయబడింది.[10] ఈస్ట్ ఇండియా రైల్వే కంపెనీ, బెంగాల్ నాగపూర్ రైల్వే లలోని కొన్ని భాగాలతో తూర్పు రైల్వే తేదీ 1952 ఏప్రిల్ 14 న ప్రారంభించబడింది.[11] తూర్పు రైల్వేలోని కొన్ని భాగాలతో ఆగ్నేయ రైల్వే 1955 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఇందులోని ఎక్కువ ప్రాంతాలు పూర్వపు బెంగాల్ నాగపూర్ రైల్వేకు చెందినవే.[11][12] ఏప్రిల్ 2003 సంవత్సరంలో ఆగ్నేయ రైల్వే నుండి తూర్పు తీర రైల్వే, ఆగ్నేయ మధ్య రైల్వే లను ఏర్పాటుచేయబడ్డాయి.[11] దక్షిణ తూర్పు రైల్వే జోను 1955 సం.లో, ఈస్టర్న్ రైల్వే లోని కొన్ని భాగాలను వేరుచేసి ఏర్పరచారు. ఈ జోనులో ఇంతకు ముందు నుండి నిర్వహించిన బిఎన్‌ఆర్ రైలు మార్గములు ఎక్కువగా ఉన్నాయి.[11][13] కొత్త మండలాలు ఏర్పాటులో భాగంగా ఏప్రిల్ 2003 లో ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోనులు ప్రారంభమయ్యాయి. సౌత్ ఈస్టర్న్ రైల్వే నుండి ఈ రెండు రైల్వే మండలాలు కొత్తగా మలిచారు.[11]
విద్యుదీకరణ
మార్చు1999-2000లో పలాస-తిలరు రైలు మార్గము విద్యుద్దీకరణ చేయబడింది.
మూలాలు
మార్చు- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 26 డిసెంబరు 2018.
- ↑ 2.0 2.1 2.2 "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2012-11-10.
- ↑ "IR History: Part III (1900–1947)". IRFCA. Retrieved 2013-01-19.
- ↑ "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 2012-10-11. Retrieved 2013-01-02.
- ↑ "History". East Coast Railway. Archived from the original on 2011-01-31. Retrieved 2013-01-02.
- ↑ "Railways". The Cambridge Economic History of India, Vol 2, page 755. Orient Longmans Private Limited. Retrieved 2013-02-13.
- ↑ "Third oldest railway station in country set to turn 156". Indian Railways Turn Around News. Retrieved 2013-02-13.
- ↑ "Paralakhemedi Light Railway". The Indian Express, 28 May 2009. Retrieved 2012-12-10.
- ↑ "Performance of Waltair Division in 2011-12". Waltair Division of East Coast Railway. Retrieved 2012-11-27.
- ↑ "IR History: Part - III (1900 - 1947)". IRFCA. Retrieved 2012-11-21.
- ↑ 11.0 11.1 11.2 11.3 11.4 "Geography – Railway Zones". IRFCA. Retrieved 2012-11-21.
- ↑ "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.
- ↑ "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.