పంజాబ్ లో జరుపుకునే హిందూ పండగల జాబితా
పంజాబ్‌లో హిందువులు జరుపుకునే పండగుల సారాంశం ఈ జాబితా. పంజాబీ క్యాలండర్ ప్రకారం సౌరమానాన్ని అనుసరించి పంజాబీ హిందువులు మాఘీ, వైశాఖి పండుగలు జరుపుకుంటారు. మిగిలిన పండుగలు చంద్రమానాన్ని అనుసరించే జరుపుకుంటుంటారు.
పండుగ జరుపుకునే పద్ధతి
మార్చుపంజాబీ హిందువులు పంజాబీ క్యాలండర్ ప్రకారం పలు మతపరమైన పండుగలు చేసుకుంటారు.
హిందూ పంజాబీ పండుగల జాబితా, వాటి వివరణ
మార్చుపంజాబ్ లో ఎక్కువగ జరుపుకునే హిందూ పండుగలు | తేదీలు/తిధులు (తేదీలు ప్రతీ సంవత్సరం మారుతూంటాయి) | వివరణ |
---|---|---|
మాఘీ | జనవరి 14 | ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి సూచనగా ఈ పండుగ చేసుకుంటారు. మకర సంక్రాంతికి ఇది పంజాబీ రూపం.[1] |
హోళీ | మార్చి/ఫాల్గుణ పూర్ణిమ | వసంతకాలంలో చేసుకునే రంగుల పండుగ.[2][3] |
శ్రీరామనవమి | చైత్ర శుద్ధ నవమి | శ్రీరాముని జన్మదినం సందర్భంగా జరుపుకునేది.[3][4] |
హనుమాన్ జయంతి | మార్చి/చైత్ర పూర్ణిమ | ఆంజనేయుని జన్మదినం.[3] |
మహాశివరాత్రి | మాఘ బహుళ చతుర్దశి | శివుడు లింగాకారంగా ఆవిర్భవించిన రోజు.[5][6] |
వైశాఖి | ఏప్రిల్ 13 | పంజాబీ సంవత్సరాది. మేష సంక్రాంతిన జరుపుకుంటారు. |
కృష్ణ జన్మాష్టమి | శ్రావణ బహుళ అష్ఠమి | కృష్ణుని పుట్టినరోజు.[3][4] |
రక్షా బంధన్ | శ్రావణ పూర్ణిమ | సోదరీ, సోదరుల పండుగ.[3][7] |
సాంఝీ | తిధుల ప్రకారం మారుతూ ఉంటుంది. | అమ్మవారి కోసం చేసుకునే పండుగ.[8] |
దసరా | ఆశ్వీయుజ శుద్ధ దశమి | రాముడు రావణునిపై విజయం సాధించినందుకు జరుపుకునే పండుగ.[3][9] |
నవరాత్రి | పది రోజుల దసరా పండుగ | దుర్గామాత పూజ.[3][10] |
శ్రద్ధ | భాద్రపద కృష్ణపక్షం | చనిపోయిన పెద్దల కోసం. |
దీపావళి | కార్తీక అమావాస్య | రావణునిపై విజయం సాధించి, రాముడు-సీత అయోధ్య చేరిన సందర్భంగా చేసుకునే దీపాల పండుగ.[3][9] |
విశ్వకర్మ దినం | కార్తీక బహుళ పాడ్యమి | వాస్తు శాస్త్రానికి దేవునిగా పిలవబడే విశ్వకర్మకు పూజ.[11] |
భయు-బీజ్ పంజాబ్ లో భాయ్ దూజ్ గా పిలుస్తారు. | తిథి ప్రకారం మారుతూ ఉంటుంది. | దీపావళి తరువాత సోదరీ, సోదరులు జరుపుకునే పందుగ.[9] |
కర్వా చౌత్ | కార్తీక పౌర్ణమి తరువాత 4వ రోజు | భర్తల ఆయు ఆరోగ్యాల కోసం భార్యలు ఉపవాస దీక్ష చేసి, సాయత్రం చంద్రునికి పూజ చేస్తారు.[3][12] |
కార్తీక పౌర్ణమి | కార్తీక పౌర్ణమి | అమృత్ సర్‌లోని రామ్ తీర్ధ్ మందిరం దగ్గర చేసే జాతర. ఈ రోజునే రాముని కుమారులు లవ, కుశులు పుట్టారని వారి నమ్మకం.[13] |
చిత్రమాలిక
మార్చు-
నాగేశ్వర్ ఆలయం వద్ద శివుని విగ్రహం
-
దుర్గా పూజ
-
చిన్న కృష్ణుడు
-
సాంజీ మాతాజీ
-
రావణ దహనం
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ drikpanchang
- ↑ "Hindustan Times 18 03 2014". Archived from the original on 2014-12-11. Retrieved 2016-07-06.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 3.8 Punjabiyat: The Cultural Heritage and Ethos of the People of Punjab by Jasbir SIngh Khurana Hemkunt Publishers (P) Ltd ISBN 978-81-7010-395-0
- ↑ 4.0 4.1 http://www.indtravel.com/punjab/festival.html
- ↑ Office Holidays
- ↑ The Times of India 20 02 2012
- ↑ "Hindustan Times 10 08 2014". Archived from the original on 2014-12-11. Retrieved 2016-07-06.
- ↑ Alop ho riha Punjabi virsa by Harkesh Singh Kehal Pub Lokgeet Parkashan ISBN 81-7142-869-X
- ↑ 9.0 9.1 9.2 http://www.bharatonline.com/punjab/festivals/index.html
- ↑ Durga Puja
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-11-29. Retrieved 2016-07-06.
- ↑ Madhusree Dutta; Neera Adarkar; Majlis Organization (Bombay), The nation, the state, and Indian identity, Popular Prakashan, 1996, ISBN 978-81-85604-09-1,
... originally was practised by women in Punjab and parts of UP, is gaining tremendous popularity ...
- ↑ The Tribune 14 11 2008