ఈ సినిమా 1981 జనవరి 1న విడుదలయింది. శోభన్‌బాబు ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు.

పండంటి జీవితం
(1981 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం తాతినేని రామారావు
నిర్మాణం మిద్దే రామారావు
తారాగణం శోభన్ బాబు,
సత్యనారాయణ,
గిరిబాబు,
సుజాత,
విజయశాంతి,
పి.ఎల్.నారాయణ
సంగీతం చక్రవర్తి
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల,
ఎస్.జానకి
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
ఛాయాగ్రహణం సుందరం
నిర్మాణ సంస్థ శ్రీ రాజలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

పాత్రలు, పాత్రధారులు

మార్చు
  • శేఖర్ - శోభన్ బాబు
  • సంధ్య - సుజాత
  • పురుషోత్తమరావు -
  • జ్యోతి - సుమతి
  • శ్యాం - శోభన్ బాబు
  • సూరమ్మ -

పోస్ట్ గ్రాడ్యుయెట్ అయిన శేఖర్ ట్యూషన్లు చెపుతూ ఉంటాడు. చెల్లెలు జ్యోతి అతడికి ఆరోప్రాణం. కోటీశ్వరుడైన పురుషోత్తమరావు కూతురు, పిడివాదపు మనిషి అయిన సంధ్య విదేశాలనుండి తిరిగివచ్చి కారులో షికారుకెళ్తూ శేఖర్ సైకిల్‌కు డాష్ ఇస్తుంది. దానితో ఇద్దరి మధ్య వాగ్వివాదం ప్రారంభమై తర్వాత అది ప్రేమకు, పెళ్ళికి దారితీస్తుంది. సంధ్య దూరపు చుట్టం సూరమ్మ ఇంట్లో నగానట్రా కాజేసి జ్యోతి మీద నేరం మోపుతుంది. సంధ్యకూడా తొందరపాటుతో జ్యోతినే నిందిస్తుంది. జ్యోతి, తన తాతగారితో కలిసి పాత ఇంటికి వెళ్లిపోతుంది. జ్యోతి పెళ్ళికోసం శేఖర్ స్వంత ఇంటిని తాకట్టుపెట్టి డబ్బు తెచ్చి సంధ్యకిచ్చి బొంబాయి వెడతాడు. పెళ్ళి సమయంలో డబ్బు పెట్టెలో తెల్లకాగితాలు ప్రత్యక్షమవుతాయి. దానితో పెళ్ళి చెడుతుంది. జ్యోతి ఆత్మహత్య చేసుకుంటుంది. బొంబాయి నుండి తిరిగి వచ్చిన శేఖర్ సంధ్యతో ఘర్షణ పడతాడు. పసిబిడ్డను తీసుకుని వేరే వెళ్లిపోతాడు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయి ఎస్.ఐ. అవుతాడు. శేఖర్ ఈలోగా ప్రొఫెసర్ అవుతాడు. బడిపిల్లల్ని రక్షించిన ఎస్.ఐ. శ్యాంకు బహుమతి అందజేసిన జస్టిస్ సంధ్యను చూసి శేఖర్, శేఖర్‌ని చూసి సంధ్య నిశ్చేష్టులవుతారు[1].

పాటలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆంధ్రపత్రిక దినపత్రిక జనవరి 6, 1981 సంచికలో సమీక్ష". Archived from the original on 2016-03-05. Retrieved 2015-12-11.

బయటి లింకులు

మార్చు