పండగ చేస్కో 2015 మే 29, శుక్రవారం విడుదలైన తెలుగు సినిమా.

పండగ చేస్కో
దర్శకత్వంగోపీచంద్ మలినేని
స్క్రీన్ ప్లేకోన వెంకట్,
అనిల్ రావిపూడి
కథవెలిగొండ శ్రీనివాస్
నిర్మాతపరుచూరి కిరీటి
తారాగణంరామ్‌ పోతినేని
రకుల్ ప్రీత్ సింగ్
సోనాల్ చౌహాన్
బ్రహ్మానందం
జగపతి బాబు
ఛాయాగ్రహణంఆర్థర్ ఎ. విల్సన్
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
యునైటెడ్ మూవీస్
విడుదల తేదీ
29 మే 2015 (2015-05-29)[1]
సినిమా నిడివి
162 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్₹15.8 కోట్లు[2]

పోర్చుగల్‌లో ఉన్న కార్తీక్ పోతినేని (రామ్). వీడియో గేమ్స్ అభివృద్ధి చేసే పెద్ద సంస్థ పెట్టి, కోట్లు గడిస్తాడు. తల్లితండ్రులు (పవిత్రా లోకేశ్, రావు రమేశ్), చెల్లెలు, బావ ఉంటారు. పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్న తరుణంలో అతనికి అనుష్క (సోనాల్ చౌహాన్) అనే మరో పారిశ్రామికవేత్త తారసపడుతుంది. సరైన వయసులోగా భారతీయ సంతతి వ్యక్తిని ఎవరినైనా పెళ్ళిచేసుకోకపోతే, వేల కోట్ల ఆస్తి మొత్తం వేరొకరికి వెళ్ళిపోతుందని ఆమె తండ్రి వీలునామా రాసిన సంగతి ఆమెకు ఆలస్యంగా తెలుస్తుంది. ముప్ఫై రోజులే గడువు ఉండడంతో, వరుడి కోసం వెతుకుతున్న ఆమె కార్తీక్‌ను పెళ్ళాడాలనుకుంటుంది.

మరోపక్క, బొబ్బిలిలో ఉండే హీరోయిన్ దివ్య (రకుల్ ప్రీత్ సింగ్). ఆమె తల్లి, తండ్రి (మిర్చి సంపత్) విడిపోతారు. తల్లి, మేనమామ (సాయికుమార్) దగ్గర పెరుగుతుంటుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే తండ్రికీ, మేనమామకూ మధ్య నలిగిపోతుంటుంది. లాభం లేదని వేరే ఊరికి వచ్చేస్తుంది. కాలుష్యానికి కారణమవుతోందంటూ కార్తీక్ కర్మాగారం మీద కేసు వేసి, మూయించే పరిస్థితి తెస్తుంది. మనదేశంలోని ఈ కర్మాగారం కోసం పోర్చుగల్ నుంచి పెళ్ళి పనులు కూడా పక్కన పడేసి, మరీ వస్తాడు కార్తీక్.

కార్తీక్ ఇక్కడ కొచ్చాక, దివ్యను ప్రేమలో పడేయడానికి ప్రయత్నిస్తాడు. ఇంతకీ కార్తీక్ ఎవరు? అతనికీ దివ్య తండ్రికీ ఉన్న బంధం ఏమిటి? దివ్య తండ్రికీ, మేనమామకూ మధ్య వైరానికి కారణం ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.[3]

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • కథ - వెలిగొండ శ్రీనివాస్
  • స్క్రీన్‌ప్లే - మాటలు - కోన వెంకట్,
  • రచనా సహకారం - అనిల్ రావిపూడి
  • నిర్మాత - పరుచూరి కిరీటి
  • స్క్రీన్‌ప్లే - దర్శకత్వం - గోపీచంద్ మలినేని

బయటి లంకెలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Pandaga Chesko gets a new release date". Indiaglitz Telugu.
  2. "Chesko Pre-release Business"". Archived from the original on 2015-05-30. Retrieved 2015-05-30.
  3. "'Pandaga Chesko' Review: Routine Fare". greatandhra.com. 29 May 2015. Retrieved 30 May 2015.