పందిరి మంచం (సినిమా)

పందిరిమంచం 1991 లో విడుదలైన సినిమా. దీనిని శ్రీ అనుపమ ప్రొడక్షన్స్ పతాకంపై బలరామ్ నిర్మించగా, ఓంకార్ దర్శకత్వం వహించాడు. ఇందులో జగపతి బాబు, రాధ, భాగ్యశ్రీ నటించారు. రాజ్-కోటి సంగీతం సమకూర్చాడు. [1]

పందిరి మంచం
(1991 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఓంకార్
నిర్మాణం బలరామ్
కథ ఓంకార్
చిత్రానువాదం ఓంకార్
తారాగణం జగపతి బాబు,
రాధ
సంగీతం రాజ్ - కోటి
సంభాషణలు ఓంకార్
ఛాయాగ్రహణం వై. మహీధర్
కూర్పు మురళి రామయ్య
నిర్మాణ సంస్థ శ్రీ అనుపమా ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథ సవరించు

ఈ చిత్రం ఒక గ్రామంలో ప్రారంభమవుతుంది, ఇక్కడ మదన గోపాల కృష్ణ శాస్త్రి (ఓంకార్), ఆ గ్రామంలో నియంతలా ప్రవర్తిస్తూంటాడు. ప్రెసిడెంటు పెద్ద వెంకట రాయుడు (నర్రా వెంకటేశ్వర రావు) అతనికి అనుచరుడు. కానీ అతని మేనల్లుడు రాజేష్ (రాజేష్) వారిని ఎప్పుడూ వ్యతిరేకిస్తూంటాడు. కాబట్టి, వారు రాజేష్‌ను ఎదుర్కోవడానికి పట్టణం నుండి రౌడీగారు (జగపతి బాబు) అనే గూండాను తీసుకొస్తారు. మధురవాణి (రాధ) ఒక వేశ్య. ఆమె రౌడీగారిని సంస్కరిస్తుంది.ఆమె అతన్ని ప్రేమిస్తుంది. కానీ అతను శాస్త్రి మరదలు సీత (భాగ్యలక్ష్మి) అనే అందమైన అమ్మాయితో ప్రేమలో పడతాడు. మిగిలిన కథ రౌడీగారు శాస్త్రి, ప్రెసిడెంటులకు ఎలా పాఠం నేర్పాడో, గ్రామాన్ని సరైన దారిలో ఎలా పెట్టాడో చూపిస్తుంది..

తారాగణం సవరించు

పాటలు సవరించు

ఓంకార్ రాసిన పాటలకు రాజ్-కోటి సంగీతం సమకూర్చారు. సూర్య ఆడియో కంపెనీ ద్వారా సంగీతం విడుదలైంది.

ఎస్. పాట గాయనీ గాయకులు నిడివి
1 "చిలకమ్మ పలుకు" మనో, చిత్ర 4:55
2 "పిల్లో పిడుగో" మనో, చిత్ర 3:55
3 "ఎంతది" చిత్ర 4:08
4 "రౌడీ గారూ" మనో, చిత్ర 4:35
5 "అమ్మ నీ" మనో, చిత్ర 4:35

మూలాలు సవరించు

  1. "Pandirimancham (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-12. Retrieved 2020-08-07.