పచ్మర్హి
పచ్మర్హి అనేది మధ్య ప్రదేశ్ రాష్ట్రం, హోషంగాబాద్ జిల్లాలో ఉన్న ఒక హిల్ స్టేషన్. బ్రిటీష్ రాజ్ కాలం నుండి ఇది ఒక కంటోన్మెంట్ (పచ్మరి కంటోన్మెంట్) ప్రదేశం.[2] దీని పురపాలకసంఘం సాత్పురా శ్రేణిలోని లోయలో ఉంది. దీనిని సాత్పురాకి రాణి అని పిలుస్తారు. ("సాత్పురా రాణి")
Pachmarhi | |
---|---|
Hill station | |
Nickname: Queen of Satpura | |
Coordinates: 22°28′00″N 78°24′40″E / 22.4667°N 78.4110°E | |
Country | India |
State | Madhya Pradesh |
District | Hoshangabad |
Elevation | 1,067 మీ (3,501 అ.) |
Languages | |
• Official | Hindi |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 461881 |
Telephone code | +91 7578 |
Vehicle registration | MP-05 |
Nearest city | Pipariya |
పచ్‌మర్హి 1067 అడుగుల ఎత్తులో ఉంది. ధూప్‌గఢ్, మధ్యప్రదేశ్ లోని ఎత్తైన ప్రదేశం (1,352 మీటర్లు)లో సాత్పురా శ్రేణి సమీపంలో ఉంది.ఈ పట్టణం పూర్తిగా పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్ సత్పురా టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది.
చరిత్ర
మార్చుపచ్మర్హి ప్రదేశంలో అనేక కొండలు గుహలుతో కలిగి ఉన్నాయి. సమాజం పేరు హిందీ పదాలు పంచ్ ("ఐదు") మర్హి ("గుహలు") నుండి ఉద్భవించిందని నమ్ముతారు. ఒక పురాణం ప్రకారం, ఈ గుహలను మహాభారత కాలంలోని ఐదుగురు పాండవ సోదరులు వారి పదమూడు అజ్ఞాతవాసంలో నిర్మించారని కథనం.[3]ఈ ప్రాంతం భోంస్లే రాజ్యంలో భాగం.తరువాత 18వ శతాబ్దంలో మరాఠాలచే పాలించబడింది.
ఇది తరువాత 19వ శతాబ్దంలో భగవత్ సింగ్ గోండి రాజ్యంలో భాగమైంది, అయితే ఆ సమయంలో శాశ్వత స్థిరనివాసం లేదు.1857లో బ్రిటీష్ సైన్యానికి చెందిన కెప్టెన్ జేమ్స్ ఫోర్సిత్,సుభేదార్ మేజర్ నాథూ రామ్‌జీ పొవార్ ఝాన్సీకి వెళ్లే మార్గంలో పీఠభూమిని గమనించినప్పుడు ఆధునిక పంచమర్హి మూలాలను గుర్తించారు.[4] ఇది భారతదేశం లోని సెంట్రల్ ప్రావిన్స్‌లలో బ్రిటీష్ దళాలకు హిల్ స్టేషన్, శానిటోరియంగా అభివృద్ధి చెందింది. పొవార్ కొత్వాల్‌గా మార్చబడింది. (ఆయుధశాలకు బాధ్యత వహించే వ్యక్తి)
1901లో ఏడాది పొడవునా జనాభా 3,020, వేడి వేసవి నెలల్లో జనాభా ఈ సంఖ్య రెట్టింపు అయింది.పచ్‌మర్హి సెంట్రల్ ప్రావిన్సులకు వేసవి రాజధానిగా పనిచేసింది.
యునెస్కో 2009 మే లో పచ్‌మర్హి ప్రాంతాన్ని దీనికి సమీపంలో ఉన్న అనేక అరుదైన వృక్ష జాతుల కారణంగా దానిని బయోస్పియర్ రిజర్వ్‌ల జాబితాలో చేర్చింది, పచ్‌మర్హి బయోస్పియర్ రిజర్వ్ మొత్తం 4981.72 కి.మీ2, విస్తీర్ణంలో కలిగిఉంది. ఇది అక్షాంశం 22° 11' నుండి 22° 50'N, రేఖాంశం 77° 47' నుండి 78° 52'E వరకు ఉంది. రిజర్వ్ పారెస్ట్ మొత్తం మూడు సివిల్ జిల్లాల భాగాలలో విస్తరించింది.అవి; హోషంగాబాద్ (59.55%), చింద్వారా (29.19%), బేతుల్ (11.26%). ఇందులో బోరి అభయారణ్యం (485.72 కిమీ 2) అనే మూడు వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అవి సాత్పురా జాతీయ పార్కు (524.37 కిమీ 2), పచ్‌మర్హి అభయారణ్యం (491.63 కిమీ 2) విస్తీర్ణంలో ఉంది. [5] [6]
పట్టణం
మార్చుపచ్మర్హి ఒక చిన్నకంటోన్మెంట్ పట్టణం. దాని భూభాగంలో ఎక్కువ భాగం భారత సైన్యానికి సేవలందించే పచ్‌మర్హి కంటోన్మెంట్ బోర్డ్ పరిపాలనలో ఉంది. ఇండియన్ ఆర్మీ ఎడ్యుకేషన్ కార్ప్స్ (ఎఇశి) సంఘంలో ఆధ్యర్యంలో పరిపాలన సాగింది.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పచ్‌మార్హిలో దాదాపు 12,062 జనాభా ఉంది. అక్కడ నివసింఛే వారిలో చాలా మంది సైన్యంలో, అటవీ సిబ్బందిగా, పర్యాటక సిబ్పందిగా, ఇతర పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు.
పట్టణం, ధూప్‌గఢ్ పర్వతం మధ్య ఉన్న ఎయిర్‌స్ట్రిప్ హెలిప్యాడ్ కలిగి ఉంది. ఎయిర్‌స్ట్రిప్ చాలా అరుదుగా ఉపయోగించబడుతుంది.గడ్డితో నిండిపోయింది. పులులు, బైసన్ వంటి అడవి జంతువులు తరచుగా రావటానికి అవకాశం ఉందని కథనం
వాతావరణం
మార్చుపచ్మర్హి వాతావరణం తేలికపాటిది, ఉష్ణోగ్రతలు వెచ్చగా నుండి చల్లగా ఉంటాయి, కోపెన్, గీగర్ సిడబ్యుఎ వర్గీకరణతో ఉంటుంది. (తేమతో కూడిన ఉపఉష్ణమండల) వేసవిలో శీతాకాలం కంటే ఎక్కువ వర్షపాతం ఉంటుంది. పట్టణ సగటు ఉష్ణోగ్రత 21.7 °C, సగటు వార్షిక వర్షపాతం 2012 మిల్లీ మీటర్లు, సంవత్సరంలో మే నెల అత్యంత వేడిగా ఉండే నెల, సగటు ఉష్ణోగ్రత 30.3 °C, అయితే సంవత్సరంలో డిసెంబరు నెల అత్యంత శీతలమైన నెల, సగటు ఉష్ణోగ్రత 15.5 °C.ఉంటుంది. [7]
పచ్మర్హిలో ముఖ్యమైన పర్యాటక పరిశ్రమ ఉంది. అనేక హోటళ్లు అలాగే కొన్ని అతిథి గృహాలు, విశ్రాంతి గృహాలు ఉన్నాయి. [8] చాలా మంది పర్యాటకులు స్థానిక గుహ కాలిబాటలను చూడటానికి వస్తారు, వాటిలో కొన్ని 10,000 సంవత్సరాల పైవాటివని అంచనాగా గుర్తించారు. [9] పర్యాటకులు పాండవుల గుహలు, స్థానిక అరణ్యాలను కూడా సందర్శిస్తారు. కొత్త నిర్మాణంపై ప్రభుత్వ పరిమితుల కారణంగా చాలా వరకు భద్రపరచబడ్డాయి. చాలా మంది సందర్శకులు పారాగ్లైడింగ్, బోటింగ్ కూడా చేస్తారు.
- రజత్ ప్రపత్ (పెద్ద జలపాతం)
- బీ ఫాల్
- బడా మహాదేవ్
- గుప్త మహదేవ్
- చౌరాఘర్ ( మహాశివరాత్రి సమయంలో శివ భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు)
- ధూప్‌గఢ్ (సత్పురా, మధ్య ప్రదేశ్‌లలో ఎత్తైన శిఖరం)
- హండీ ఖోహ్ (లోతైన లోయ)
- అప్సర జలపాతం (ఫెయిరీ పూల్)
- జటాశంకర్ (లోతైన లోయలో స్టాలగ్మైట్ నిండిన గుహ)
- డచెస్ పతనం
- పచ్మరి కొండ (పచ్మరి నగరం మొత్తం దృశ్యం)
- పాన్సీ పూల్
- వాటర్స్ మీట్
- పికాడిల్లీ సర్కస్
- పాతర్చట్ట
- క్రంప్స్ క్రాగ్
- లేడీ రాబర్ట్‌సన్ వ్యూ
- కొల్లెటిన్ క్రాగ్
- రోసా పర్వతం
- రీచ్‌గఢ్
- రాజేంద్ర గిరి (సహజ దృశ్యాలతో కూడిన తోటలు)
- బన్శ్రీ విహార్
- లిటిల్ ఫాల్
- నాగద్వారి
- ద్రౌపది కుండ్
- ట్విన్హామ్ పూల్
- ఛోటా మహాదేవ్
- నందిగాడ్
అనేక రకాల సాహస శిక్షణాశిబిరాలను నిర్వహిస్తున్న నేషనల్ అడ్వెంచర్ ఇన్‌స్టిట్యూట్‌ని సందర్శించడానికి చాలా మంది సందర్శకులు ఇక్కడకు వస్తారు.
వన్యప్రాణులు
మార్చుసత్పురా టైగర్ రిజర్వ్‌లో పులి,చిరుతపులి,అడవి పంది, గౌర్ <i id="mwoQ">బోస్ గౌరస్</i> ), చిటాల్ డీర్ (యాక్సిస్ యాక్సిస్ ),ముంట్‌జాక్ డీర్, సాంబార్ డీర్ (<i id="mwpg">సెర్వస్ యూనికలర్</i> ), మకాక్యూస్ వంటి అనేక పెద్ద క్షీరద జాతులు ఉన్నాయి.
స్థానిక జంతుజాలంలో చింకారా,నీల్‌గాయ్, అడవి కుక్కలు, భారతీయ తోడేలు,బైసన్,ఇండియన్ జెయింట్ స్క్విరెల్స్, ఫ్లయింగ్ స్క్విరెల్స్ ఉన్నాయి.
జీవావరణం
మార్చుపచ్మర్హి అడవులలో మామిడి,జామున్, సీతాఫలం వంటి అనేక పండ్ల చెట్లు, ఖతువా, టెండు, చున్నా, ఖిన్ని, చార్ వంటి అంతగా తెలియని స్థానిక పండ్లు ఉన్నాయి.ఓక్, బ్లూ పైన్ కూడా సమృద్ధిగా ఉన్నాయి. అదనంగా, అడవి అనేక ఔషధ మొక్కలు, మూలికలను కలిగి ఉంది.
ధూప్‌ఘర్
మార్చుసాత్పురా శ్రేణి ఎత్తైన ప్రదేశం 1,352 మీ. ఇది సూర్యోదయం, సూర్యాస్తమయ వీక్షణలకు ప్రసిద్ధి చెందింది.రాత్రి సమయంలో, ఇటార్సి వంటి పొరుగు పట్టణాల లైట్లను చూడవచ్చు.శిఖరాన్ని రోడ్డు మార్గంలో లేదా కాలినడకన చేరుకోవచ్చు.
చౌరాఘర్
మార్చుఇది సత్పురా శ్రేణులలో మూడవ ఎత్తైన శిఖరం.ఇది శివుడి ఆలయం పైభాగంలో ఉన్న తీర్థయాత్ర ప్రదేశం.అక్కడి చౌరాగఢ్ కోటను గోండ్ రాజవంశానికి చెందిన సంగ్రామ్ షా నిర్మించాడు.దీనిని నాగపూరుకుచెందిన సేన సాహెబ్ సుభా జానోజీ మహారాజ్ అభివృద్ధి చేశారు.మరాఠా శకం నుండి నాగ్పూర్ నుండి తీర్థయాత్ర ప్రారంభమైంది.ఇది సూర్యోదయ వీక్షణకు విస్తృతంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం.నాగపంచమి, మహాశివరాత్రి ఉత్సవాల సమయంలో,భక్తులు పెద్దసంఖ్యలో చౌరాగఢ్ ఆలయానికి తరలివస్తారు.సుమారు 2 లక్షల త్రిశూళ్లను ఆలయ ముందు, ఆలయ మార్గంలో ఉంచుతారు.
- ↑ "Pachmarhi – the Saucer Shaped Valley | TravelDest". 20 July 2010. Archived from the original on 17 June 2012. Retrieved 21 June 2012.
- ↑ "Pachmarhi, Jewel in the crown of Central India". Times of India. Archived from the original on 13 December 2013. Retrieved 25 December 2021.
- ↑ Rongmei, Precious (5 September 2023). "Pandava Caves that gave Pachmarhi in Madhya Pradesh its name". The Times of India. Retrieved 7 July 2024.
- ↑ Pachmarhi Travel Guide. Goodearth Publications. 2009. p. 6. ISBN 978-81-87780-95-3. Archived from the original on 14 February 2017. Retrieved 5 October 2016.
- ↑ "Three Indian sites added to UNESCO list of biosphere reserves". Sify. 27 May 2009. Archived from the original on 28 October 2014. Retrieved 30 May 2009.
- ↑ "UNESCO Designates 22 New Biosphere Reserves". Environment News Service. 27 May 2009. Archived from the original on 3 March 2016. Retrieved 30 May 2009.
- ↑ "Pachmarhi climate: Average Temperature, weather by month, Pachmarhi weather averages - Climate-Data.org". en.climate-data.org. Archived from the original on 22 June 2019. Retrieved 25 December 2021.
- ↑ "How to Reach | Pachmari Tour" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 18 February 2022.
- ↑ "International attention for Pachmarhi rock art". Hindustan Times (in ఇంగ్లీష్). 12 September 2012. Retrieved 4 April 2022.