పద్మ పురస్కారం భారత ప్రభుత్వంచే అందించబడే అత్యున్నత పురస్కారంలో ఒక పురస్కారం. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు, మొదలగు వాటిలో విశిష్ట సేవ చేసినవారికి ప్రాథమికంగా ఇచ్చే ఈ పౌరపురస్కారం 1954, జనవరి 2న నెలకొల్పబడింది. వివిధ రంగాలలో కృషిచేసిన భారత పౌరులకు పద్మ విభూషణ్ పురస్కారం, పద్మభూషణ్ పురస్కారం, పద్మశ్రీ పురస్కారం పేరిట పురస్కారం ఇవ్వబడుతుంది.[1]

పద్మ పురస్కారం
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం పౌర
విభాగం సాధారణ
వ్యవస్థాపిత 1954
మొదటి బహూకరణ 1954
క్రితం బహూకరణ 2020
బహూకరించేవారు భారత ప్రభుత్వం
నగదు బహుమతి ...
వివరణ ...

ఎంపిక

మార్చు

ప్రతి సంవత్సరం మే 1, సెప్టెంబరు 15 తేదీలలో పద్మ పురస్కారానికి సంబంధించిన సిఫారసులను భారత ప్రధాని ఏర్పాటు చేసిన పద్మ అవార్డుల కమిటీకి సమర్పించబడుతాయి. కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, భారతరత్న, మునుపటి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్, మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర గవర్నర్, పార్లమెంట్ సభ్యులు, తదితరుల నుండి ఈ సిఫార్సులు వస్తాయి. అలా వచ్చిన వాటిని ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతికి ఆమోదం కోసం అవార్డు కమిటీ సమర్పిస్తుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డు గ్రహీతలను ప్రకటించి, ప్రతి సంవత్సరం జనవరి 26న రాష్ట్రపతి చేతులమీదుగా పురస్కారాలను అందజేస్తారు.

పద్మ పురస్కారాలు

మార్చు
  1. పద్మ విభూషణ్ పురస్కారం: ఇది భాతరదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం. ఈ పురస్కారం పతకం రూపంలో వుంటుంది, దీనిపై దేవనాగరి లిపిలో "పద్మ" "విభూషణ్"లు వ్రాయబడి వుంటాయి. 2020 సంవత్సరం వరకు 314 మందికి ఈ పురస్కారం అందజేయబడింది.
  2. పద్మభూషణ్ పురస్కారం: ఇది భాతరదేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారం. ఈ పురస్కారం పతకం రూపంలో వుంటుంది, దీనిపై దేవనాగరి లిపిలో "పద్మ" "భూషణ్"లు వ్రాయబడి వుంటాయి. 2020 సంవత్సరం వరకు 1270 మందికి ఈ పురస్కారం అందజేయబడింది.
  3. పద్మశ్రీ పురస్కారం: ఇది భారతదేశ నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం. ఈ పురస్కారం పతకం రూపంలో వుంటుంది, దీనిపై దేవనాగరి లిపిలో "పద్మ" "శ్రీ"లు వ్రాయబడి వుంటాయి. 2020 సంవత్సరం వరకు 3005 మందికి ఈ పురస్కారం అందజేయబడింది.[2]

పతకాలు

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. http://mha.nic.in/awards_medals Padma Shri Award recipients list Archived 2018-01-29 at the Wayback Machine Government of India
  2. "Padma Awards Directory (1954–2014)" (PDF). Ministry of Home Affairs (India). 21 May 2014. pp. 166–193. Archived from the original (PDF) on 15 November 2016. Retrieved 2020-09-07.

ఇతర లంకెలు

మార్చు

పద్మ పురస్కారాల కోసం ప్రభుత్వం మీడియాలో ప్రకటన ఇస్తుంది. ఆ పురస్కారాల కోసం వ్యక్తిగతంగా కానీ, వేరే వారి కోసం కానీ దరఖాస్తు చేయవలసి ఉంటుంది. తొలుత ఫోన్ నెంబరు, లేదా ఆధార్ నెంబరుతో పోర్టల్ లో లాగ్ఇన్ కావాలి. ఆ తరువాత వ్యక్తి గత వివరాలు సమర్పించాలి. ఆ క్రమంలో పురస్కారం కావాలని మనం కోరుకునే వ్యక్తి లేదా సంస్థ గురించి 500 పదాలకు మించకుండా వివరణ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఇతర వివరాల తరువాత సదరు వ్యక్తి ఫొటో, సంబంధిత వివరాల డాక్యుమెంట్ ను సమర్పించాల్సి ఉంటుంది..