పన్నా జాతీయ ఉద్యానవనం

(పన్న జాతీయ ఉద్యానవనం నుండి దారిమార్పు చెందింది)

పన్నా జాతీయ ఉద్యనవనం మధ్యప్రదేశ్ లోని పన్నా, ఛాతర్‌పూర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న జాతీయ ఉద్యానవనం . దీని వైశాల్యం 542.67 కి.మీ2 (209.53 చ. మై.). 1993 లో దీనిని భారతదేశపు ఇరవై రెండవ టైగర్ రిజర్వ్‌గా ప్రకటించారు. ఇది మధ్యప్రదేశ్‌లో ఐదవ టైగర్ రిజర్వు.[1] భారతదేశంలో అత్యుత్తమంగా నిర్వహిస్తున్న జాతీయ ఉద్యానవనంగా పన్నాకు 2007 లో భారత పర్యాటక మంత్రిత్వ శాఖ వారి ఎక్సలెన్స్ అవార్డు లభించింది.[1] అటవీ శాఖ అధికారులు వేటగాళ్ళతో కుమ్మక్కవడంతో 2009 నాటికి ఇక్కడి పులులన్నీ పూర్తిగా అంతరించి పోయాయి.[2] 2011 ఆగస్టు 25 న దీనిని బయోస్పియర్ రిజర్వ్‌గా ప్రకటించారు. సాల, మొసలి బెరడు, అర్జున, నేరేడు మొదలైన చెట్లు ఈ జీవావరణంలో ఉన్నాయి.

పన్నా జాతీయ ఉద్యానవనం
పన్నా బయోస్ఫియర్ రిజర్వు
పన్నా జాతీయ ఉద్యానవనంలో బెంగాల్ పులులు
Locationపన్నా జిల్లా, చాతర్పూర్ జిల్లా, మధ్యప్రదేశ్
Nearest cityపన్నా, ఖజురహో
Area542.67 కి.మీ2 (209.53 చ. మై.)
Established1981
Governing bodyభారత ప్రభుత్వం, కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ, ప్రాజెక్ట్ టైగర్, మధ్యప్రదేశ్

పులుల సంరక్షణా కేంద్రం

మార్చు

1994/95 లో పన్నా నేషనల్ పార్కును టైగర్ రిజర్వుగా ప్రకటించి, ప్రాజెక్ట్ టైగర్ సంరక్షణలో ఉంచారు.[3][4] పన్నాలో పులుల జనాభా క్షీణించి పోతున్నట్లు చాలాసార్లు నివేదించారు.[5][6][7] 2009 మార్చిలో బాంధవ్‌గఢ్ జాతీయ ఉద్యానవనం నుండి, కన్హా జాతీయ ఉద్యానవణం నుండి ఒక్కొక్కటి చొప్పున రెండు ఆడ పులులను ఇక్కడికి తెచ్చారు. అయితే, అప్పటికే చివరి మగ పులి కనుమరుగైంది.[8] పులుల అదృశ్యాన్ని దర్య్పాతు చేసేందుకుఒక కమిటీని ఏర్పాటు చేశారు.[9]

2009 జూన్‌లో, అంతకు ఆరు సంవత్సరాల ముందు 40 పులులు ఉన్న ఈ రిజర్వు‌లో పై రెండు ఆడ పులులు తప్ప మిగతా పులులు ఒక్కటి కూడా మిగల్లేదని అధికారికంగా ప్రకటించారు [10] మరో మూడేళ్ళ తరువాత, 2012 ఫిబ్రవరిలో, రిజర్వ్ లోని పులి జనాభా మొత్తం లుప్తమై పోయింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం దీనికి బాధ్యులెవరనేది నిర్ధారించలేదు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుండి, ప్రధానమంత్రి కార్యాలయం నుండి అభ్యర్థనలు వచ్చినప్పటికీ సిబిఐ విచారణకు అనుమతించలేదు.[11]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Field Director, Panna Tiger Reserve. "The Park". Welcome to the official website of Panna Tiger Reserve. Forest department of Madhya Pradesh. Retrieved 7 February 2012.
  2. "Poaching nexus exposed". The Statesman. The Statesman Limited. 31 October 2011. Archived from the original on 3 January 2003. Retrieved 7 February 2012.
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Muk అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. [dead link]
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Ashishsaroli అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. "PANNA NATIONAL PARK, LOCATED ABOUT". letsuppro. India. 24 February 2008. Archived from the original on 11 డిసెంబరు 2019. Retrieved 8 September 2019.
  7. "The main attraction of Panna National Park". Archived from the original on 11 డిసెంబరు 2019. Retrieved 14 May 2009.
  8. "Govt orders probe into missing Panna tiger". The Times of India. 28 March 2009. Archived from the original on 23 అక్టోబరు 2012. Retrieved 18 October 2011.
  9. "Panel to look into disappearance of tiger". The Times of India. 9 May 2009. Archived from the original on 23 అక్టోబరు 2012. Retrieved 18 October 2011.
  10. It's official: Panna reserve has no tiger Archived 2012-10-24 at the Wayback Machine The Times of India, 14 June 2009.
  11. Mahim Pratap Singh (7 February 2012). "CBI probe for Panna tiger debacle stuck at the lowest level". The Hindu. Bhopal: The Hindu. Archived from the original on 10 ఫిబ్రవరి 2012. Retrieved 7 February 2012.