గరిట

గరిటె లేదా గరిట అనేది పులుసు, పెరుగు వంటి ద్రవ ఆహార పదార్థాలు వడ్డన కొరకు ఉపయోగించబడే ఒక చెంచా. ముందు భాగం ఆహరం నిలపడానికి గిన్నెలాగా, వెనుక భాగం పట్టుకోవడానికి పొడువగా ఒక తెడ్డు పోల్చిన ఆకారం కలిగి ఉంటుంది.

సాధారణంగా మిగిలిన వంటపాత్రల వలె ఇనుప, ఇత్తడి, స్టీలు, ఇతర లోహపు మిశ్రమాలతో ఇవి తయారు చేయబడతాయి. అవిగాక కొన్ని సార్లు ప్లాస్టిక్, కలప లేక వెదురు రకాలు కూడా తయారు అవుతాయి. వాడుకావసరాలు బట్టి ఇవి 5 అంగుళాలు నుండి 15 అంగుళాల వరకు పరిమాణం కలిగి ఉండగలవు.

"https://te.wikipedia.org/w/index.php?title=గరిటె&oldid=2952375" నుండి వెలికితీశారు