పర్జానియా
పర్జానియా[2] 2007 జనవరి 26న విడుదలైన సినిమా. రాహుల్ ధోలాకియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నసీరుద్దీన్ షా, సారిక, కోరిన్ నెమెక్, రాజ్ జుత్షి తదితరులు నటించారు. 700,000 అమెరికన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా అహ్మదాబాద్, హైదరాబాదు తదితర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా థియేటర్లతో విడుదలకుముందు, 2005 నవంబరు 26న గోవాలో జరిగిన 36వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[3] 53వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఈ సినిమాకు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి (సారిక) విభాగంలో అవార్డులు వచ్చాయి.
పర్జానియా | |
---|---|
దర్శకత్వం | రాహుల్ ధోలాకియా |
రచన | డేవిడ్ ఎన్. డోనిహ్యూ రాహుల్ ధోలాకియా |
నిర్మాత | రాహుల్ ధోలాకియా కమల్ పటేల్ |
తారాగణం | నసీరుద్దీన్ షా సారిక కోరిన్ నెమెక్ రాజ్ జుత్షి |
ఛాయాగ్రహణం | రాబర్ట్ డి. ఎరాస్ |
కూర్పు | ఆరీఫ్ షేక్ |
సంగీతం | జాకీర్ హుస్సేన్ తౌఫిక్ ఖురేషి |
పంపిణీదార్లు | పివిఆర్ పిక్చర్స్ |
విడుదల తేదీs | 2005 నవంబరు 26 (ఫిల్మ్ ఫెస్టివల్) 2007 జనవరి 26 (థియేటర్) |
సినిమా నిడివి | 122 నిముషాలు |
దేశాలు | యునైటెడ్ స్టేట్స్ భారతదేశం |
భాషలు | ఇంగ్లీష్ గుజరాతి హిందీ |
బడ్జెట్ | US$700,000[1] |
కథా నేపథ్యం
మార్చు2002లో గుల్బర్గ్ సొసైటీ మారణకాండ తర్వాత అదృశ్యమైన పదేళ్ల వయస్సు గల పార్సీ అబ్బాయి, అజహర్ మోడి (పర్జాన్ పిఠవాలా పాత్ర) నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. 2002లో గుజరాత్‌లో జరిగిన మత అల్లర్లలో అనేక సంఘటనలలో ఇదీ ఒకటి.[4] తప్పిపోయిన కొడుకు ఆచూకీ కోసం పిఠవాలా కుటుంబం ప్రయత్నాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది.
నటవర్గం
మార్చు- నసీరుద్దీన్ షా (సైరస్)
- కోరిన్ నెమెక్ (అల్లన్)
- సారిక (షెర్నాజ్)
- పర్జాన్ దస్తూర్ (పర్జాన్)
- పెర్ల్ బార్సివల్లా
- రాజ్ జుత్షి
- ఆసిఫ్ బస్రా
- పుష్పేంద్ర సైనీ
- రామ్ గోపాల్ బజాజ్
- షీబా చద్దా
అవార్డులు, గౌరవాలు
మార్చుఅవార్డు | విభాగం | గ్రహీత | ఫలితం |
---|---|---|---|
53వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు[5] | గోల్డెన్ లోటస్ అవార్డు | రాహుల్ ధోలాకియా | గెలుపు |
సిల్వర్ లోటస్ అవార్డు | సారిక | గెలుపు | |
53వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | ఉత్తమ కథ | డేవిడ్ ఎన్. డోనిహుయే, రాహుల్ ధోలాకియా | ప్రతిపాదించబడింది |
ఉత్తమ స్క్రీన్ ప్లే | ప్రతిపాదించబడింది | ||
స్క్రీన్ అవార్డ్స్ 2008 | రామ్‌నాథ్ గోయెంకా మెమోరియల్ అవార్డు | రాహుల్ ధోలాకియా[6] | గెలుపు |
చిత్రమాలిక
మార్చు-
ఈ సినిమాలో షెర్నాజ్గా నటించినందుకు సారిక 2005 లో ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది
-
2005లో జరిగిన ఐఎఫ్ఎఫ్ఐ చిత్రోత్సవంలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్న పెర్ల్ బార్సివాల్లా
మూలాలు
మార్చు- ↑ Chu, Henry (25 February 2007). "Film about massacre banned in India state". The Los Angeles Times. San Francisco Chronicle. Retrieved 31 July 2021.
- ↑ "Heaven & Hell On Earth - Overview". Allmovie. Retrieved 31 July 2021.[permanent dead link]
- ↑ Kamath, Sudhish (3 December 2005). "Turnout spells success for IFFI". The Hindu. Archived from the original on 5 March 2006. Retrieved 31 July 2021.
- ↑ "Apex court SIT submits report on Gulbarg Society massacre". The Hindustan Times. 14 May 2010. Archived from the original on 6 జూన్ 2011. Retrieved 31 జూలై 2021.
- ↑ "53rd National Film Awards – 2006". Directorate of Film Festivals. p. 30. Archived from the original on 15 August 2016. Retrieved 31 July 2021.
- ↑ 'Rahul Dholakia' Wins Ramnath Goenka Memorial Award Archived 2008-01-13 at the Wayback Machine IndiaGlitz, 11 January 2008.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పర్జానియా
- ఆల్మూవీ లో పర్జానియా