పల్లవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
పల్లవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ [a] అనేది భారతీయ రైల్వేల్లోని దక్షిణ రైల్వే జోన్ నిర్వహించే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్. ఇది తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లి మీదుగా చెన్నై నగరాన్ని కారైకుడికి కలుపుతుంది. పల్లవన్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రిన్స్ ఆఫ్ కార్డ్ లైన్ అని పిలుస్తారు. ఈ రైలు ఆ మార్గంలో ప్రసిద్ధి చెందిన రైళ్లలో ఒకటి. ఈ రైలు పెట్టెలను 2019 జూన్ 30 నుండి సరికొత్త ఆధునిక LHB పెట్టెలకు అప్‌గ్రేడ్ చేసారు.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ |
స్థితి | నడుస్తోంది |
తొలి సేవ | 15 ఆగస్టు 1984 |
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ రైల్వే |
మార్గం | |
మొదలు | Karaikkudi Junction |
ఆగే స్టేషనులు | 13 |
గమ్యం | Chennai Egmore |
ప్రయాణ దూరం | 426 కి.మీ. (265 మై.) |
సగటు ప్రయాణ సమయం | 6 hours, 45 minutes |
రైలు నడిచే విధం | Daily |
రైలు సంఖ్య(లు) | 12605/12606 [02605/02606(Covid-19 Special)] |
లైను (ఏ గేజు?) | Chord line |
సదుపాయాలు | |
శ్రేణులు | CC, 2S, SLR, SLRD and UR/GS |
వికలాంగులకు సదుపాయాలు | |
కూర్చునేందుకు సదుపాయాలు | ఓపెన్ కోచ్ |
పడుకునేందుకు సదుపాయాలు | No |
ఆటోర్యాక్ సదుపాయం | No |
ఆహార సదుపాయాలు | Yes |
చూడదగ్గ సదుపాయాలు | Yes |
వినోద సదుపాయాలు | No |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | WAP7 (Royapuram railway station) Three AC Chair car Thirteen Non-AC 2S Three UR/GS One EOG One SLRD |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
విద్యుతీకరణ | 25 kV AC 50 Hz |
వేగం | సగటు వేగం 64 km/h (40 mph) గరిష్ఠ వేఘం 110kmph |
రైలు పట్టాల యజమానులు | దక్షిణ రైల్వే |
రైలు బండి సంఖ్య(లు) | 21/21A[1] |
పల్లవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను వైగై సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కి సమాంతరంగా నడపడానికి ప్రవేశపెట్టారు. దీన్ని మదురై పల్లవన్ ఎక్స్‌ప్రెస్ పేరుతో రెండు ప్రత్యేక రేక్‌లతో చెన్నై, మదురై మధ్య 1977 ఆగస్టు 15 న చెన్నై, మదురైల మధ్య రోజువారీ ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌గా ప్రవేశపెట్టబడింది. [2] 2013 సెప్టెంబరు 1 నుండి కారైకుడి వరకు పొడిగించారు. వైగై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇది చెన్నై, తిరుచ్చి మధ్య వేగవంతమైన ప్రయాణా సౌకర్యంగా ఉంది. ఈ రైలు 426 కిమీ ప్రయాణాన్ని 6 గంటల 45 నిమిషాల్లో పూర్తి చేస్తుంది.
ఈ రైలు చెన్నై ఎగ్మోర్, తిరుచ్చిరాపల్లిల మధ్య గరిష్టంగా 110 kmph వేగంతో నడుస్తుంది.
ప్రత్యేకతలు
మార్చు1980ల ప్రారంభంలో వైగై సూపర్‌ఫాస్ట్, పల్లవన్ సూపర్‌ఫాస్ట్‌లు మాత్రమే ఈ మార్గంలో "సూపర్‌ఫాస్ట్" రైళ్ళు.
మీటేరు గేజిలో మొదటిసారిగా, ICF ప్రత్యేకంగా రెండు 40-సీట్ల AC చైర్ కార్ కోచ్‌లను తయారు చేసింది. వీటిని వైగై, పల్లవన్ ఎక్స్‌ప్రెస్‌లలో వాడారు.
భారతీయ రైల్వేలో ప్రత్యేకమైన కోచ్ PS1, (PANTRY CAR CUM CHAIR CAR కోచ్) ఉన్న ఏకైక రైలు ఇది. ఈ కోచ్‌లో సగం ప్యాంట్రీ కారు, మరో సగం సాధారణ చైర్ కార్. కానీ LHB అప్‌గ్రేడేషన్ తర్వాత దాని స్థానంలో AC హాట్ బఫే కారును వేసారు.
చెన్నై-తిరుచ్చిరాపల్లి మధ్య తేజస్ ఎక్స్‌ప్రెస్ మొదలైన రైళ్లు నడుస్తున్నప్పటికీ, పల్లవన్ సూపర్‌ఫాస్ట్ ట్రిచీ-చెన్నై-ట్రిచీ ప్రయాణికుల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో వైగై సూపర్‌ఫాస్ట్, రాక్‌ఫోర్ట్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి.
స్టేషన్లు
మార్చుచెన్నై నుండి కారైకుడి (12605)
మార్చుచెన్నై నుండి కారైకుడి వరకు పల్లవన్ ఎక్స్‌ప్రెస్ స్టాపుల జాబితా (ట్రైన్ నంబర్(లు) : 12605). [3]
స్టాప్ నం | స్టేషన్ కోడ్ | స్టేషన్ | రాక పోక | దూరం (కిమీ) |
---|---|---|---|---|
1 | కుమారి | చెన్నై ఎగ్మోర్ | 15:45 ప్రారంభమవుతుంది | 0 |
2 | TBM | తాంబరం | 16:13/16:15 | 25 |
3 | CGL | చెంగల్పట్టు జంక్షన్ | 16:43/16:45 | 56 |
4 | MLMR | మేల్మరువత్తూరు | 17:08/17:10 | 91 |
5 | VM | విల్లుపురం జంక్షన్ | 18:00/18:15 | 158 |
6 | VRI | వృదాచలం జంక్షన్ | 18:45/18:47 | 213 |
7 | ALU | అరియలూర్ | 19:21/19:22 | 260 |
8 | LLI | లాల్గుడి | 19:49/19:50 | 309 |
9 | SRGM | శ్రీరంగం | 20:06/20:08 | 324 |
10 | GOC | పొన్మలై గోల్డెన్ రాక్ | 20:19/20:20 | 333 |
11 | TPJ | తిరుచిరాపల్లి జంక్షన్ | 20:40/20:45 | 336 |
12 | PDKT | పుదుక్కోట్టై | 21:43/21:45 | 389 |
13 | KKDI | కారైకుడి జంక్షన్ | 22:35 ముగుస్తుంది | 425 |
కారైకుడి నుండి చెన్నై (12606)
మార్చుకారైకుడి నుండి చెన్నైకి పల్లవన్ ఎక్స్‌ప్రెస్ స్టాప్‌ల జాబితా (ట్రైన్ నంబర్(లు) : 12606). [4]
స్టాప్ నం | స్టేషన్ కోడ్ | స్టేషన్ | రాక పోక | దూరం (కిమీ) |
---|---|---|---|---|
1 | KKDI | కరైక్కుడి జంక్షన్ | 05:35కి ప్రారంభమవుతుంది | 0 |
2 | PDKT | పుదుకోట్టై | 05:58/06:00 | 36 |
3 | TPJ | తిరుచ్చిరాపల్లి జంక్షన్ | 06:50/06:55 | 89 |
4 | SRGM | శ్రీరంగం | 07:15/07:17 | 101 |
5 | LLI | లాల్గుడి | 07:32/07:33 | 116 |
6 | ALU | అరియలూర్ | 08:05/08:06 | 159 |
7 | VRI | వృద్ధాచలం జంక్షన్ | 08:38/08:40 | 214 |
8 | VM | విల్లుపురం జంక్షన్ | 09:28/09:30 | 267 |
9 | MLMR | మేల్మరువత్తూరు | 10:18/10:20 | 335 |
10 | CGL | చెంగల్పట్టు జంక్షన్ | 10:48/10:50 | 370 |
11 | TBM | తాంబరం | 11:18/11:20 | 401 |
12 | MBM | మాంబలం | 11:38/11:40 | 419 |
13 | కుమారి | చెన్నై ఎగ్మోర్ | 12:15 ముగుస్తుంది | 426 |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Trains at a Glance July 2013 – June 2014". Indian Railways. Retrieved 22 December 2013.
- ↑ "Glorious days of Vaigai Express! - David Pravin - Trip Report | IRFCA.org". www.irfca.org. Retrieved 2022-04-29.
- ↑ "Request Rejected". Archived from the original on 2016-03-14. Retrieved 2022-10-29.
- ↑ "Request Rejected". Archived from the original on 2016-03-14. Retrieved 2022-10-29.
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/>
ట్యాగు కనబడలేదు