పల్లెర్ల హనుమంతరావు

తెలంగాణ రాజకీయ నాయకుడు
(పల్లెర్ల హనమంతరావు నుండి దారిమార్పు చెందింది)

పల్లెర్ల హనుమంతరావు స్వాతంత్ర్య సమరయోధుడు, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు. ఇతను 1909 మార్చిలో మహబూబ్ నగర్ జిల్లాలో జన్మించాడు. న్యాయవిద్యను అభ్యసించి మహబూబ్ నగర్‌లో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. ఆ తర్వాత బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు తదితర ప్రముఖులతో కలిసి ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నాడు. మహబూబ్ నగర్‌లో జరిగే అన్ని ఉద్యమాలకు ఇతను నాయకత్వం వహించాడు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆంధ్రమహాసభను పటిష్ఠం చేయడమే కాకుండా గ్రామగ్రామాన గ్రంథాలయాలు స్థాపించడానికి కృషిచేశాడు. 1947-48లో నిరంకుశ నిజామ్ పాలనకు, దాష్టీక రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి జైలుకు వెళ్ళాడు.హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో కలిసిన పిమ్మట 1948, సెప్టెంబరు 19న ఇతను జైలు నుంచి విడుదలైనాడు. 1952లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికలలో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనాడు. అప్పుడే బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో స్థానం కూడా పొందినాడు. ఇతన్ని మహబూబ్ నగర్ గాంధీ అని పట్టణ ప్రజలు అప్యాయంగా పిలిచేవారు.[1] 1957, 1962లలో లోకసభకు ఎన్నికయ్యాడు.

పల్లెర్ల హనుమంతరావు

పదవీ కాలము
1957 – 1967
ముందు ఎన్.ఎం.జయసూర్య
తరువాత సంగం లక్ష్మీబాయి
నియోజకవర్గము మెదక్

వ్యక్తిగత వివరాలు

జననం సెప్టెంబర్ 17, 1909
మహబూబ్ నగర్, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి పి.సరస్వతీదేవి
సంతానము 2 కుమారులు, 4 కుమార్తెలు
మతం హిందూ మతం

గుర్తింపులుసవరించు

 
పల్లెర్ల హన్మంతరావు విగ్రహం

2009 మార్చిలో పల్లెర్ల హనుమంతరావు శతజయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడలిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించబడింది.





మూలాలుసవరించు

  1. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ సొసైటీ ప్రచురణ, ప్రథమ ముద్రణ 2006, పేజీ సంఖ్య 224