పసి

దురై దర్శకత్వంలో 1979లో విడుదలైన తమిళ సినిమా

పసి, 1979 డిసెంబరు 21న విడుదలైన తమిళ సినిమా. సునీత సినీ ఆర్ట్స్ బ్యానరులో సి.కె. షణ్ముగం లలిత, జి. దురై నిర్మించిన ఈ సినిమాకు దురై దర్శకత్వం వహించాడు. ఇందులో శోభ, ఢిల్లీ గణేష్, విజయన్ ముఖ్య పాత్రలు పోషించారు.[2] విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమాకు భారత జాతీయ చలనచిత్ర అవార్డులు, తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలలో రెండేసి అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమా పెట్ ప్యార్ ఔర్ పాప్ పేరుతో హిందీలోకి రీమేక్ చేయబడింది.

పసి
పసి సినిమా పోస్టర్
దర్శకత్వందురై
రచనదురై
నిర్మాతసి.కె. షణ్ముగం లలిత
జి. దురై
తారాగణంశోభ
ఢిల్లీ గణేష్
విజయన్
ఛాయాగ్రహణంవి. రంగ
కూర్పుఎం. వెల్లైచామి
సంగీతంశంకర్ గణేష్
నిర్మాణ
సంస్థ
సునీత సినీ ఆర్ట్స్
విడుదల తేదీ
21 డిసెంబరు 1979[1]
సినిమా నిడివి
138 నిముషాలు
భాషతమిళం

నటవర్గం

మార్చు
  • శోభ (కుప్పమ్మ)
  • విజయన్ (రంగన్)
  • ఢిల్లీ గణేష్ (మునియన్‌)
  • ప్రవీణ భాగ్యరాజ్ (కుముద)
  • తాంబరం లలిత (వల్లియమ్మ)
  • ఎస్ఎన్ పార్వతి (రక్కమ్మ)
  • సత్య (చెల్లమ్మ)
  • సెంథిల్ (చెల్లమ్మ సోదరుడు ఆరుముగం)
  • నారాయణన్ (సౌండ్ కన్నయ్య)
  • ఐఎస్‌ రామచంద్రన్ (కామన్‌ మ్యాన్‌)
  • జయభారతి (కాల్ గర్ల్‌)
  • సురులి రాజన్ (బిచ్చగాడు/రిక్షా యజమాని)

అతిథి పాత్ర

నిర్మాణం

మార్చు

కమర్షియల్ సినిమాలు తీయడంలో పేరుగాంచిన దురై, వాస్తవిక నేపథ్యంలో ఈ సినిమా రూపొందించాడు. ఈ సినిమాకు శంకర్ గణేష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ సినిమా కోసం తమిళనాడు ప్రభుత్వం 100,000 సబ్సిడీని అందించింది.[3]

స్పందన

మార్చు

ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతమై, థియేటర్లలో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది.[3] దురై స్వయంగా 1984లో స్మితా పాటిల్, రాజ్ బబ్బర్ నటీనటులుగా హిందీలో పెట్ ప్యార్ ఔర్ పాప్ అనే పేరుతో రీమేక్ చేసాడు.[4][5]

1980, జనవరి 13 నాటి తమిళ మ్యాగజైన్ ఆనంద వికటన్ పేదల జీవితాలను వాస్తవికంగా చిత్రీకరించినందుకు ఈ సినిమాను ప్రశంసించింది. శోభ నటన, రంగా కెమెరా వర్క్‌, దురై స్క్రిప్ట్- డైలాగ్‌లు కూడా ప్రశంసలు అందుకున్నాయి.[6] అదే సంవత్సరం తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శించబడింది.[7]

సెంథిల్‌కి ఈ సినిమా మంచి గుర్తింపును ఇచ్చింది. దాంతో అతను 1980లలో తమిళ సినిమాలోని హాస్యనటులలో ఒకరిగా స్థిరపడ్డాడు.[8] శోభ స్నేహితురాలు చెల్లమ్మ పాత్రలో నటించిన మరో నూతన నటి సత్య, ఈ సినిమా తర్వాత "పసి" పేరుతో పిలువబడింది.[9][3]

27వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కొద్దిసేపటికే, సినిమా 100వ రోజు వేడుకకు ఒక రోజు ముందు, నటి శోభ చెన్నై లోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.[3][10]

అవార్డులు

మార్చు
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు[12]
  • 1979 - ఉత్తమ తమిళ చిత్రం (దురై)[13]
  • 1979 - ఉత్తమ తమిళ నటి (శోభ)
తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు[3]
  • 1980 - ఉత్తమ చిత్రం (మొదటి బహుమతి) (జి. లలిత)
  • 1980 - ఉత్తమ నటుడిగా ప్రత్యేక బహుమతి ( ఢిల్లీ గణేష్)

మూలాలు

మార్చు
  1. Dhananjayan 2014, p. 260.
  2. "Pasi (1979)". Indiancine.ma. Retrieved 2021-08-03.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 Dhananjayan 2014, p. 261.
  4. Rangan, Baradwaj. "'I Am Blingbling Bappi-Da'". Outlook India. Retrieved 2021-08-03.
  5. Rangan 2014, p. 212.
  6. "சினிமா விமர்சனம்: பசி". Ananda Vikatan (in తమిళము). 13 January 1980.
  7. Parliamentary Debates: Official Report. Council of States, Secretariat. 1982.
  8. "From scratch to success". The Hindu. 8 June 2001. Archived from the original on 14 September 2012. Retrieved 2021-08-03.
  9. "Suspense-filled melodrama". The Hindu. 4 April 2002. Archived from the original on 10 November 2003. Retrieved 2021-08-03.
  10. "Shobha Mahendra death case: While mystery persists, rumours go on". India Today. 28 January 2014. Retrieved 2021-08-03.
  11. Ashok Kumar, S. R (3 May 2002). "It's a heavy price to pay". The Hindu. Archived from the original on 4 July 2003. Retrieved 2021-08-03.
  12. "The Times of India Directory and Year Book Including Who's who". 1982.
  13. https://www.youtube.com/watch?v=xbvqLIHMR2A

గ్రంథ పట్టిక

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పసి&oldid=4272387" నుండి వెలికితీశారు