పసుమర్తి సీతారామయ్య

పసుమర్తి సీతారామయ్య కూచిపూడి నాట్యాచార్యుడు. ఆయన 2004లో కేంద్ర సంగీత నాటక అకాడమి పురస్కారాన్ని అందుకున్నాడు.[1]

పసుమర్తి సీతారామయ్య

జీవిత విశేషాలు మార్చు

ఆయన కృష్ణా జిల్లా కు చెందిన కూచిపూడి గ్రామంలో పసుమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి, అరుంధతమ్మ ( ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు చింతా వెంకట్రామయ్య కుమార్తె) లకు ఏకైక సంఆనంగా ఫిబ్రవరి 15, 1927 న జన్మించాడు. ప్రారంభ నాట్య శిక్షణను వారి తాతగారైన రమణయ్య వద్ద పొందాడు. ఆయన తరువాత నాట్యశాస్త్ర్ంలో మెళుకువలను ప్రముఖ నాట్యాచార్యుడు వేదాంతం రాఘవయ్య వద్ద నేర్చుకున్నాడు.[1]

ఆయన గాత్ర సంగీతాన్ని యేలేశ్వరపు సీతారామాంజనేయులు వద్ద నేర్చుకున్నాడు. ఆయన స్త్రీ పాత్రలలో రాణించాడు. ఆయన ఉష, సత్యభామ మొదలగు స్త్రీ పాత్రలతో సభాసదుల అభిమానాన్ని చూరగొన్నాడు. హరిశ్చంద్ర, లవకుశ, మోహినీ రుక్మాంగద వంటి నాటకాలలో ముఖ్య పాత్రలు పోషించాడు. ఆయన ఒక దశాబ్దం పాటు మచిలీపట్నం వద్ద ఔత్సాహికులైన కళాకారులకు నాట్యంలో శిక్షణనిచ్చాడు. మొవ్వ గ్రామంలో ఉన్న క్షేత్రజ్ఞ కళాసమితి నిర్వహించిన నాట్య పోటీలలో వారి విద్యార్థులు వరుసగా మూడు సంవత్సరాలు బంగారు పతకాలను పొందారు. ఆయన 1970లో ఉత్తమ నాట్యాచార్య బిరుదును పొందాడు.[1]

ఆయన రెండేళ్ళపాటు న్యూఢిల్లీ వెళ్ళి అక్కడ నాట్య కళాకారులైన సోనాల్ మాన్‌సింగ్, ఇంద్రాణి రెహ్మాన్ వంటి వారికి కూచిపూడి నాట్యరీతులలో శిక్షణనిచ్చాడు. ఆయన స్వప్నసుందరి, రాధారెడ్డిలకు కూడా శిక్షణనిచ్చాడు.

ఆయనకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఫైన్ ఆర్ట్స్ విభాగంలో కూచిపూడి నాట్యాన్ని బోధించుటకు ఆహ్వానం అందింది. ఆయన 1973 నుండి విశాఖపట్నంలో స్థిరపడి నాట్య రీతులను శిక్షణనిస్తున్నాడు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 "Natyacharya Pasumarthi feted". A. RAMANLINGA SASTRY. The Hindu. 1 December 2005. Retrieved 13 November 2016.

ఇతర లింకులు మార్చు