పాగల్ అదిలాబాదీ
పాగల్ అదిలాబాదీ (అహ్మద్ షరీఫ్; 19 మే 1941 - 4 ఆగస్టు 2007) తెలంగాణకు చెందిన ఉర్దూ కవి. హైదరాబాదీ ఉర్దూలో (స్థానిక యాసలో) మజాహియా షాయరి, హాస్య కవితలు రాశాడు.[1] అతడు "పాగల్" (పిచ్చి) కలం పేరుతో గుర్తింపు పొందాడు.[2]
పాగల్ అదిలాబాదీ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | అహ్మద్ షరీఫ్ 1941 మే 19 నిజామాబాదు జిల్లా, తెలంగాణ, భారతదేశం |
మరణం | సుమారు2007 (aged 65–66) |
కలం పేరు | పాగల్ అదిలాబాదీ |
వృత్తి | కవి |
జాతీయత | భారతదేశం |
విషయం | హాస్యం |
తొలి జీవితం
మార్చుపాగల్ అదిలాబాది 1941, మే 19న తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించాడు. ఆదిలాబాద్‌లోని ముధోల్‌లో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు పనిచేయడం వల్ల అతనికి ఆ పేరు వచ్చింది.[3] 1964లో ఆదిలాబాద్‌లో పంజేషా మహాల్ ప్రాథమిక పాఠశాలలో పూర్తికాల ఉర్దూ టీచర్‌గా పని చేశాడు.
రచనారంగం
మార్చుఇతడు ఉర్దూలో షాయారీ, హాస్య కవితలు రాశాడు. ఖుసూర్ ఫుసర్ పుస్తకంలో పాగల్ అదిలాబాదీ పుస్తకాల గురించి వివరిస్తుంది. ఉపాధ్యాయుడిగా బిజీగా ఉన్న తొలిరోజుల్లో తన రచనలను ప్రచురించలేదు. ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసిన తరువాత, అతను పుస్తకాలు రాయడం ప్రారంభించాడు. 1995లో హిందీలో వచ్చిన 'గాడ్ అండ్ గన్' సినిమాలో ఇతడు రాసిన 'చమ్‌చా దిఖావో చల్‌కే' అనే పాట పేరొందింది. దుబాయి, అబూజ్ జబాయి, షార్జా తదితర దేశాల్లో ముషాయిరాలలో పాల్గొన్నాడు.[4]
గ్రంథాలు
మార్చు- 'ఖుసూర్ ఫుసర్' - గూంజ్ పబ్లికేషన్స్ (నిజామాబాద్).
- 'అల్లం గల్లం'
- 'ఛూ ఛూ మురబ్బా'
- ఖట్టే అంగూర్'
- 'గడ్‌బడ్ ఘోటాల్'
- 'అవుట్ పతంగ్'
అవార్డులు
మార్చు- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారం (1998)[4]
మరణం
మార్చుఅహ్మద్ షరీఫ్ 66 సంవత్సరాల వయస్సులో 2007, ఆగస్టు 4న మరణించాడు.[5][4]
మూలాలు
మార్చు- ↑ "Funny weekend in store for poetry lovers". The Hindu. 2005-12-09. Archived from the original on 7 September 2006. Retrieved 17 August 2021.
- ↑ "An endeavour that has restored the pride". The Hindu. 2007-09-08. Archived from the original on 5 December 2007. Retrieved 17 August 2021.
- ↑ Surhone, Lambert M.; Timpledon, Miriam T.; Marseken, Susan F. (14 July 2010). Pagal Adilabadi (in ఇంగ్లీష్). VDM Publishing. ISBN 978-613-2-09662-3. Retrieved 17 August 2021.
- ↑ 4.0 4.1 4.2 నమ తెలంగాణ, అంకురం (8 February 2017). "మన అదిలాబాద్ చిరునామా పాగల్ అదిలాబాదీ". NavaTelangana. డాక్టర్ ఉదారి. Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
- ↑ "Dear postmaster". The Statesman (in అమెరికన్ ఇంగ్లీష్). 24 December 2017. Retrieved 17 August 2021.