పాముల పుష్పశ్రీవాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఈవిడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందింది.

పాముల పుష్ప శ్రీవాణి

ఉప ముఖ్యమంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
8 జూన్ 2019

గిరిజన సంక్షేమశాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
8 జూన్ 2019
ముందు కిడారి శ్రావణ్ కుమార్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014
ముందు జనార్ధన తాట్రాజు

వ్యక్తిగత వివరాలు

జననం 22 జూన్ 1986
పశ్చిమ గోదావరి జిల్లా
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ వైఎస్సార్‌సీపీ
తల్లిదండ్రులు పాములు నారాయణ మూర్తి
(తండ్రి ),
గౌరీ పార్వతి
(తల్లి )
జీవిత భాగస్వామి శత్రుచర్ల పరీక్షిత రాజు
నివాసము పోలవరం, పశ్చిమ గోదావరి
పూర్వ విద్యార్థి సూర్య డిగ్రీ కాలేజీ, జంగారెడ్డి గూడెం (2003-2008),
కె.ఆర్.ఎన్.వి కాలేజ్, విశాఖపట్నం (2008)
వృత్తి రాజకీయ నాయకురాలు

జననంసవరించు

పుష్ప శ్రీవాణి 2019, జూన్ 8న పశ్చిమ గోదావరి జిల్లా, బుట్టాయగూడెం మండలం దొరమామిడి గ్రామంలో జన్మించింది. 10వ తరగతి వరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదివిన ఈవిడ, ఇంటర్‌ జంగారెడ్డిగూడెం సూర్య కళాశాలలో, డిగ్రీ అక్కడి ఉమెన్స్‌ కళాశాలలో, విశాఖలో బీఈడీ పూర్తి చేసింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలోనే ఏడాదిన్నరపాటు ఉపాధ్యాయురాలుగా పనిచేసింది.[1]

రాజకీయ జీవితంసవరించు

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన పుష్ప శ్రీవాణి ఉపాధ్యాయ వృత్తిని వీడి భ‌ర్త ప్రోత్సాహంతో రాజ‌కీయలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (2014)లో కురుపాం శాసనసభా నియోజకవర్గం నుంచి వైసీపీ త‌రుపున పోటీ చేసి 19,083 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయింది. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్యర్థి నరసింహ థాట్రాజ్ పై 26, 602 ఓట్ల మెజారిటీతో గెలిచింది. 2019, జూన్ 8న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి దక్కింది.[2][3]

మూలాలుసవరించు

  1. సాక్షి, పాలిటిక్స్ (22 June 2018). "వైఎస్సార్‌పై అభిమానంతోనే పరీక్షిత్‌తో పెళ్లి." Sakshi. మూలం నుండి 23 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 23 September 2019.
  2. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్- రాజకీయ వార్తలు (8 June 2019). "పాముల పుష్పశ్రీవాణి." www.andhrajyothy.com. మూలం నుండి 23 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 23 September 2019.
  3. బీబీసీ తెలుగు, శంకర్ (8 June 2019). "జగన్ క్యాబినెట్‌: ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి". మూలం నుండి 23 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 23 September 2019. Cite news requires |newspaper= (help)