పామూరు

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, పామూరు మండల జనగణన పట్టణం


పామూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా, పామూరు మండలానికి చెందిన ఒక చిన్న పట్టణం.

పట్టణం
నిర్దేశాంకాలు: 15°05′40″N 79°24′50″E / 15.0944°N 79.4138°E / 15.0944; 79.4138Coordinates: 15°05′40″N 79°24′50″E / 15.0944°N 79.4138°E / 15.0944; 79.4138
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంపామూరు మండలం
విస్తీర్ణం
 • మొత్తం16.15 కి.మీ2 (6.24 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం20,000
 • సాంద్రత1,200/కి.మీ2 (3,200/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి934
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 8490 Edit this on Wikidata )
పిన్(PIN)523108 Edit this on Wikidata
జాలస్థలిEdit this at Wikidata

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 20,000.[2] ఇందులో పురుషుల సంఖ్య 10,340, మహిళల సంఖ్య 9,660.

గ్రామ చరిత్రసవరించు

పామూరు పూర్వనామం సర్పపురి.

గ్రామ భౌగోళికంసవరించు

  పామూరు పట్టణం ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 105 కి.మీ. దూరంలో, నెల్లూరుకు 125 కి.మీ దూరంలో ఉంది.

సమీప పట్టణాలుసవరించు

కనిగిరి 37 కి.మీ, కందుకూరు 60 కి.మీ, ఉదయగిరి 38 కి.మీ, చంద్రశేఖర పురం 17 కి.మీ, వరికుంటపాడు 10 కి.మీ, సీతారామపురం 50 కి.మీ,

సమీప పుణ్యక్షేత్రాలుసవరించు

నర్రవాడ వెంగమాంబ క్షేత్రం 20 కి.మీ, శ్రీ దుర్గ భైరవేశ్వర స్వామి దేవస్థానము, భైరవకోన 40 కి.మీ, మిట్టపాలెం నారాయణస్వామి క్షేత్రం 15 కి.మీ

సమీప గ్రామాలుసవరించు

తూర్పుకోడిగుడ్లపాడు 4 కి.మీ, దూబగుంట 5 కి.మీ, చింతలపాలెం 4 కి.మీ, బుక్కాపురం 5 కి.మీ, ఇనిమెర్ల 5 కి.మీ, వగ్గంపల్లి 8 కి.మీ,

సమీప మండలాలుసవరించు

దక్షణాన వరికుంటపాడు మండలం, పశ్చిమాన చంద్రశేఖరపురం మండలం, దక్షణాన ఉదయగిరి మండలం, దక్షణాన దుత్తలూరు మండలం. కనిగిరి 37 కి.మీ, చంద్రశేఖరపురం 16.6 కి.మీ, పెద చెర్లోపల్లి 27.4 కి.మీ, వెలిగండ్ల 29.4 కి.మీ

గ్రామంలో రవాణా సౌకర్యాలుసవరించు

పామూరు నుండి రాష్ర్టంలోని ప్రధాన నగరాలైనటువంటి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, కడప, హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, చెన్నై, బెంగళూరు మొదలగు ప్రాంతాలకు ఆర్.టి.సి బస్సులతో పాటు ప్రైవేటు బస్సుల సౌకర్యం ఉంది. పామూరుకు సమీపంలో కనిగిరి, కందుకూరు, ఉదయగిరి ఆర్.టి.సి.డిపోలు ఉన్నాయి.పామురు నుండి 75 కి.మీ దూరంలో సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఉంది.అలాగే నూతనంగా నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గము పామూరు మీదుగా ఏర్పాటు కాబోతున్నది.పామూరు (పట్టణo) నకిరేకల్-మాచెర్ల-తిరుపతి జాతీయ రహదారి (NH-565) మీద ఉంది.

విద్యా సౌకర్యాలుసవరించు

పామూరులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలతో పాటు అనేక ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ఐ.టి.ఐ, డిగ్రీ కళాశాలలు, డి.ఎడ్,, బి.ఎడ్ కళాశాలలు ఉన్నాయి.

వైద్య సౌకర్యాలుసవరించు

మౌలిక వసతులుసవరించు

పామూరులో ప్రజల సౌకర్యార్థం, ఆర్థిక లావాదేవీలు నెరుపుటకు వివిధ రకాల బ్యాంకులు ఉన్నాయి. అవి: 1.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2.ఆంధ్రా బ్యాంక్, 3.సిండికేట్ బ్యాంక్, 4.ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, 5.పి.డి.సి.సి.బ్యాంక్

వినోదంసవరించు

వినోదం నిమిత్తం రెండు సినిమా ధియేటర్లు ఉన్నాయి.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయాన్ని జనమేజయ మహారాజు సర్పయాగం చేసి కట్టించాడని ప్రతీతి. ఎవరికైనా పాము కుడితే వారిని ఈ ఆలయములో నిద్ర చేయిస్తే వారికి విషము విరుగుడౌతుందని స్థానికుల నమ్మకం.

శ్రీ రామాలయంసవరించు

ఈ ఆలయం పామూరు పట్టణంలోని ఆంకాళమ్మ వీధిలో ఉంది.

గ్రామ విశేషాలుసవరించు

అనుమకొండలో శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి. ఇక్కడ నుండి నారాయణస్వామి దగ్గరకు, భైరవకొనకు సొరంగమార్గము ఉంది అని ఇక్కడి స్తల పురాణాల ద్వారా తెలుస్తుంది.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-04-16. Retrieved 2014-05-11.

వెలుపలి లంకెలుసవరించు

[1] ఈనాడు ప్రకాశం; 2017, మార్చి-29; 14వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=పామూరు&oldid=3066312" నుండి వెలికితీశారు