పాయకరావుపేట

ఆంధ్రప్రదేశ్, అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట మండల జనగణన పట్టణం

పాయకరావుపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనకాపల్లి జిల్లా, పాయకరావుపేట మండలానికి చెందిన పట్టణం. పాయకరావుపేట, తుని జంట నగరాలు. వీటిని విడదీస్తూ మధ్యలో తాండవనది ఉంది. 2011 వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి అంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి ఏసి లైబ్రరిని ఇక్కడే ప్రారంభించారు. పాయకరావుపేట మండల పరిపాలనా కేంద్రం. పంచాయతీ సర్పంచ్ గారా ఉషశ్రీ ప్రసాద్.

పాయకరావుపేట
పాయకరావుపేట పట్టణం
పాయకరావుపేట పట్టణం
Nickname: 
Gate Way of అనకాపల్లి
Coordinates: 17°21′46″N 82°33′26″E / 17.362656°N 82.557194°E / 17.362656; 82.557194
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లా[Anakapalli Jilla ]
Population
 (2021)
 • Total1,82,878
భాషలు
 • అధికారకతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
531126
వాహన నమోదు కోడ్AP31 (Former)
AP39 (from 30 January 2019)[1]

విశేషాలు మార్చు

ప్రఖ్యాత ఘట వాయిద్యుడు కోలంక వెంకటరాజు ఈ ఊళ్ళోనే ఉండేవారు. ద్వారం వేంకటస్వామినాయుడు కచేరీ చేసినప్పుడు వెంకటరాజు తరచూ అండగా ఘటం వాయించేవారు.

గణాంకాలు మార్చు

2021 భారత జనాభా లెక్కలు ప్రకారం పాయకరావుపేట టౌన్ జనాభా మొత్తం 1,82,878 ఇందులో 100,582 మంది పురుషులు, 82,296 మంది మహిళలు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 286,40 ఇది మొత్తం జనాభాలో 10.61%గా ఉంది.పట్టణంలో స్త్రీల లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు 993 కు వ్యతిరేకంగా 1038 గా ఉంది. బాలల లైంగిక నిష్పత్తి 978, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939 తో పోలిస్తే ఎక్కువుగా ఉంది. అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కన్నా 76.81% ఎక్కువ.పురుషుల అక్షరాస్యత 82.01% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 71.82%. పాయకరావుపేట టౌన్ పరిధిలో మొత్తం 9,689 ఇళ్లకు పైగా పరిపాలనను కలిగి ఉంది, దీనికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను స్థానిక స్వపరిపాలనా సంస్థ సరఫరా చేస్తుంది. సెన్సస్ టౌన్ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి స్థానిక స్వపరిపాలనా సంస్థ అధికారం ఉంది.[2]

రవాణా మార్చు

పాయకరావుపేట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ స్టేషన్ నుండి ప్రముఖ నగరాలకు బస్సు సేవలు ఉన్నాయి. అంతే కాకుండా తుని, పాయకరావుపేట కలిసి ఉండటం వల్ల తుని నగరానికి చేరుకున్నా సరిపోతుంది. రాష్ట్రంలోని అనేక నగరాల నుండి ఈ నగరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడు రవాణా సంస్థ బస్సు సేవలు ఉన్నాయి. రైలు మార్గం ద్వారా ఇక్కడకి చేరాలనుకునే తుని నగరం ద్వారా ఇక్కడకి చేరుకోవచ్చు.

విద్యా సంస్థలు మార్చు

  • శ్రీ ప్రకాష్ విద్యా నికేతన్
  • శ్రీ ప్రకాష్ జూనియర్ కళాశాల
  • నారాయణ జూనియర్ కళాశాల
  • కనోస్సా స్కూల్
  • సిద్ధార్థ స్కూల్
  • శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్
  • గౌతమ్ మోడల్ స్కూల్
  • శ్రీ ప్రకాష్ డిగ్రీ కళాశాల
  • సమయమంతులరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల
  • గవ్నమెంట్ ఐ.టి.ఐ
  • శ్రీ ప్రకాష్ పీజీ కళాశాల
  • మన్నా పబ్లిక్ స్కూల్
  • సన్ ఫ్లవర్ స్కూల్

మూలాలు మార్చు

  1. "New 'AP 39' code to register vehicles in Andhra Pradesh launched". The New Indian Express. Vijayawada. 31 January 2019. Archived from the original on 28 జూలై 2019. Retrieved 9 June 2019.
  2. "Payakaraopeta Census Town City Population Census 2011-2021 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-05-07.

వెలుపలి లంకెలు మార్చు