పాయల్ శంకర్
పాయల్ శంకర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో ఆదిలాబాదు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]
పాయల్ శంకర్ | |||
పదవీ కాలం 2023 డిసెంబర్ 03 - ప్రస్తుతం | |||
ముందు | జోగు రామన్న | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఆదిలాబాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1971 అదా గ్రామం, జైనథ్ మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | పాయల్ అడెల్లు | ||
జీవిత భాగస్వామి | ఉమా | ||
సంతానం | శరత్[1] | ||
నివాసం | H. NO 1-2-69/17, డిగ్రీ కాలేజ్ దగ్గర, రవీంద్రనగర్, ఆదిలాబాద్ |
రాజకీయ జీవితం
మార్చుపాయల శంకర్ తెలుగుదేశం పార్టీ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 2011 ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన పాయల శంకర్ వరుసగా రెండు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన జోగు రామన్న చేతిలో ఓడిపోయాడు. మూడుసార్లు తనను ఓడించిన జోగు రామన్నపై 6147 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌గా చేయడం, ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ నిరాకరించి, డిసెంబర్ 14న గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై అనంతరం ఆయన శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడుశాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.[3]
పాయల శంకర్‌ని 2024 జనవరి 08న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ పార్టీ నియమించింది.[4] ఆయనను ఫిబ్రవరి 14న బీజేపీ శాసనసభపక్ష ఉపనేతగా నియమించింది.[5]
మూలాలు
మార్చు- ↑ Eenadu (15 November 2023). "అనుభవం.. అనుబంధం అడుగులుగా". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
- ↑ Eenadu (4 December 2023). "నాలుగోసారికి వరించిన విజయం". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
- ↑ NTV Telugu (14 December 2023). "ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం." Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
- ↑ Andhrajyothy (9 January 2024). "17 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఇన్‌చార్జిలు". Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
- ↑ Andhrajyothy (14 February 2024). "బీజేపీఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.