తెలంగాణ శాసనసభ

భారతదేశ రాష్ట్ర శాసనసభ

తెలంగాణ రాష్ట్ర శాసన సభ రెండు సభలు కలిగిన రాష్ట్రాల శాసన వ్యవస్థలో దిగువ సభ. ఈ సభ ప్రస్తుతం 119 శాసన సభ్యులతో ఉంది.[1]

తెలంగాణ శాసనసభ
3వ తెలంగాణ శాసనసభ
రకం
రకం
తెలంగాణ శాసనసభ ద్విసభ శాసనసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
చరిత్ర
స్థాపితం2 జూన్ 2014
(10 సంవత్సరాల క్రితం)
 (2014-06-02)
అంతకు ముందువారుతెలంగాణ శాసనసభ
నాయకత్వం
సీ.పీ. రాధాకృష్ణన్
(అదనపు చార్జి)
2024 మార్చి 20 నుండి
శాసనమండలి కార్యదర్శి
వి.నరసింహా చార్యులు
2017 సెప్టెంబరు 1 నుండి
గడ్డం ప్రసాద్ కుమార్, INC
2023 డిసెంబరు 14 నుండి
డిప్యూటీ స్పీకర్
ఖాళీ
2023 డిసెంబరు 3 నుండి
సభా నాయకుడు
(ముఖ్యమంత్రి)
రేవంత్ రెడ్డి, INC
2023 డిసెంబరు 7 నుండి
మల్లు భట్టివిక్రమార్క, INC
2023 డిసెంబరు 7 నుండి
కె. చంద్రశేఖర్ రావు, BRS
2023 డిసెంబరు 9 నుండి
నిర్మాణం
సీట్లు119
రాజకీయ వర్గాలు
ప్రభుత్వం (69)
     INDIA (69)
  •      INC (68)
  •      CPI (1)

అధికారిక ప్రతిపక్షం (34)

     BRS (34)

పార్లమెంటరీ ప్రతిపక్షం (15)

     BJP (8)
     AIMIM (7)

ఖాళీ (1)

  Vacant (1)
కాలపరిమితి
2023 – 2028
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ ఓటింగ్
మొదటి ఎన్నికలు
2014 ఏప్రిల్ 30
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2023 నవంబరు 30
తదుపరి ఎన్నికలు
2028
సమావేశ స్థలం
అసెంబ్లీ భవనం, హైదరాబాద్, తెలంగాణ

విధానసభ సభ్యులు నేరుగా వయోజన ఓటు హక్కు ఉన్న ప్రజలచే ఎన్నుకోబడతారు. ప్రతి నియోజకవర్గం నుండి ఒక అసెంబ్లీ సభ్యుడును, పోటీ చేసిన అభ్యర్థులలోకెల్ల ఎక్కువ ఓట్లను పొందిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటింపబడును. సభ్యుడిని "శాసనసభ సభ్యుడు" అని పిలుస్తారు. ఎన్నికలను భారతదేశ ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.

సభ్యుల పదవికాలం ఐదేళ్లు ఉంటుంది. సభ్యుడు మరణించనపుడు, రాజీనామా లేదా అనర్హత విషయాలు జరిగినప్పుడు ఉపఎన్నిక నిర్వహించి, సభ్యుడిని ఎన్నిక చేస్తారు. ఈ ఎన్నికలలో అధిక స్థానాలను పొందిన పార్టీ అధికార పార్టీ అవుతుంది .ఈ ఎన్నికలను గరిష్ఠంగా అరు నెలల కాలవ్యవది లోపు జరపాలి అని జాతీయ ఎన్నికల కమిషన్ లో పొందుపరిచారు

2014 జూన్‌లో తెలంగాణ ప్రత్వేక రాష్ట్ర ఏర్పడి, 119 శాసనసభ స్థానాలతో తెలంగాణ శాసనసభ ఉనికిలోకి వచ్చింది.2023 వరకు ఆంగ్లో-ఇండియా సంఘం నుండి ఒక నామినేట్ సభ్యుడు ఉన్నారు.

సమావేశాలు

మార్చు

సాధారణంగా శాసనసభ ఏడాదిలో మూడుసార్లు సమావేశమవుతాయి. బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల, శీతాకాల సమావేశాలు జరుగుతుంటాయి. ఈ సమావేశాలు ఎన్ని రోజులు జరగాలనేది స్పీకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్ (బీఏసీ) తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. బీఏసీ ప్రతిపాదనల మేరకు సభ ఎన్ని రోజులు జరుగుతుందనేది విషయంపై స్పీకర్ కార్యాలయం ప్రకటన చేస్తుంది.

ఎన్నికల ప్రక్రియ

మార్చు

ఏదేని పరిస్థితులలో శాసనసభ త్వరగా రద్దు కాకపోతే, మొదటి సమావేశానికి నియమించబడిన తేదీ నుండి శాసనసభ కాలవ్యవధి ఐదు సంవత్సరాలు ఉంటుంది. శాసనసభ ప్రధాన విధులు చట్టాన్ని రూపొందించడం, పరిపాలనను పర్యవేక్షించడం, బడ్జెట్‌ను ఆమోదించడం, ప్రజా ఫిర్యాదులను ప్రసారం చేయడం.

ప్రజలు ఎన్నుకున్న శాసనసభలో ప్రస్తుతం 119 మంది శాసనసభ్యులు ఉన్నారు. రాష్ట్రం దాదాపు సమాన జనాభాతో 119 నియోజకవర్గాలుగా విభజించబడింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ క్రింది కారణాలతో ఎన్నికలు ముందుగా జరగటానికి కూడా అవకాశాలు ఉన్నాయి.

  • రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాన్ని పరిపాలించడంలో వైఫల్యం
  • ఒక నెల కంటే ఎక్కువ కాలం హౌస్‌లో మెజారిటీ మద్దతును ఎవరూ పొందలేకపోవడం
  • హౌస్ రద్దు చేస్తూ మంత్రివర్గం తీసుకున్న అనూహ్య నిర్ణయం

ప్రిసైడింగ్ అధికారులు

మార్చు
హోదా పేరు
గవర్నర్ సి. పి. రాధాకృష్ణన్
(అదనపు ఛార్జీ)
(బిజెపి)
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
(INC)
డిప్యూటీ స్పీకర్ ఖాళీ
సభా నాయకుడు
(ముఖ్యమంత్రి)
ఎనుముల రేవంత్ రెడ్డి
(INC)
సభ ఉప నాయకుడు
(ఉపముఖ్యమంత్రి)
మల్లు భట్టివిక్రమార్క
(INC)
ప్రతిపక్ష నాయకుడు కె. చంద్రశేఖర్ రావు
(BRS)

పార్టీల వారిగా సభ్యులు

మార్చు
2024 ఏప్రిల్ నాటికి
పార్టీ సభ్యులు
Indian National Congress 68
Bharat Rashtra Samithi 34
Bharatiya Janata Party 8
All India Majlis-e-Ittehadul Muslimeen 7
Communist Party of India 1
ఖాళీ 1
మొత్తం సభ్యులు 119

3వ శాసనసభ సభ్యులు

మార్చు

మూలం:[2][3][4]

జిల్లా లేదు. నియోజక వర్గం పేరు పార్టీ వ్యాఖ్యలు
కుమురం భీమ్ 1 సిర్పూర్ పాల్వాయి హరీశ్ బాబు బీజేపీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్
మంచిర్యాల 2 చెన్నూర్ (ఎస్.సి) జి. వివేకానంద్ కాంగ్రెస్
3 బెల్లంపల్లి (ఎస్.సి) జి.వినోద్ కాంగ్రెస్
4 మంచిర్యాల కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్
కుమురం భీమ్ 5 ఆసిఫాబాదు (ఎస్.టి) కోవ లక్ష్మీ బీఆర్ఎస్
నిర్మల్ 6 ఖానాపూర్ (ఎస్.టి) వెడ్మ బొజ్జు కాంగ్రెస్
అదిలాబాదు 7 ఆదిలాబాదు పాయల్ శంకర్ బీజేపీ
8 బోథ్ (ఎస్.టి) అనిల్ జాదవ్ బీఆర్ఎస్
నిర్మల్ 9 నిర్మల్ అల్లెటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ బీజేపీ ఫ్లోర్ లీడర్
10 ముధోల్ పవార్ రామారావు పటేల్ బీజేపీ
నిజామాబాదు 11 ఆర్మూరు పైడి రాకేష్ రెడ్డి బీజేపీ
12 బోధన్ పి.సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్
కామారెడ్డి 13 జుక్కల్ (ఎస్.సి) తోట లక్ష్మీకాంత రావు కాంగ్రెస్
నిజామాబాదు 14 బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్
కామారెడ్డి 15 ఎల్లారెడ్డి కె. మదన్ మోహన్ రావు కాంగ్రెస్
16 కామారెడ్డి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి బీజేపీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్
నిజామాబాదు 17 నిజామాబాద్ అర్బన్ ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ
18 నిజామాబాద్ రూరల్ రేకులపల్లి భూపతి రెడ్డి కాంగ్రెస్
19 బాల్కొండ వేముల ప్ర‌శాంత్ రెడ్డి బీఆర్ఎస్
జగిత్యాల 20 కోరుట్ల కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్
21 జగిత్యాల ఎం. సంజయ్ కుమార్ బీఆర్ఎస్
22 ధర్మపురి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్
పెద్దపల్లి 23 రామగుండం మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్
24 మంథని దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కాంగ్రెస్
25 పెద్దపల్లి చింతకుంట విజయ రమణారావు కాంగ్రెస్
కరీంనగర్ 26 కరీంనగర్ గంగుల కమలాకర్ బీఆర్ఎస్
27 చొప్పదండి (ఎస్.సి) మేడిపల్లి సత్యం కాంగ్రెస్
రాజన్న సిరిసిల్ల 28 వేములవాడ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్
29 సిరిసిల్ల కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్
కరీంనగర్ 30 మానుకొండూరు (ఎస్.సి) కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్
31 హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్
సిద్దిపేట 32 హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్
33 సిద్దిపేట తన్నీరు హరీశ్ రావు బీఆర్ఎస్
మెదక్ 34 మెదక్ మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్
సంగారెడ్డి 35 నారాయణ్‌ఖేడ్ పట్లోళ్ల సంజీవ రెడ్డి కాంగ్రెస్
36 ఆందోల్ (ఎస్.సి) సి. దామోదర రాజనరసింహ కాంగ్రెస్
మెదక్ 37 నర్సాపూర్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్
సంగారెడ్డి 38 జహీరాబాద్ (ఎస్.సి) కొనింటి మాణిక్ రావు బీఆర్ఎస్
39 సంగారెడ్డి చింతా ప్రభాకర్ బీఆర్ఎస్
40 పటాన్‌చెరు గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్
సిద్దిపేట 41 దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్
42 గజ్వేల్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్
మేడ్చల్ మల్కాజిగిరి 43 మేడ్చల్ సి.హెచ్. మల్లారెడ్డి బీఆర్ఎస్
44 మల్కాజిగిరి మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్
45 కుత్బుల్లాపూర్ కె.పి. వివేకానంద గౌడ్ బీఆర్ఎస్
46 కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్
47 ఉప్పల్ బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్
రంగారెడ్డి 48 ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్
49 లాల్ బహదూర్ నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీఆర్ఎస్
50 మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్
51 రాజేంద్రనగర్ టి. ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్
52 శేరిలింగంపల్లి అరెకపూడి గాంధీ బీఆర్ఎస్
53 చేవెళ్ళ (ఎస్.సి) కాలే యాదయ్య బీఆర్ఎస్
వికారాబాదు 54 పరిగి టి. రామ్ మోహన్ రెడ్డి కాంగ్రెస్
55 వికారాబాదు (ఎస్.సి) గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్
56 తాండూరు బి. మనోహర్ రెడ్డి కాంగ్రెస్
హైదరాబాదు 57 ముషీరాబాద్ ముటా గోపాల్ బీఆర్ఎస్
58 మలక్‌పేట్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ఎంఐఎం
59 అంబర్‌పేట్ కాలేరు వెంకటేష్ బీఆర్ఎస్
60 ఖైరతాబాదు దానం నాగేందర్ బీఆర్ఎస్
61 జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్
62 సనత్‌నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్
63 నాంపల్లి మహమ్మద్ మాజిద్ హుస్సేన్ ఎంఐఎం
64 కార్వాన్ కౌసర్ మొయిజుద్దిన్ ఎంఐఎం
65 గోషామహల్ టి. రాజాసింగ్ లోథ్ బీజేపీ
66 చార్మినార్ మీర్ జులిఫికర్ అలీ ఎంఐఎం
67 చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఒవైసీ ఎంఐఎం
68 యాకుత్‌పురా జాఫర్ హుస్సేన్ ఎంఐఎం
69 బహదూర్‌పూరా మహ్మద్ ముబీన్ ఎంఐఎం
70 సికింద్రాబాద్ టి. పద్మారావు గౌడ్ బీఆర్ఎస్
71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్.సి) జి. లాస్య నందిత బీఆర్ఎస్
వికారాబాదు 72 కొడంగల్ ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తెలంగాణ ముఖ్యమంత్రి
నారాయణపేట 73 నారాయణపేట చిట్టెం పరిణికారెడ్డి కాంగ్రెస్
మహబూబ్‌నగర్ 74 మహబూబ్‌నగర్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్
75 జడ్చర్ల జనంపల్లి అనిరుధ్ రెడ్డి కాంగ్రెస్
76 దేవరకద్ర గవినోళ్ల మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్
నారాయణపేట 77 మక్తల్ వాకిటి శ్రీహరి కాంగ్రెస్
వనపర్తి 78 వనపర్తి తుడి మేఘారెడ్డి కాంగ్రెస్
జోగులాంబ గద్వాల్ 79 గద్వాల్ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్
80 అలంపూర్ (ఎస్.సి) కోడెదూడల విజయుడు బీఆర్ఎస్
నాగర్‌కర్నూల్ 81 నాగర్‌కర్నూల్ కుచ్కుళ్ల రాజేష్ రెడ్డి కాంగ్రెస్
82 అచ్చంపేట (ఎస్.సి) చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్
రంగారెడ్డి 83 కల్వకుర్తి కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్
84 షాద్‌నగర్ కె. శంకరయ్య కాంగ్రెస్
నాగర్‌కర్నూల్ 85 కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్
నల్గొండ 86 దేవరకొండ (ఎస్.టి) నేనావత్ బాలు నాయక్ కాంగ్రెస్
87 నాగార్జునసాగర్ కుందూరు జయవీర్ రెడ్డి కాంగ్రెస్
88 మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్
సూర్యాపేట 89 హుజూర్‌నగర్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్
90 కోదాడ నలమాద పద్మావతిరెడ్డి కాంగ్రెస్
91 సూర్యాపేట గుంటకండ్ల జగదీష్‌రెడ్డి బీఆర్ఎస్
నల్గొండ 92 నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రి
93 మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్
యాదాద్రి 94 భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్
నల్గొండ 95 నకిరేకల్ (ఎస్.సి) వేముల వీరేశం కాంగ్రెస్
సూర్యాపేట 96 తుంగతుర్తి (ఎస్.సి) మందుల శామ్యూల్ కాంగ్రెస్
యాదాద్రి 97 ఆలేరు బీర్ల ఐలయ్య కాంగ్రెస్
జనగాం 98 జనగాం పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్
99 ఘన్‌పూర్ స్టేషన్ (ఎస్.సి) కడియం శ్రీహరి బీఆర్ఎస్
100 పాలకుర్తి మామిడాల యశస్విని రెడ్డి కాంగ్రెస్
మహబూబాబాదు 101 డోర్నకల్ (ఎస్.టి) జాతోత్ రామ్ చందర్ నాయక్ కాంగ్రెస్
102 మహబూబాబాద్ (ఎస్.టి) మురళీ నాయక్ భూక్యా కాంగ్రెస్
వరంగల్ 103 నర్సంపేట దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్
104 పరకాల రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్
105 వరంగల్ వెస్ట్ నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్
106 తూర్పు వరంగల్ కొండా సురేఖ కాంగ్రెస్
107 వర్ధన్నపేట (ఎస్.సి) కె. ఆర్. నాగరాజ్ కాంగ్రెస్
జయశంకర్ భూపాలపల్లి 108 భూపాలపల్లె గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్
ములుగు 109 ములుగు (ఎస్.టి) ధనసరి అనసూయ (సీతక్క) కాంగ్రెస్
భద్రాద్రి కొత్తగూడెం 110 పినపాక (ఎస్.టి) పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్
111 ఇల్లందు (ఎస్.టి) కోరం కనకయ్య కాంగ్రెస్
ఖమ్మం 112 ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్
113 పాలేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్
114 మథిర (ఎస్.సి) మల్లు భట్టివిక్రమార్క కాంగ్రెస్
115 వైరా (ఎస్.టి) మాలోత్ రాందాస్ కాంగ్రెస్
116 సత్తుపల్లి (ఎస్.సి) మట్టా రాగమయి కాంగ్రెస్
భద్రాద్రి కొత్తగూడెం 117 కొత్తగూడెం కూనంనేని సాంబశివరావు సీపీఐ
118 అశ్వారావుపేట (ఎస్.టి) జారే ఆదినారాయణ కాంగ్రెస్
119 భద్రాచలం (ఎస్.టి) తెల్లం వెంకటరావు బీఆర్ఎస్

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. జనంసాక్షి. "తొలి తెలంగాణ శాసనసభ కొలువుదీరింది". Archived from the original on 9 July 2017. Retrieved 9 March 2017.
  2. "Telangana Election Results 2023: Full list of winners". 4 Dec 2023. Retrieved 6 December 2023.
  3. 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.

వెలుపలి లంకెలు

మార్చు