పావని పరమేశ్వరరావు

భారతీయ న్యాయవాది

పావని పరమేశ్వరరావు (జూలై 1 1933 - సెప్టెంబర్ 13 2017) రాజ్యాంగ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, పద్మభూషణ్‌ పురస్కార గ్రహీత.

పావని పరమేశ్వరరావు
జననంపావని పరమేశ్వరరావు
జూలై 1 1933
India మొగిలిచెర్ల, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణంసెప్టెంబర్ 13, 2017
నివాస ప్రాంతంమొగిలిచెర్ల, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్
వృత్తిన్యాయవాది

బాల్యం - విద్యాభ్యాసం

మార్చు

పావని పరమేశ్వరరావు జూలై 1, 1933ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం మొగిలిచెర్ల గ్రామంలో జన్మించాడు. నెల్లూరులోని వీఆర్‌ కాలేజీలో బీఏ పూర్తి చేసి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌ఎం పట్టాను పొందాడు.[1]

జీవిత విశేషాలు

మార్చు

1961లో ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయశాస్త్ర అధ్యాపకుడిగా చేశారు. 1967 నుంచి సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 1976లో సీనియర్‌ న్యాయవాదిగా, 1991లో సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. కేశవానంద భారతి, ఎస్‌ఆర్‌ బొమ్మై, పీవీ నరసింహారావు, బాబ్రీ మసీదు కూల్చివేత, బెస్ట్‌ బేకరీ వంటి కీలక కేసుల్లో వాదించారు. న్యాయ రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2006లో పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది.

ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు.

మూలాలు

మార్చు
  1. పావని పరమేశ్వరరావు. "రాజ్యాంగ నిపుణుడు పీపీ రావు కన్నుమూత". ఆంధ్రజ్యోతి. Archived from the original on 16 సెప్టెంబరు 2017. Retrieved 15 September 2017.