పినాకి మిశ్రా (1959 అక్టోబరు 23) ఒడిశా రాష్ట్రానికి చెందిన బిజు జనతాదళ్ పార్టీకి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. పినాకీ మిశ్రా పూరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి లోక్సభకు ఎన్నికయ్యాడు.[1] 1996లో పినాకీ మిశ్రా పూరి పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి అప్పటి పూరి ఎంపీ, కేంద్ర మంత్రి అయిన బ్రజ కిషోర్ త్రిపాఠి ని ఓడించారు.[2] 2019 సార్వత్రిక ఎన్నికలలో, పినాకి మిశ్రా పూరి నియోజకవర్గం నుండి పోటీచేసి బిజెపి అభ్యర్థి ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ను ఓడించారు. పినాకీ మిశ్రా భారత సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ గా ఉన్నారు‌. భారతదేశంలోని దాదాపు అన్ని హైకోర్టులు భారతదేశంలోని ప్రధాన ట్రిబ్యునళ్లలో కేసులను వాదించారు.[3]

పినాకీ మిశ్రా
పార్లమెంట్ సభ్యుడు లోక్ సభ
Assumed office
2009 మే 16
అంతకు ముందు వారుకిషోర్ త్రిపాఠీ
నియోజకవర్గంపూరీ లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1959-10-23) 1959 అక్టోబరు 23 (వయసు 64)
పూరీ, ఒడిశా, భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీబిజు జనతాదళ్
ఇతర రాజకీయ
పదవులు
భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిసంగీత మిశ్రా
వృత్తిరాజకీయ నాయకుడు
నైపుణ్యంన్యాయవాది

విద్య.

మార్చు

పినాకీ మిశ్రా ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి బి. ఎ. (చరిత్ర) ఎల్ఎల్.ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బి. ఎ. పట్టా పొందాడు.పినాకీ మిశ్రా సంగీత మిశ్రాను వివాహం చేసుకున్నాడు, ఈ దంపతులకు ఒక కూతురు ఒక కొడుకు సంతానం .[4]

రాజకీయ జీవితం

మార్చు

.[5]

పదవీకాలం. నిర్వహించిన స్థానం
1996 11వ లోక్సభకు ఎన్నిక
1996–97 విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు
2009 15వ లోక్సభకు తిరిగి ఎన్నిక (2వ సారి)
31 ఆగస్టు 2009-2011 విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు
23 సెప్టెంబర్ 2009 సభ్యుడు, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ
2009-మే 2014 స్టాండిగ్ కమిటీ సభ్యుడు
2009-మే 2014 సంప్రదింపుల కమిటి న్యాయ కమిటీ సభ్యుడు
2011-మే 2014 ఫిర్యాదుల కమిటీ సభ్యుడు
మే 2014 16వ లోక్సభకు తిరిగి ఎన్నిక (3వ సారి)
1 సెప్టెంబర్ 2014-25 మే 2019 పట్టణ అభివృద్ధి స్టాండింగ్ కమిటీ ఛైర్పర్సన్

సభ్యుడు, సంప్రదింపుల కమిటీ, రక్షణ మంత్రిత్వ శాఖ

29 జనవరి 2015-25 మే 2019 సభ్యుడు, సాధారణ ప్రయోజనాల కమిటీ
2019 మే 17వ లోక్సభకు తిరిగి ఎన్నిక (4వ సారి)
20 జూన్ 2019 నుండి సభ్యుడు, వ్యాపార సలహా కమిటీ
13 సెప్టెంబర్ 2019 నుండి సభ్యుడు, ఆర్థిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ
9 అక్టోబర్ 2019 నుండి సభ్యుడు, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ
15 అక్టోబర్ 2019 నుండి లోక్సభలో బిజు జనతాదళ్ శాసనసభాపక్ష నేత
21 నవంబర్ 2019 నుండి ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ సభ్యుడు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Profile of Members". Government of India. Archived from the original on 4 December 2011. Retrieved 12 March 2012.
  2. Mishra, Bibhuti. "I am disgusted with politics". Sify. Archived from the original on 27 January 2015. Retrieved 27 January 2015.
  3. "Pinaki Mishra: Age, Biography, Education, Wife, Caste, Net Worth & More - Oneindia". www.oneindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-05-06.
  4. "Pinaki Misra Biography". www.oneindia.com.
  5. "Members : Lok Sabha".