పిలు అనేది హింది పేరు. ఈ చెట్టును తెలుగులో జలచెట్టు, వరగొగు అని ఆంటారు. ఈచెట్టు సాల్వడారేసి కుటుంబానికి చెందినది. ఈ చెట్టులో రెండు రకాలున్నాయి. ఒకటి సాల్వడొర ఒలియొడెస్ (salvadora oleoides dene) ; మరియొకటి సాల్వడొర పెర్సిక లిన్నే (salvadora persica Linn) ; దీన్ని టూత్‍బ్రస్ చెట్టు (tooth brush tree) అని కూడా అంటారు. పిలు/గున్నంగి/జలచెట్టు యొక్క ఆకులను, పళ్ళను, విత్తనాలను, చెట్టు బెరడును,, వేరును ఆయూర్వేద మందుల తయారిలో వాడెదరు.[1]

గున్నంగి చెట్టు
పిలు/జలచెట్టు

ఇతర భాషల్లో ఈ చెట్టు పేరు[2][3]

మార్చు

ఉనికి

మార్చు

ఇండియా : పంజాబు, ఉత్తరభారతంలో పొడి ఇసుక నేలల్లో (sandy areas) పెరుగును. చవిటి భూముల్లో కుడా పెరుగును, కాని పెరుగుదల సరిగా వుండక చెట్లు గిడసబారి పోతాయి. ముఖ్యంగా గుజరాత్, రాజస్తాన్, హర్యానా తీరప్రాంతంలో, మధ్య, ఉత్తరభారతంలోని నదీలోయ ప్రాంతాలలో పెరుగును.[2]

విదేశాలు : అరేబియన్ దీపకల్పము (Arabian peninsula) ఆఫ్రికా, పశ్చిమఆసియా, పాకిస్తాన్,, శ్రీలంక ఆసియా దేశాలు.[4]

సాగుకు అనువైన రాష్ట్రాలు

మార్చు

గుజరాత్, పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలు.

Salvadora oleoides చెట్టు విత్తనాలు చిన్నవిగా, గట్టిగా, చేదుగా వుండటం వలన పైపొట్టును డికార్టికెటరు యంత్రాల ద్వారా తొలగించడం కష్టమైన పని. salvadora persica చెట్టువిత్తనాలనే నూనె తీయుట కు, మిల్చ్ పశువులకు ఎక్కువ పాలు ఇచ్చుటకై దాణా గాను ఉపయోగిస్తారు. పెర్సిక (persica) విత్తనాలు తియ్యగావుండి నూనె శాతాన్ని కూడా 39% వరకు కలిగివుండును. ఒలియొడెస్ (oleodes) గింజలు చేదుగా వుండును. గట్టిరకం విత్తనాలు 21% వరకు మాత్రమే నూనెను కల్గివుండును. కాయ\పండులో గింజ శాతం 44-46% వరకుండును. గింజలో ప్రొటీన్ శాతం 27% వరకుండును. S.persica గింజలను డికార్టి కేసన్ చేసిన తరువాత యంత్రాలలో క్రషింగ్ చేయుదురు. S.Oleoids గింజలను డికార్టికెసన్ చెయ్యకుండనే క్రషింగ్‍ చేయుదురు. ఏడాదికి 50 వేల టన్నుల గింజలను సేకరించి, క్రషింగ్ చేయు అవకాశం ఉంది. ఇంచు మించు ఏడాదికి 17వేల టన్నుల పిలునూనెను ఉత్పత్తిచేయు వీలున్నది.

పిలునూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాల శాతం ఎక్కువగా వుండటం వలన, సాధారణ,, శీతల ఉష్ణోగ్రత సమాయల్లో ఈనూనె గడ్డగట్టి వుండును. అందుచే దీన్ని నూనె కన్న కొవ్వు (Fat) అనటం సబబు.

పిలునూనెలో బెంజైల్ ఐసొథైసైయనెట్ (Menzyl isoythiocynate) వుండటం వల్ల ఘాటైన వాసన కల్గివుండును. రుచి కూడా వికారం పుట్తించునట్లుండును. నూనె ఆకుపచ్చఛాయ కలిగిన పసుపురంగులో వుండును. నూనెను రిఫైండ్‍ చేసినప్పుడు వెగటురుచి, ఘటైన వాసన రెండు తొలగింప బడుతాయి.

పిలుగింజల నూనె భౌతికలక్షణాల పట్టిక[5]

భౌతిక లక్షణాలు మితి
వక్రీభవన సూచిక 400Cవద్ద 1.440-1.450
ఐయోడిన్ విలువ 10-15
సపనిఫికెసను విలువ 245-255
అన్‌సఫొనిపియబుల్ పదార్థం 1.0-1.5% గరిష్ఠం
తేమశాతం 1.0% గరిష్ఠం
ద్రవీభవణ ఉష్ణోగ్రత 30-320C
polenske value, Min 10

నూనెలు (Oils) : సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఇవి ద్రవరూపంలో వుంటాయి. నూనెలలో అసంతృప్త కొవ్వు ఆమ్లాల శాతం సగంకన్న ఎక్కువ వుండును. ద్రవీభవణ ఉష్ణోగ్రత/స్దానం (Melting point) తక్కువగా వుండును.

కొవ్వులు (Fats) : ఇవికూడా నూనెలే. కాని సంతృప్త కొవ్వు ఆమ్లాలు నూనెలో సగంకన్న ఎక్కువ వుంటాయి. అందుచే వీటి ద్రవీభవణ స్దానం ఎక్కువగా వుండటంవలన సాధారణఉష్ణోగ్రత వద్ద ఇవి ఘన, అర్దఘన రూపంలో వుండును. పిలు నూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలైన లారిక్, మిరిస్టిక్,, పామిటిక్ ఆమ్లాలు అధికంగా వుండును. 10 కార్బనులున్న కాప్రిక్ సంతృప్త కొవ్వు ఆమ్లం 2.0% లేదా అంతకన్న తక్కువ వుండును. పిలు నూనె/కొవ్వులో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు 20% వరకుండును. అందులో ఒలిక్ ఆమ్లం 18.0% వరకుండగా లినొలిక్ ఆమ్లం1.0-2.0% వరకుండును.

పిలునూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం[5]

కొవ్వు ఆమ్లాలు శాతం
కాప్రిక్ ఆమ్లం (C10:0) 1.0-1.05
లారిక్ ఆమ్లం (C12.0) 19.0-47.0
మిరిస్టిక్ ఆమ్లం (C14:0) 28.0-55.0
పామిటిక్ ఆమ్లం (C16:0) 20% వరకు
ఒలిక్ ఆమ్లం (C18:1) 5.5-12.0
లినొలిక్ ఆమ్లం (C18:2) 0.0-1.3

నూనె ఉపయోగాలు[5]

మార్చు
  • సబ్బుల తయారిలో వినియోగిస్తారు.
  • కొవ్వొత్తుల తయారిలో వినియోగిస్తారు.
  • ఔషధ మందుల తయారిలో వాడెదరు.

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు/ఆధారాలు/ఉల్లేఖన

మార్చు
  1. http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3249923/
  2. 2.0 2.1 SEA Hand Book-2009 by The Solvent Extractors' Association Of India
  3. http://www.flowersofindia.net/catalog/slides/Toothbrush%20Tree.html
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-12. Retrieved 2013-10-12.
  5. 5.0 5.1 5.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-13. Retrieved 2013-10-28.
"https://te.wikipedia.org/w/index.php?title=పిలు_నూనె&oldid=4080015" నుండి వెలికితీశారు