పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం
పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం సినిమా పద్మినీ పిక్చర్స్ బ్యేనర్‌పై బి.ఆర్.పంతులు తెలుగు, కన్నడ, తమిళ భాషలలో ఒకేసారి తీసిన సినిమా. కన్నడభాషలో మక్కళరాజ్య పేరుతో, తమిళభాషలో కుళందిగళ్ కండ కుడియరసు అనే పేరుతో వెలువడింది. ఈ సినిమా 1960, జూలై 1న విడుదలయ్యింది.
పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం (1960 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఆర్.పంతులు |
---|---|
తారాగణం | బి.ఆర్.పంతులు, ఎమ్.వి.రాజమ్మ, బాలకృష్ణ, శివాజీ గణేశన్, రాజనాల, రమణారెడ్డి |
నిర్మాణ సంస్థ | పద్మిని పిక్చర్స్ |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్యం, నిర్మాత: బి.ఆర్.పంతులు
- కథ: దాదా మిరాశీ
- మాటలు: డి.వి.నరసరాజు
- సంగీతం: టి.జి.లింగప్ప
- పాటలు: సముద్రాల, కొసరాజు
- నేపథ్య గానం: పి.బి.శ్రీనివాస్, శీర్గళి గోవిందరాజన్, పి.సుశీల,జిక్కి, ఎస్.జానకి,జమునారాణి, కె.రాణి, కోమల, రాజేశ్వరి, పద్మ
- ఛాయాగ్రహణం: డబ్యూ.ఆర్.సుబ్బారావు
- కూర్పు: ఆర్.దేవరాజన్
నటీనటులు
మార్చు- శివాజీ గణేశన్
- బి.ఆర్.పంతులు
- ఎం.వి.రాజమ్మ
- రాజనాల
- రమణారెడ్డి
- వల్లూరి బాలకృష్ణ
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
- కాంచన
- ఎ.వి.సుబ్బారావు
- సుశీల
- బేబీ సుమంగళి
- బేబీ లక్ష్మి
- బేబీ విమల
- మాస్టర్ గోపి
- మాస్టర్ వెంకటేశం
కథ
మార్చుగుణసేనుడనే రాజు రాచరిక వ్యవస్థను అంతం చేసి ప్రజారాజ్యాన్ని స్థాపించాలనుకుంటాడు. ఇది నచ్చక మహామంత్రి, సేనాధిపతి తదితరులు కుట్రపన్ని రాజు ఉన్న వేదికను పేల్చేస్తారు. దాంతో మహామంత్రి ఆ రాజ్యానికి రాజవుతాడు. కానీ గుణసేనుడు ఆ ప్రమాదం నుంచి బయటపడి భార్యతో సహా పాతాళానికి చేరతాడు. ముని శాపం వల్ల రాజు మామిడి చెట్టు అయిపోతాడు. రాణి, విజయసేనుడికి జన్మనిస్తుంది. చిన్నతనం నుంచే అతను విప్లవ నాయకుడుగా ఎదుగుతాడు. ఎక్కడ అన్యాయం జరిగినా పిల్లలందర్నీ కూడగట్టుకుని ఎదిరిస్తాడు. విజయసేనుడికి యువరాణితో స్నేహం ఏర్పడుతుంది. వీరంతా కలిసి రాజుపై తిరుగుబాటు చేస్తారు. అందరిలో మార్పు తీసుకువచ్చి ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు.[1]
పాటలు
మార్చుక్ర.సం. | పాట | గాయకులు | రచన | నిడివి(ని:సె) |
---|---|---|---|---|
1 | "పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం" 1 | ఎల్.ఆర్.ఈశ్వరి ఎం.ఎస్.పద్మ |
02:10 | |
2 | "నగవు చిలుకుమా నగవు చిలుకుమా నగవు చిలుకుమా చిన్నారి రాజా" | ఎస్.జానకి | సముద్రాల | 03:31 |
3 | "ఆశల ఊయల ఊగేమా జీవితమే ఆమనిగా" | జిక్కి ఎ.పి.కోమల |
సముద్రాల | 03:01 |
4 | "అమ్మా కనజాలవా ఈ కఠిన దృశ్యము" | పి.సుశీల | సముద్రాల | 03:25 |
5 | "నిన్ను చూచి వెన్నె గాచి నిన్ను చూచి చూచి విడిచిపోదునా" | పి.బి.శ్రీనివాస్ కె.రాణి |
కొసరాజు | 02:35 |
6 | "చిట్టి చీమలు పెట్టిన పుట్టలోన (పద్యం)" | పి.బి.శ్రీనివాస్ | కొసరాజు | |
7 | "సుందర నంద కిశోరా నీ అందము చూపగ రారా" | ఎస్.జానకి ఎ.పి.కోమల |
కొసరాజు | 03:30 |
8 | పసందైన పాట ఇదే చెవికి విసుగు కననీదు | శీర్కాళి గోవిందరాజన్ | సముద్రాల సీనియర్ | |
9 | "పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం" 2 | ఎల్.ఆర్.ఈశ్వరి ఎం.ఎస్.పద్మ రాజేశ్వరీ |
02:42 |
10. జాతక బలమే బలమయ్యా , పి. బి.శ్రీనివాస్ , రచన:కొసరాజు
11.రాకు రాకు మా జోలికింక రాకు నీ, ఎ.పి.కోమల , రచన:కొసరాజు
12.వరుణా రావయ్యా ఓ వరుణా రావయ్యా కరువు , పి.సుశీల, రచన:సముద్రాల రాఘవాచార్య.
మూలాలు
మార్చు- ↑ డా.వైజయంతి (20 November 2013). "మరిచిపోలేని ప్రయత్నం...పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం". సాక్షి దినపత్రిక. Retrieved 4 August 2020.
. 2 . ఘంటసాల గళామ్రుతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు .