అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 6 మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. పునర్విభజన ఫలితంగా గతంలో ఈ నియోజకవర్గంలో ఉన్న కల్వకుర్తి మండలంలోని 14 గ్రామాలు కల్వకుర్తి నియోజకవర్గానికి తరలించగా, వంగూరు మండలం పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో కలిసింది.[1]

అచ్చంపేట
—  శాసనసభ నియోజకవర్గం  —
అచ్చంపేట is located in Telangana
అచ్చంపేట
అచ్చంపేట
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశం భారతదేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

నియోజకవర్గ పరిధిలోని మండలాలు

మార్చు

నియోజకవర్గ గణాంకాలు

మార్చు
  • 2001 లెక్కల ప్రకారం జనాభా: 2,40,118.
  • ఓటర్ల సంఖ్య (2008 ఆగస్టు నాటికి): 2,12,914.[2]
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 22.06%, 18.65%.

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు

ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం పి.రాములు శాసనసభ్యుడిగా కొనసాగుతున్నాడు.

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 కె.నాగన్న కాంగ్రెస్ పార్టీ సుంకం అచ్చాలు సి.పి.ఎం
1967 పి.మహేంద్రనాథ్ కాంగ్రెస్ పార్టీ వై.సైదయ్య సి.పి.ఎం.
1972 పి.మహేంద్రనాథ్ కాంగ్రెస్ పార్టీ పి.రాధాకృష్ణ స్వతంత్ర అభ్యర్థి
1978 ఆర్.ఎం.మనోహర్ ఇందిరా కాంగ్రెస్ పి.రాధాకృష్ణ జనతా పార్టీ
1983 పి.మహేంద్రనాథ్ తెలుగుదేశం పార్టీ డి.కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ
1985 పి.మహేంద్రనాథ్ తెలుగుదేశం పార్టీ జయంతి కాంగ్రెస్ పార్టీ
1989 డి.కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ పి.మహేంద్రనాథ్ తెలుగుదేశం
1994 పి.రాములు తెలుగుదేశం పార్టీ డి.కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ
1999 పి.రాములు తెలుగుదేశం చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ
2004 చిక్కుడు వంశీకృష్ణ[3] కాంగ్రెస్ పార్టీ పి.రాములు తెలుగుదేశం పార్టీ
2009 పి.రాములు తెలుగుదేశం పార్టీ చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ
2014 గువ్వల బాలరాజు తె.రా.స చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ
2018 గువ్వల బాలరాజు తె.రా.స చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ
2023[4] చిక్కుడు వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ గువ్వల బాలరాజు బీఆర్ఎస్

1983 ఎన్నికలు

మార్చు

1983 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్తపాగా మహేంద్రనాథ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన డి.కిరణ్ కుమార్‌పై 10,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. మహేంద్రనాథ్‌కు 36,666 ఓట్లు రాగా, కిరణ్ కుమార్‌కు 26,344 ఓట్లు లభించాయి.[5]

1999 ఎన్నికలు

మార్చు

1999 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.రాములు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సి.వంశీకృష్ణపై 12346 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. పి.రాములు 60878 ఓట్లు సాధించగా, వంశీకృష్ణ 48532 ఓట్లు పొందినాడు. మొత్తం ఐదుగురు అభ్యర్థులు పోటీచేయగా ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యనే కొనసాగింది. బరిలో ఉన్న మిగితా ముగ్గురు అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు.

2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి వంశీకృష్ణ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పోతుగంటి రాములుపై 20665 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వంశీకృష్ణకు 65712 ఓట్లు రాగా, రాములు 45047 ఓట్లు సాధించాడు.

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ శాసన సభ్యులు వంశీకృష్ణ మళ్ళీ పోటీ చేయగా, తెలుగుదేశం పార్టీ తరఫున పి.రాములు. ప్రజారాజ్యం పార్టీ నుండి పి.మునీంద్రనాథ్, లోక్‌సత్తా పార్టీ తరఫున జి.వెంకటేశ్వర్లు పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.రాములు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణపై 4800కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు.[6]

2023 ఎన్నికలు

మార్చు

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గువ్వల బాలరాజు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చిక్కుడు వంశీకృష్ణ, భాజపా అభ్యర్థి సతీశ్ మాదిగ పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై 49,326 ఓట్ల భారీ మెజారితో గెలిచాడు. వంశీకృష్ణకు 1,15,337 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుకు 66,011 ఓట్లు, భాజపా అభ్యర్థి సతీశ్ మాదిగకు 4,267 ఓట్లు పోలయ్యాయి.[7]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాల విభాగం

మార్చు
  1. Eenadu (21 November 2023). "పాలమూరు పందెం కోళ్లు". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  2. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.
  3. Eenadu (10 November 2023). "రాజకీయాల్లో కొలువుదీరారు". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  4. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  5. ఈనాడు దినపత్రిక, తేది జనవరి 7, 1983
  6. సాక్షి దినపత్రిక, తేది 17-05-2009
  7. Eenadu (7 December 2023). "అచ్చంపేటలో కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యం". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.