పి.వి.ఆర్.శివకుమార్ ప్రముఖ రచయిత.[1] 1970 ల్లో యువ, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, స్వాతి, ఆదివారం ఈనాడు లాంటి అనేక పుస్తకాలలో అనేక రచనలు చేసారు.[2] ముఖ్యంగా ఆకాశవాణి ద్వారా అనేక నాటకాలు ప్రసారం అయ్యాయి.

బాల్యం,విద్యసవరించు

1951 నవంబర్ లో జన్మించారు. తండ్రి పిన్నలి వేంకటరామ నరసింహారావు . తల్లి పిన్నలి కనక దుర్గాంబ. బాల్యమంతా విజయవాడలో గడిచింది. 

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో యస్. యమ్. వి. యమ్. పాలిటెక్నిక్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, డిప్లొమా పొందారు. ఎచ్.ఎం.టి. లో ఉద్యోగ జీవితం ప్రారంభించి, ముప్ఫై ఏళ్ల అనంతరం, ప్రైవేట్ సెక్టార్ వాక్యూమ్ టెక్నిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి మారారు. ఈయన భార్య వరలక్ష్మి, వీరికి ఇద్దరు పిల్లలు ఉదయ్,శిరీష.అల్లుడుదినేష్.కోడలు ప్రత్యూష. మనుమడు విహాన్. ప్రస్తుత నివాసం ముంబై.

రచనలుసవరించు

మొదటి రచన 14 ఏళ్ళ వయసులో రాసిన చిన్ననాటిక ఇది బాలబంధు అనే చిన్నపిల్లల పక్షపత్రికలో అచ్చయింది. అప్పటి నుండి దాదాపు రెండు వందల యాభై కథలు, తొమ్మిది నవలలు రాసారు. అనేక కథానికలు, నాటికలు హైదరాబాద్ ఆకాశవాణి ద్వారా ప్రసారమైనాయి. అన్నీ ప్రసిద్ధ పత్రికలు వీరి కథలను ప్రచురించాయి. ఆంధ్ర పత్రిక, స్వాతి, విశాలాక్షి, విశాఖ సంస్కృతి మొదలైన పత్రికలలో పదకొండు కథలకు బహుమతులు గెలుచుకున్నారు.

కథలు, కథానికలుసవరించు

  • పి.వి.ఆర్. శివకుమార్ కథానికలు సంపుటం
  • కిరణం

నాటికలు==సవరించు

సీరియల్స్సవరించు

  • జీవనపోరాటంలో ఆశల ఆరాటం
  • శమంత హేమంత

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు