హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గం

(హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

నల్గొండ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి.[1] 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం తిరిగి ఏర్పడింది. నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి.[2][3]

హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°54′0″N 79°52′12″E మార్చు
పటం

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

మార్చు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2023[4] 89 హుజూర్‌నగర్ జనరల్ నలమడ ఉత్తమకుమార్ రెడ్డి పు కాంగ్రెస్ 116707 శానంపూడి సైది రెడ్డి పు బీఆర్ఎస్ 71819
2019 ఉప ఎన్నిక హుజూర్‌నగర్ జనరల్ శానంపూడి సైది రెడ్డి పు తెరాస 1,13,095 నలమాద పద్మావతిరెడ్డి మహిళా కాంగ్రెస్ పార్టీ 69,737
2018 89 హుజూర్‌నగర్ జనరల్ నలమడ ఉత్తమకుమార్ రెడ్డి పు కాంగ్రెస్ 92996 శానంపూడి సైది రెడ్డి పు తెరాస 85530
2014 89 హుజూర్‌నగర్ జనరల్ నలమడ ఉత్తమకుమార్ రెడ్డి మగ కాంగ్రెస్ 69879 కాసోజు శంకరమ్మ ఆడా తెరాస 45955
2009 89 హుజూర్‌నగర్ జనరల్ నలమడ ఉత్తమకుమార్ రెడ్డి మగ కాంగ్రెస్ 80835 గుంటకండ్ల జగదీష్‌రెడ్డి మగ తెరాస 51641
1972 278 హుజూర్‌నగర్ జనరల్ కీసర జితేందర్‌రెడ్డి [5] మగ స్వతంత్ర అభ్యర్థి 41007 అక్కిరాజు వాసుదేవరావు మగ కాంగ్రెస్ 26699
1967 278 హుజూర్‌నగర్ జనరల్ అక్కిరాజు వాసుదేవరావు మగ కాంగ్రెస్ 26618 దొడ్డా నర్సయ్య మగ CPM 23730
1962 297 హుజూర్‌నగర్ జనరల్ అక్కిరాజు వాసుదేవరావు మగ కాంగ్రెస్ 25394 దొడ్డా నర్సయ్య మగ CPI 22537
1957 83 హుజూర్‌నగర్ జనరల్ దొడ్డా నర్సయ్య[6] మగ PDF 21521 వి.బాస్కర్ రావు మగ కాంగ్రెస్ 15634


2009 ఎన్నికలు

మార్చు

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరఫున నలమడ ఉత్తమకుమార్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా చెరువుపల్లి సైదయ్య, ప్రజారాజ్యం పార్టీ నుండి ఎం.శ్రీనివాస్, లోక్‌సత్తా పార్టీ తరఫున కె.శ్రీనివాస్ రెడ్డి పోటీచేశారు.[7]

ఫలితాలిలా ఉన్నాయి.[1]

క్ర.సం. అభ్యర్థి పార్టీ వోట్లు
1 నలమడ ఉత్తమకుమార్ రెడ్డి కాంగ్రెస్ 80835
2 గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తె.రా.స. 51641
3 మేకల శ్రీనివాసరావు ప్రజారాజ్యం పార్టీ 22612
4 చెరువుపల్లి సైదయ్య భా.జ.పా. 3267
5 కడియం శ్రీనివాసరెడ్డి లోక్ సత్తా పార్టీ 1992
6 ఎరుకు పిచ్చయ్య స్వతంత్ర 1632
7 కె.వి. శ్రీనివాసాచార్యులు స్వతంత్ర 1434
8 మామిడి సుదర్శన్ బహుజన సమాజ పార్టీ 1216
9 కలకండ తిరుపతయ్య స్వతంత్ర 835
10 వట్టికూటి రామారావు స్వతంత్ర 581
11 బొల్లం మల్లయ్య యాదవ్‌ స్వతంత్ర 523
12 కొసనం కొండలు స్వతంత్ర 447
13 గాదె ప్రభాకరరరెడ్డి స్వతంత్ర 425

2018 ఎన్నికల్లో

మార్చు

2018లో శాసనసభ ఎన్నికలు జరగ్గా హుజూర్‌నగర్ నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గెలిచారు. ఆ ఎన్నికలో మొత్తం 1,94,493 ఓట్లు పోలవగా అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి 92,996 ఓట్లు సాధించారు. శానంపూడి సైదిరెడ్డి 85,530 ఓట్లు పొందారు. దీంతో సుమారు 7 వేల ఓట్ల ఆధిక్యంతో ఉత్తమ్ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లు కూటమిగా ఏర్పడడంతో అక్కడ టీడీపీ నుంచి అభ్యర్థిని నిలపలేదు.ఈసారి కాంగ్రెస్, టీడీపీలు వేర్వేరుగా పోటీ చేశాయి. టీడీపీ నుంచి చావా కిరణ్మయి తొలిసారి ఎన్నికల బరిలో దిగారు.కోదాడలో ఓటమి.. హుజూర్‌నగర్‌లో పోటీ ప్రస్తుతం హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీపడిన పద్మావతి 2018 శాసనసభ ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఆమె టీఆరెస్ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2014లో కోదాడ నుంచి పద్మావతి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో ఓటమి తరువాత ఇప్పుడు తన భర్త ప్రాతినిధ్యం వహించిన హుజూర్‌నగర్ ఖాళీ కావడంతో అక్కడ అభ్యర్థిగా బరిలో దిగారు.

2019 ఉప ఎన్నిక

మార్చు

అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవడంతో హుజూర్‌నగర్ శాసనసభ సీటు ఖాళీ అయింది. దాంతో, ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. 21వ తేదీన జరిగిన ఈ ఉపఎన్నికల్లో 84.75 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ 2014 సార్వత్రిక ఎన్నికలలో 81.18 శాతం, 2018 శాసనసభ ఎన్నికల్లో 86. 38 శాతం పోలింగ్ నమోదైంది. అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన సైదిరెడ్డికి 113094 ఓట్లు (56.34 శాతం) పోలవ్వగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డికి 69736 ఓట్లు (34.74 శాతం)లభించాయి.శానంపూడి సైదిరెడ్డి 43359 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. స్వతంత్ర అభ్యర్థి సపవత్ సుమన్‌కు 2697 ఓట్లు (1.34 శాతం), బీజేపీ అభ్యర్థి డాక్టర్ కోట రామారావుకు 2638 ఓట్లు (1.31 శాతం), నోటాకు 506 ఓట్లు (0.25 శాతం) లభించాయి.

హుజూర్‌నగర్ నియోజకవర్గం వివరాలు
మొత్తం ఎలక్టర్లు 223686
మొత్తం ఓట్లు 193425
మొత్తం అభ్యర్థులు 16
మొత్తం పురుష ఎలక్టర్లు 110410
మొత్తం మహిళా ఎలక్టర్లు 113266
తృతీయ లింగం ఎలక్టర్లు 10
మొత్తం పురుష ఓటర్లు 96046
మొత్తం మహిళా ఓటర్లు 97379

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Eenadu (12 November 2023). "37 ఏళ్ల తర్వాత.. హుజూర్‌నగర్‌". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.
  2. Andrabhoomi (13 November 2018). "మంత్రుల నగరి.. హుజూర్‌నగర్". www.andhrabhoomi.net. Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. Mana Telangana (28 September 2019). "ఉమ్మడి నల్లగొండ ఎన్నికల తీరు". Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.
  4. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  5. Sakshi (28 August 2013). "తెలంగాణ కేసరి: కీసర జితేందర్‌రెడ్డి". Sakshi. Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
  6. Sakshi (20 October 2023). "ఏక్‌బార్‌.. ఎమ్మెల్యే". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  7. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009