పుట్టింటి పట్టుచీర
పుట్టింటి పట్టుచీర బోయిన సుబ్బారావు దర్శకత్వంలో 1990లో విడుదలైన కుటుంబకథా చిత్రం. ఇందులో సురేష్, యమున ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మహిళా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.[1] అక్క తమ్ముళ్ళ సెంటిమెంటుతో ఈ సినిమా మంచి విజయం సాధించింది.[2][3] ఈ చిత్రాన్ని టీనా ఇంటర్నేషనల్ పతాకంపై ఎ. కృష్ణమూర్తి నిర్మించాడు. జె. వి. రాఘవులు సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పాటలన్నీ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాటలు పాడారు.
పుట్టింటి పట్టుచీర | |
---|---|
దర్శకత్వం | బోయిన సుబ్బారావు |
రచన | కేశవ్ రాథోడ్ (కథ), గణేష్ పాత్రో (మాటలు) |
నిర్మాత | ఎ. కృష్ణమూర్తి |
తారాగణం | సురేష్ , యమున |
ఛాయాగ్రహణం | వి. ప్రతాప్ |
కూర్పు | కె. ఎ. మార్తాండ్, బి. సత్యం |
సంగీతం | జె. వి. రాఘవులు |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 4 October 1990 |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- యమున
- సురేష్
- చిన్నా
- గొల్లపూడి మారుతీరావు
- దివ్య
- రాళ్ళపల్లి
- గుంటూరు శాస్త్రి
- ప్రదీప్ శక్తి
- అనంత్
- తాతినేని రాజేశ్వరి
- సత్యప్రియ
- శ్రీలక్ష్మి
- జానకి
- మాస్టర్ హిమగిరి
- ఆయేషా జలీల్
సాంకేతిక వర్గం
మార్చు- కళ: కె. ఎల్. ధర
- దుస్తులు: కృష్ణ
- పోరాటాలు: జూడో రత్నం
- నృత్యాలు: తార, ప్రసాద్
- మేకప్: సి.హెచ్. సుబ్రహ్మణ్యం, పి. శోభలత
- పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్
పాటలు
మార్చుఈ సినిమాకు జె. వి. రాఘవులు సంగీత దర్శకత్వం వహించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ చిత్రంలో ఐదు పాటలున్నాయి. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర పాటలు పాడారు.[4]
- హల్లో పిల్లా
- కన్నారా కళ్ళారా
- నవ్వమ్మా బంగారు
- జాబులెన్ని రాసినా
- ఆడజన్మకి
మూలాలు
మార్చు- ↑ "'Atharintiki' is like 'Puttinti Pattu Cheera'". Cine Josh (in english). Archived from the original on 2020-06-03. Retrieved 2020-06-03.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "అనుబంధాల వాలెంటైన్". Sakshi. 2019-02-10. Retrieved 2020-06-03.
- ↑ "వెండితెర రక్షాబంధనం - Manam News Telugu". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-03. Retrieved 2020-06-03.
- ↑ "ఫుట్టింటి పట్టుచీర (1990)". mio.to. Archived from the original on 2020-06-03.