పురుషుల కేశాలంకరణ

ఒకప్పుడు అందం కేవలం స్త్రీకే పరిమితం అనే భావన ఉండేది. కానీ మారుతోన్న కాలం ప్రకారం, ఈ భావన కూడా మారుతూ వస్తోన్నది. కేశాలంకరణ, పురుషుల కేశాలంకరణలు ఇందుకు భిన్నమేమీ కావు. ఒకప్పుడు భారతీయ పురుషుల కేశాలంకరణ శైలులు కేవలం వ్రేళ్ళ మీద లెక్కపెట్టగలిగినన్ని మాత్రమే ఉండేవి. కాలానుగుణంగా మారుతోన్న పురుషుల ఫ్యాషన్ లు, వాటికి సరితూగే వారి కేశాలంకరణలు ఇప్పుడు సర్వసాధారణమైపోయింది.

మనం అత్యంత సాంప్రదాయికం అనుకొనే ఈ హైందవ కేశాలంకరణ పేరు Oseledets

భావనలు

మార్చు

పురుషులు కత్తిరించినబడ్డ జుట్టులో, స్త్రీలు పొడవాటి జుట్టుతో ఉంటారు/ఉండాలనే భావన సర్వత్రా నెలకొని ఉన్ననూ, వీటికి మినహాయింపులు కూడా ఉన్నాయి. ఇందుకు సౌకర్యం, ఇష్టాయిష్టాలు, సంస్కృతి సంప్రదాయాలు, సమకాలీన ఫ్యాషన్లు కారణాలుగా చెప్పుకొనవచ్చును. జడలు వేసుకొనే, కొప్పులు కట్టుకొనే పురుషులూ ఉన్నారు; మెడ, భుజాల వరకు మాత్రం జుట్టు పెంచే స్త్రీలూ ఉన్నారు.

చరిత్ర

మార్చు

50, 60 దశకాలలో అందమైన, హుందాతనం కలిగిన పురుషుడి వివరణ: ఆముదం వేసి, ప్రక్క పాపిట తీసి, ఒత్తైన, రింగురింగుల జుట్టు, వెనుక మషీన్ కట్, పెన్సిల్ కట్ మీసాలు, నున్నగా గీయబడ్డ గడ్డం. అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు, హరనాథ్ వంటి అప్పటి సినీదిగ్గజాలు ఈ గెటప్ లోనే కనబడేవారు.

70వ దశకంలో వచ్చిన బెల్ బాటం ప్యాంట్లకు హిప్పీ హెయిర్ స్టైల్ నప్పేది. అమితాబ్ బచ్చన్ అప్పట్లో ఎక్కువగా ఈ స్టైల్ లోనే కనబడేవారు.

80, 90వ దశకాలలో భారతీయ యువ పురుషులు వెనుకవైపు కేశాలను ఎక్కువగా పెంచారు. అనిల్ కపూర్, సంజయ్ దత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అక్కినేని నాగార్జున వంటి వారు ఈ శైలిలో తళుక్కుమన్నారు.

2016 లో విడుదలైన నాన్నకు ప్రేమతో చిత్రంలో తారక్ పెట్టిన పాంపడార్ హెయిర్ స్టైల్, హిప్స్టర్ గడ్డం తెలుగు యువకులను ఉర్రూతలూపాయి.

ఇతర దేశాలలో వివిధ పురుషుల కేశాలంకరణలు

మీసాలు

మార్చు

మీసాలలో వివిధ రకాలు.

గడ్డం

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు