నాన్నకు ప్రేమతో

2016 తెలుగు సినిమా

నాన్నకు ప్రేమతో 2016 జనవరి 13న విడుదలైన తెలుగు సినిమా.[1] నాన్నకు ప్రేమతో సంక్రాంతికి ప్రేమతో ట్రైలర్ [2]

నాన్నకు ప్రేమతో
చిత్ర ప్రచార పత్రిక
దర్శకత్వంసుకుమార్
రచనసుకుమార్
నిర్మాతబివిఎస్ఎన్ ప్రసాద్
తారాగణంఎన్.టి.ఆర్. (తారక్)
రకుల్ ప్రీత్ సింగ్
డా.రాజేంద్ర ప్రసాద్
జగపతి బాబు
ఛాయాగ్రహణంవిజయ్ సి చక్రవర్తి
కూర్పునవీన్ నూలి
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లురిలాయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
13 జనవరి 2016
దేశంభారతదేశం
భాషతెలుగు

అభిరామ్ (ఎన్టీఆర్) లండన్లో ఓ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిగా పరిచయం అవుతాడు. తొలి సన్నివేశం లోనే తన భావోద్వేగాలనును దాచుకోకుండా బయటపెట్టేసే వ్యక్తిగా కనిపిస్తాడు అభిరామ్. ఉద్యోగం పోవటంతో తన లాంటి ఎంతోమంది నిరుద్యోగులతో కలిసి కెయంసీ పేరుతో ఓ కొత్త సంస్థ ప్రారంభిస్తాడు. అదే సమయంలో తన తండ్రి సుబ్రమణ్యం (గద్దె రాజేంద్ర ప్రసాద్ )కు సీరియస్ గా ఉందని తెలియటంతో ఇంటికి వస్తాడు. తన అన్నదమ్ముల (రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్) ఇంట్లో తండ్రిని కలుసుకున్న అభిరామ్, ఆఖరి క్షణాల్లో ఆయన్ని ఆనందంగా ఉంచాలనుకుంటాడు. కోటీశ్వరుడైన రమేష్ చంద్ర ప్రసాద్, సుబ్రమణ్యంగా పేరు మార్చుకోవడానికి కారణమైన కృష్ణమూర్తి కౌటిల్య (జగపతిబాబు) పతనమే తన తండ్రికి ఆనందాన్ని ఇస్తుందని తెలుసుకొని కృష్ణమూర్తి పని పట్టడానికి బయలుదేరుతాడు.

ఈ క్రమంలో లో తనకు సాయం చేయటం కోసం కృష్ణమూర్తి వల్లే నష్టపోయిన మరో ముగ్గురిని ఎంపిక చేసుకుంటాడు. కృష్ణమూర్తిని దెబ్బకొట్టాడానికి అన్నింటికన్నా సులభమైన మార్గం అతని కూతురిని ప్రేమించటమే అని దివ్యాంక (రకుల్ ప్రీత్ సింగ్)ను ప్రేమలోకి దించుతాడు. ఆ తరువాత కృష్ణమూర్తిని ఓడించడానికి అభిరామ్ ఎత్తులు, అభిరాంను ఎదుర్కొనటానికి కృష్ణమూర్తి పై ఎత్తులు, చివరకు కృష్ణమూర్తి పై అభిరామ్ ఎలా పై చేయి సాధించాడు అన్నదే మిగతా కథ.

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

సంభాషణలు

మార్చు
  • తన రెండు గోల్ఫ్ బంతులతో ఆడే ఒక చిన్న ఆటతో అందరినీ ఓడించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే కృష్ణమూర్తి, అభిరాంతో ఆడే ముందు:
కృష్ణమూర్తి: నేను ఆడితే గెలుస్తాను
అభిరాం: నేను గెలుస్తానని తెలిసిన తర్వాతే ఆడుతాను
  • నాన్న మీద ప్రేమను వ్యక్తపరిచే సన్నివేశంలో అభిరాం డైలాగ్
అందరు టైమ్ ని నిముషాల్లో సెకన్లలో కొలిస్తే, నేను మాత్రం మా నాన్న గుండె చప్పుడు తో కొలుస్తాను

పాటలు

మార్చు
క్రమసంఖ్య పేరుగీత రచనగాయకులు నిడివి
1. "ఫాలో ఫాలో యూ"  దేవీశ్రీ ప్రసాద్ఎన్.టి.ఆర్. (తారక్) 03:38
2. "నా మనసు నీలో"  భాస్కరభట్ల రవికుమార్దేవీశ్రీ ప్రసాద్, శర్మిల 04:21
3. "డోంట్ స్టాప్"  చంద్రబోస్ (రచయిత)రఘు దీక్షిత్ 03:53
4. "లవ్ మి అగైన్"  చంద్రబోస్సూరజ్ సంతోష్ 04:06
5. "లవ్ దెబ్బ"  చంద్రబోస్దీపక్, శ్రావణ భార్గవి 03:56
19:54

ప్రత్యేకతలు

మార్చు

పురస్కారాలు

మార్చు

2016 సైమా అవార్డులు

  1. ఉత్తమ నటి
  2. సైమా ఉత్తమ ప్రతినాయకుడు (జగపతిబాబు)

మూలాలు

మార్చు
  1. Sriram. "Jr NTRs Upcoming Maa Nannaku Prematho Movie Release Date Announced". indread.com. Retrieved 18 September 2015.
  2. Maveen. "నాన్నకు ప్రేమతో సంక్రాంతికి ప్రేమతో ట్రైలర్". tfpc.in. Retrieved 9 January 2016.[permanent dead link]
  3. ఈనాడు, ఆదివారం సంచిక (15 July 2018). "ఈడెవడో భలే కట్ చేశాడ్రా". మహమ్మద్ అన్వర్. Archived from the original on 13 మార్చి 2020. Retrieved 13 March 2020.

బయటి లంకెలు

మార్చు