పూరుడు
పూరుడు యయాతి, శర్మిష్ఠల కుమారుడు.[1] ఇతని భార్య కౌసల్య, కుమారుడు జనమేజయుడు.
భాగవతంలో
మార్చుభాగవత పురాణంలోని తొమ్మిదవ పుస్తకం పంతొమ్మిదవ అధ్యాయంలో పూరుడికి కుయాడు, తుర్వాసు, ద్రుహ్యూ, అను అనే నలుగురు సోదరులు ఉన్నట్లు వర్ణించబడింది. యయాతికి శుక్రాచార్యుడు ఇచ్చిన శాపం వల్ల ముసలితనం వచ్చింది.[2] కాని భోగలాలసత్వం ఇంకా ఎక్కువగా ఉండటంతో కుమారులలో ఎవరైనా తన ముసలితనాన్ని తీసుకొని, యవ్వనాన్ని ప్రసాదించమని అడుగుతాడు. పూరుడు ఒక్కడే అందుకు అంగీకరిస్తాడు. మిగతా ముగ్గురు కుమారులు అందుకు నిరాకరించగా, రాజ్యార్హతను కోల్పోతారు. యయాతి పూరుడి యౌవనాన్ని స్వీకరించి, మరికొంత కాలం సుఖములను అనుభవించి, పూరుడిని రాజ్యాభిషిక్తున్ని చేశాడు. అతని కుమారుడు ప్రచిన్వాట్; అతని కుమారుడు ప్రవరా; అతని కుమారుడు మనస్యు.
మహాభారతంలో
మార్చుమహాభారతం - ఆది పర్వంలో ఇతను గంగా మైదానంలో తన రాజ్యాన్ని వారసత్వంగా పొందాడని చెప్పబడింది. ఇతని భార్య పౌష్టి ద్వారా ప్రవీర, ఈశ్వర, రౌద్రస్వ అనే ముగ్గురు శక్తివంతమైన వీర కుమారులు కలిగారు. పూరుడి తరువాత ప్రవీర, తరువాత అతని కుమారుడు మనస్యు వచ్చాడు.[3] పూరుడు ప్రపంచ చక్రవర్తిగా పరిపాలించాడు. ఇది ఇతని శక్తిని, వ్యక్తుల హక్కును తెలియజేస్తుంది.[4][2] తరువాతికాలంలో ఇతని రాజవంశం పురుష వంశంగా మారింది, తరువాత దీనిని పాండవులు, కౌరవుల కురు వంశంగా మార్చారు.
ఋగ్వేదంలో
మార్చుపూరుడిని ఋగ్వేదంలో రాజుగా, ఆదిత్యులకు తండ్రిగా, అదితిని వివాహం చేసుకొని, సరస్వతీ నది ప్రాంతంలో పాలన చేశాడని చెప్పబడింది.[5]
మూలాలు
మార్చు- ↑ Mayank Srivastava. "Story of Devayani, Yayati, Sharmishtha, Puru". newstrend,news (in hindi). Retrieved 14 July 2020.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ 2.0 2.1 David Frawley (1993). Gods, Sages and Kings: Vedic Secrets of Ancient Civilization. Motilal Banarsidass. pp. 137–. ISBN 978-81-208-1005-1.
- ↑ Krishna-Dwaipayana Vyasa (31 March 2008). The Mahabharata of Krishna-Dwaipayana Vyasa First Book Adi Parva. Echo Library. pp. 214–. ISBN 978-1-4068-7045-9.
- ↑ Yayati
- ↑ K. C. Singhal; Roshan Gupta (1 January 2003). The Ancient History of India, Vedic Period: A New Interpretation. Atlantic Publishers & Dist. pp. 48–. ISBN 978-81-269-0286-6.
ఇతర లంకెలు
మార్చు- Dowson, John (1888). A Classical Dictionary of Hindu Mythology and Religion, Geography, History, and Literature. Trubner & Co., London.
- Mani, Vettam (1964). Puranic Encyclopaedia. Motilal Banarsidas, Delhi. ISBN 0-842-60822-2.