పెద్దరికాలు సారథీ ఫిల్మ్‌స్ బ్యానర్‌పై 1957, ఏప్రిల్ 25న విడుదలైన తెలుగు చలనచిత్రం.

పెద్దరికాలు
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం తాపీ చాణక్య
తారాగణం కొంగర జగ్గయ్య ,
అంజలీదేవి
సంగీతం మాస్టర్ వేణు
నిర్మాణ సంస్థ సారధీ ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

భద్రయ్య తను కోడలికి పెట్టిన నగలను తాకట్టు పెట్టిన వియ్యంకుడి మీద కోపంతో కొడుకునీ, కోడలినీ కాకుండా చేస్తాడు. కోడల్నీ, ఆమె కన్నబిడ్డనీ కూడా వేరు చేస్తాడు. నగలు లేకుండా ఇల్లు గడప త్రొక్కడానికి వీలులేదని వెళ్ళగొడతాడు. భద్రయ్య పెద్దరికపు చెలాయింపుకు తగ్గట్టే అతని కొడుకు నోట మాటరానితనం ఈ రెండు రకాల మనుషుల వల్ల ఇంటి కోడలు సుశీల నలిగిపోతుంది. ఆమెను చూసి ఆమె తండ్రి శేషయ్య కుమిలిపోతాడు. మనోవ్యాధితో మరణిస్తాడు. దాదాపు ఆ సమయానికే భద్రయ్య ఇల్లాలు, కూతురు, కొడుకు ఇంటి పెద్దను ఎదిరించి ఇల్లువదలి వెళ్లిపోతారు. కుమారుడు సరాసరి అత్తగారింటికి వస్తాడు భార్యకు క్షమాపణ చెప్పి తీసుకువెళదామని. కాని అప్పటికే నరహరి అనే దుర్మార్గుడు సుశీలను మోసగించి లేవదీసుకు పోయి ఉంటాడు. భద్రయ్య చిట్టచివరికి పశ్చాత్తపపడతాడు. పతాక సన్నివేశంలో నరహరి తన పన్నాగం సుశీల భర్తకు వివరంగా చెప్పి సుశీల పతివ్రత అనే సంగతిని గట్టిగా చెప్పడంతో కథ సుఖాంతమౌతుంది[1].

పాటలు

మార్చు
  1. అందమంతా నాదే చందమంతా నాదే యిక సుందరాంగు - పి.సుశీల - రచన: తాపీ ధర్మారావు
  2. ఇద్దరి మనసులు ఏకం చేసి ఎండా వానల దూరం - పి.సుశీల, ఘంటసాల - రచన: కొసరాజు
  3. ఈ వేళ హాయిగా మనస్సెటో పోయెగా జగమంతా - పి.సుశీల బృందం - రచన: తాపీ ధర్మారావు
  4. ఎంత చెప్పిన వినుకోరోయి రోజులు మారినవనుకోరోయి మోసంలో - జిక్కి - రచన: కొసరాజు
  5. ఓ చక్కని తండ్రీ రామయ్యా నీవెక్కడుంటివయ్యా - ఘంటసాల బృందం - రచన: కొసరాజు
  6. పండగంటే పండగ బలేబలే పండగ దేశానికి పండగ - జిక్కి బృందం - రచన: కొసరాజు
  7. పదవమ్మా మాయమ్మ ఫలియించె - ఆర్.బాలసరస్వతీ దేవి, పి.సుశీల, వైదేహి - రచన: కొసరాజు
  8. మోటలాగే ఎద్దులకు పాటుచేసే బాబులకు ఎంత - ఘంటసాల, జిక్కి బృందం - రచన: కొసరాజు
  9. రైలుబండి దౌడు చూడండి ఓ బాబుల్లారా వేళ తప్పితే - ఘంటసాల బృందం - రచన: కొసరాజు
  10. లాలి నను కన్నయ్య లాలి చిన్నయ్యా కుదురు - ఆర్.బాలసరస్వతిదేవి - రచన: కొసరాజు
  11. వెన్నెల రాదా వేదనలేనా శోధన - ఆర్.బాలసరస్వతిదేవి - రచన: అనిసెట్టి

మూలాలు

మార్చు
  1. సంపాదకుడు (28 April 1957). "సారథీ వారి "పెద్దరికాలు"". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 44 సంచిక 26. Retrieved 16 February 2018.[permanent dead link]

బయటి లింకులు

మార్చు