తాపీ చాణక్య
తాపీ చాణక్య చలనచిత్ర దర్శకుడు. తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు అయిన తాపీ ధర్మారావు నాయుడు ఇతని తండ్రి. తల్లి అన్నపూర్ణమ్మ. ఇతడు 1925లో విజయనగరంలో జన్మించాడు. ఇతడు సినిమారంగంలో ప్రవేశించడానికి ముందు భారత సైన్యంలో రేడియో టెలిగ్రాఫిస్టుగా పనిచేశాడు. పల్లెటూరి పిల్ల చిత్రంలో బి.ఎ.సుబ్బారావు వద్ద సహాయకునిగా పనిచేశాడు. రోజులు మారాయి చిత్రానికి దర్శకత్వంతో పాటు కథను కూడా అందించాడు. తెలుగుతోపాటు హిందీ, తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
సినిమాల జాబితా
మార్చుతెలుగు
మార్చు- అంతా మనవాళ్లే (1954)
- రోజులు మారాయి (1955)
- పెద్దరికాలు (1957)
- ఎత్తుకు పైఎత్తు (1958)
- భాగ్యదేవత (1959)
- కుంకుమ రేఖ (1960)
- జల్సారాయుడు (1960)
- కలసి ఉంటే కలదు సుఖం (1961)
- కానిస్టేబులు కూతురు (1963)
- రాముడు భీముడు (1964)
- వారసత్వం (1964)
- సి.ఐ.డి. (1965)
- అడుగు జాడలు (1966)
- విధివిలాసం (1970)
- బంగారుతల్లి (1971)
- బందిపోటు భయంకర్ (1972)
తమిళం
మార్చు- పుదియ పతై (1960)
- ఎంగ వీటు పెన్ (1965)
- నాన్ అనైట్టల్ (1966)
- ఒలి విళక్కు (1968)
- పుదియ భూమి (1968)
హిందీ
మార్చు- రామ్ ఔర్ శ్యామ్ (1967)
- మాధవి (1969)
- బిఖరే మోతి (1971)
- మన్ మందిర్ (1971)
- జాన్‌వర్ ఔర్ ఇన్‌సాన్ (1972)
- మానవతా (1972)
- సుబహ్ ఓ షామ్ (1972)
- గంగ మంగ (1973)
మరణం
మార్చుఇతడు తన 48వ యేట 1973, జూలై 14న మరణించాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.[1]
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ సంపాదకుడు (1 August 1973). "తాపీ చాణక్య". విజయచిత్ర. 8 (2): 87.