పెద్ద అంబర్‌పేట్ పురపాలకసంఘం

తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా కు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ

పెద్ద అంబర్‌పేట్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] పెద్ద అంబర్‌పేట్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం లోని ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

పెద్ద అంబర్‌పేట్‌
—  పురపాలకసంఘం  —
పెద్ద అంబర్‌పేట్‌ is located in తెలంగాణ
పెద్ద అంబర్‌పేట్‌
పెద్ద అంబర్‌పేట్‌
అక్షాంశరేఖాంశాలు: 17°21′25″N 78°40′06″E / 17.3569462°N 78.6682395°E / 17.3569462; 78.6682395
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండలం అబ్దుల్లాపూర్‌మెట్
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 54.91 km² (21.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 27,813
 - పురుషుల సంఖ్య 14,197
 - స్త్రీల సంఖ్య 13,616
 - గృహాల సంఖ్య 6,759
పిన్ కోడ్ - 501505
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చరిత్ర

మార్చు

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న పెద్ద అంబర్‌పేట్, 2013, మార్చి 22న పురపాలక సంఘంగా ఏర్పడింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లోని పెద్ద అంబర్‌పేట్, కుంట్లూరు, పసుమాముల, తట్టి అన్నారం మొదలైన గ్రామ పంచాయతీలను కలిపి పెద్ద అంబర్‌పేట్‌ పురపాలకసంఘంగా ఏర్పాటుచేశారు.

భౌగోళికం

మార్చు

పెద్ద అంబర్‌పేట్‌ 54.91 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 7°19′19″N 78°38′38″E / 7.322°N 78.644°E / 7.322; 78.644 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 27813 మంది కాగా, అందులో 14197 మంది పురుషులు, 13616 మంది మహిళలు ఉన్నారు. 6759 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 5 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]

పౌర పరిపాలన

మార్చు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో నరేందర్ కొండూటి చైర్‌పర్సన్‌గా, ఎం. నటరాజన్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[5]

వార్డు కౌన్సిలర్లు

మార్చు
  1. గైరాల శ్రీనివాస్ గౌడ్
  2. చెవుల స్వప్న
  3. మోతె మణమ్మ
  4. వడ్డేపల్లి విద్యావతి
  5. బొర్ర అనురాధ
  6. పసుల రాజేందర్
  7. దండెం కృష్ణారెడ్డి
  8. పండుగుల జయశ్రీ
  9. చల్లూరి మురళీధర్ రెడ్డి
  10. మల్రెడ్డి దీపికారెడ్డి
  11. సామ అనుషారెడ్డి
  12. పబ్బతి లక్ష్మణ్
  13. మద్ది నరేందర్ రెడ్డి
  14. తొండేపు రోహిణి రెడ్డి
  15. పాశం అర్చన
  16. దేవిడి గీతా
  17. మండల కోటేశ్వర్ రావు
  18. రామవత్ పరశురాం
  19. చామ సంపూర్ణరెడ్డి
  20. జోర్క గీత
  21. ఓరుగంటి సుజాత
  22. చెవుల హరిశంకర్
  23. సిద్దంకి కృష్ణారెడ్డి
  24. కందడ అనుపమ

మూలాలు

మార్చు
  1. "Pedda Amberpet Municipality". peddaamberpetmunicipality.telangana.gov.in. Retrieved 26 March 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 31 March 2021.
  3. "Basic Information of Municipality, Peddaamberpet Municipality". peddaamberpetmunicipality.telangana.gov.in. Retrieved 31 March 2021.
  4. admin (2020-05-08). "Pedda Amberpet municipality councilors list 2020". Telangana data. Retrieved 17 May 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. skannegari. "Pedda Amberpet Municipality - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 11 ఏప్రిల్ 2021. Retrieved 11 April 2021.

వెలుపలి లంకెలు

మార్చు