పెద్ద అంబర్పేట్
పెద్ద అంబర్పేట్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని గ్రామం.[1].
పెద్ద అంబర్పేట్ | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°21′25″N 78°40′06″E / 17.3569462°N 78.6682395°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మండలం | హయాత్నగర్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
ఎత్తు | 505 m (1,657 ft) |
జనాభా (2011) | |
- మొత్తం | 8,541 |
- పురుషుల సంఖ్య | 4,292 |
- స్త్రీల సంఖ్య | 4,249 |
- గృహాల సంఖ్య | 2,094 |
పిన్ కోడ్ | Pin Code : 501505 |
ఎస్.టి.డి కోడ్: 08415 |
ఈ గ్రామం హయత్ నగర్ కు 10 కి.మీ. దూరంలో ఉంది.
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
మార్చు2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని హయాత్నగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన అబ్దుల్లాపూర్మెట్ మండలంలోకి చేర్చారు.[2]
గణాంకాలు
మార్చు2011భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా- మొత్తం 8,541 - పురుషుల సంఖ్య 4,292 - స్త్రీల సంఖ్య 4,249 - గృహాల సంఖ్య 2,094
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా మొత్తం జనాభా 6424 పురుషులు. 3326, స్త్రీలు 3098, నివాస గృహాలు 1377. విస్తీర్ణము. 1614 హెక్టార్లు. ఇక్కడి ప్రధాన భాష తెలుగు.
సమీప గ్రామాలు
మార్చుఈ గ్రామం కుంట్లూరుకు 4 కి.మీ. లస్కర్ గూడకు 4 కి.మీ. పసుమామలకు 4 కి.మీ. కోహెడకు 54 కి.మీ.అబ్దుల్లాపూర్ మెట్ కు 5 కి.మీ. దూరములో ఉంది.
ఉపగ్రామాలు
మార్చులక్ష్మారెడ్డి పాలెం.
పాఠశాలలు
మార్చుఇక్కడ మూడు పాఠశాలలు ఉన్నాయి. అవి 1. రమాదేవి పబ్లిక్ ప్రైమరి స్కూలు, 2. రాజశ్రీ విద్యా మందిర్, 3. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.[3]
రవాణా సౌకర్యాలు
మార్చుఈ గ్రామానికి ఎల్.బి.నగర్ 15 కి.లో మీటర్ల దూరములో ఉంది. ఇక్కడికి, పరిసర ప్రాంతాలకు మంచి రహదారి వ్వవస్త కలిగి యుండి, ఆర్.టి.సి బస్సుల సౌకర్యము కూడా ఉంది. ఈ గ్రామానికి 10 కి.మీ. లోపు రైలు వసతి లేదు. కాని ప్రధాన రైల్వేస్టేషను సికింద్రాబాదు ఇక్కడికి 22 కి.మీ దూరములో ఉంది. అక్కడి నుండి దేశములోని పలు ప్రాంతాలకు రైలు వసతి ఉంది.
పట్టణ పార్కు
మార్చుపెద్ద అంబర్పేట్ కలాన్ లోని ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకుని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పెద్ద అంబర్పేట్ పట్టణ పార్కు ఏర్పాటుచేయబడింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా 2021, జూలై 1న ఐటీ, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు మొక్కను నాటి ఏడవ విడత హరితహారాన్ని, కలాన్లో ఏర్పాటు చేసిన పట్టణ పార్కును ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, అటవీ-దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, సురభి వాణీదేవి, ప్రభుత్వ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.[4][5]
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-01.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-08. Retrieved 2016-06-04.
- ↑ "ఏడో విడత హరితహారం.. ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యం". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-07-01. Archived from the original on 2023-06-20. Retrieved 2023-06-20.
- ↑ "Palle, Pattana Pragathi launched". The Hindu. 2021-07-01. ISSN 0971-751X. Archived from the original on 2021-07-01. Retrieved 2023-06-20.