పెబ్బేరు పురపాలకసంఘం

పెబ్బేరు పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] పెబ్బేరు పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం లోని వనపర్తి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

పెబ్బేరు పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
పెబ్బేరు పురపాలకసంఘం is located in తెలంగాణ
పెబ్బేరు పురపాలకసంఘం
పెబ్బేరు పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 16°07′23″N 77°59′48″E / 16.1230643°N 77.9967043°E / 16.1230643; 77.9967043
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి
మండలం పెబ్బేరు
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ కరుణశ్రీ
 - వైస్ చైర్‌పర్సన్‌ మేకల కర్రెస్వామి
వైశాల్యము
 - మొత్తం 18 km² (6.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 15,602
 - పురుషుల సంఖ్య 8,040
 - స్త్రీల సంఖ్య 7,562
 - గృహాల సంఖ్య 5,149
పిన్ కోడ్ - 509104
Area code(s) ఎస్.టి.డి కోడ్ - 08545
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చరిత్ర

మార్చు

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న పెబ్బేరు, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం

మార్చు

పెబ్బేరు 18 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 16°07′19″N 77°35′35″E / 16.122°N 77.593°E / 16.122; 77.593 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 150 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం వనపర్తి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 15602 మంది కాగా, అందులో 8040 మంది పురుషులు, 7562 మంది మహిళలు ఉన్నారు. 5149 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన

మార్చు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 12 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం కరుణశ్రీ చైర్‌పర్సన్‌గా, మేకల కర్రెస్వామి వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు

మార్చు
  1. ఎద్దుల కరుణశ్రీ
  2. మందా అక్కమ్మ
  3. కటమోని పార్వతి
  4. పతిమిని సువర్ణ
  5. గోపి బాబు
  6. గార్లపాటి రామకృష్ణ
  7. ఎం. ఎల్లస్వామి
  8. చిన్న ఎల్లారెడ్డి
  9. అశ్విని
  10. వడ్డెమోని పద్మ
  11. మేకల కర్రే స్వామి
  12. మేకల సుమతి

మూలాలు

మార్చు
  1. "Pebbair Municipality". pebbairmunicipality.telangana.gov.in. Archived from the original on 13 ఏప్రిల్ 2021. Retrieved 13 April 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 13 April 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 13 April 2021.
  4. "Basic Information of Municipality, Pebbair Municipality". pebbairmunicipality.telangana.gov.in. Archived from the original on 30 జూన్ 2022. Retrieved 13 April 2021.
  5. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 13 April 2021.
  6. admin (2020-05-18). "Pebbair municipality Councillors list 2020". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-18.

వెలుపలి లంకెలు

మార్చు